W.G: పాలకొల్లుకు చెందిన మరుధూరి నర్సింహాచార్యులు, బొచ్చు రవికుమార్ ‘నవ నారసింహ క్షేత్రాల’ సైకిల్ యాత్రకు బయలుదేరారు. ఇవాళ ఉదయం శ్రీ దాసోహ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. 20 రోజులపాటు 1800 కి.మీ. ఈ యాత్ర సాగనుందని, మంగళగిరి, వేదాద్రి, పెంచలకోన, అహోబిలం, కదిరి, ధర్మపురి, యాదగిరిగుట్ట నారసింహ క్షేత్రాలు దర్శించుకుంటామన్నారు.
PPM: సాలూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ ఛార్జిగా డాక్టర్ హేమా నాయక్ బాధ్యతలు స్వీకరించారు. వైజాగ్ భాజపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పీవీ ఎన్ మాధవ్ చేతులమీదుగా నియామకపత్రం అందుకున్నారు. పార్టీ అభి వృద్ధికి కృషి చేస్తానని, కూటమి పాలనలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని హేమానాయక్ అన్నారు.
NDL: కోవెలకుంట్ల మండల పరిధిలో వివిధ సబ్ స్టేషన్లలో వ్యవసాయ రంగానికి పగలు 9 గంటల విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఏఈ రామమోహన్ తెలిపారు. కొప్పర్ల, ఆమడాల, కలుగొట్ల, హరివరం వంటి పలు గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ అందుబాటులో ఉంటుందన్నారు. రైతులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
AKP: అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్ క్రీడామైదానంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో కైలాసపట్నం జట్టు విజేతగా నిలిచింది. అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో 16 టీమ్స్ పాల్గొన్నాయి. కైలాసపట్నం జట్టు ప్రథమ స్థానం దక్కించుకోగా, ఏటికొప్పాకకు ద్వితీయ స్థానం, చింతపల్లి జట్టు మూడో స్థానంలో నిలిచింది.
NLR: సైదాపురం మండలం ఊటుకూరు పరిధిలోని ఆదూరుపల్లి ఎస్టీ కాలనీ తోటలో ఆదివారం రాత్రి భార్యపై భర్త దాడి చేసిన ఘటన నెలకొంది. భార్యపై అనుమానంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపంతో భర్త కత్తితో భార్య మెడపై దాడి చేశాడు. భార్య తీవ్రంగా గాయపడింది. స్థానికులు 108 ద్వారా గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సత్యసాయి: సోమందేపల్లి మండలం కేతగాని చెరువు గ్రామంలో సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెద్దన్న మాట్లాడుతూ ఫేస్ యాప్ ఫోటోను వ్యతిరేకిస్తూ మేట్లకు ఉచితంగా సెల్ ఫోన్ ఇవ్వాలని, కూలీలకు పని ముట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
NDL: ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ జాయింట్ సెక్రటరీగా ఆదివారం డోన్ ఎంవిఐ క్రాంతికుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సహచర అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ పదవితో MVIల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని ఆయన తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు.
ATP: తాడిపత్రికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు రతన్ తేజ్ రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలకు ఎంపికయ్యారు. అనంతపురంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-9 క్రీడా పోటీలలో విజేతగా నిలిచి సత్తా చాటినట్లు కోచ్ సురేంద్రనాథ్ పేర్కొన్నారు. తన కుమారుడు ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల తండ్రి శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు.
EG:రాజమండ్రి లాలాచెరువు ఆస్తి యజమానులు అడ్వాన్స్ ఇంటి పన్ను చెల్లించాలని మున్సిపల్ అధికారులు పిలుపునిచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ముందుగానే చెల్లిస్తే రాయితీలు లభిస్తాయని తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఉదయం10:30గంటలకు నుండి లాలా చెరువు -2 సచివాలయంలో ప్రాపర్టీ టాక్స్ 2026-27 పాత బకాయిలు వడ్డీపై50% రాయితీ పొందవచ్చన్నారు
NLR: కాకాణి పూజిత ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, మహిళా నేతలు వేమూరి రాధాకృష్ణపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాధాకృష్ణ వ్యాఖ్యలు మహిళా గౌరవాన్ని దెబ్బతీశాయని, జర్నలిజం విలువలను దిగజార్చాయని పేర్కొన్నారు.
PPM: కురుపాంలో నివాసముంటున్న అప్పయ్యపేటకు చెందిన కర్రోతు శ్రీనివాసరావు అనే వ్యక్తి అదృశ్యం అయినట్టు ఎస్సై నారాయణ రావు సోమవారం తెలిపారు. కురుపాం నుంచి పాలకొండ వెళ్తున్నటు చెప్పి ఇప్పటికి ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబీకులు పిర్యాదు చేసారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9121109477 ఈ నెంబర్ కు తెలపాలన్నారు.
VZM: నిరుద్యోగ యువతకు, చిరు వ్యాపారులకు స్వయం ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఆదివారం కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామానికి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్త సింగంపల్లి ఎర్నిబాబుకు వెలుగు డి.ఆర్.డి. ఏ ద్వారా మంజూరైన సుమారు రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్ను అందజేశారు.
కర్నూలు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలను రేపు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున వేడుకలకు హాజరుకావాలని ఆమె కోరారు.
ప్రకాశం: పొదిలి మండలం పిచ్చిరెడ్డి తోట కాలనీలో సోమవారం సీఐ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో కార్డాన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అలానే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై ప్రజలను హెచ్చరించారు.