• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

స్వామివారి సేవలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా

CTR: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ ఏఈవో రవీంద్రబాబు, అర్చకులు, వేదపండితులు, ఇతర ఆలయ సిబ్బంది కూడా హాజరయ్యారు.

April 6, 2026 / 07:43 PM IST

‘టెంపుల్ సిటీగా తాడిపత్రి అభివృద్ధి చేయండి’

ATP: తాడిపత్రిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని MLA జేసీ అస్మిత్ రెడ్డి CM చంద్రబాబుని కోరారు. యాడికిలో సీఎంను కలిసి ఈ ప్రాంతంలోని చారిత్రక ఆలయాల ప్రాముఖ్యతను వివరించారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నుంచి సహకారం కావాలని విన్నవించారు.

April 6, 2026 / 07:40 PM IST

ప్రహరీ గోడ నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం తాడిచర్ల రోడ్డు శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే రామును కట్టావాని చెరువు ముస్లిం సోదరులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ఖబరస్థాన్‌కు (బరియల్ గ్రౌండ్) రక్షణగా ప్రహరీ గోడ నిర్మించాలని అబ్దుల్ కరీం, ఫైజు తదితరులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ.. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

April 6, 2026 / 07:35 PM IST

రేపు భవన నిర్మాణ కార్మికుల ధర్నా

AKP: సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7వ తేదీన కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము తెలిపారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి నుంచి కార్మికులకు ప్రమాద బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గృహ నిర్మాణ మెటీరియల్ రేట్లను తగ్గించాలన్నారు. రద్దు చేసిన భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని పునరుద్ధరించాలన్నారు.

April 6, 2026 / 07:35 PM IST

బాలింతలకు డ్రై ఫ్రూట్స్ పంపిణీ

TPT: తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో సోమవారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాలింతలకు డ్రై ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ సూపరింటెండెంట్ డా. ప్రమీల దేవి, సివిల్ సర్జన్ డా.రామనారాయణ రెడ్డి పర్యవేక్షణలో సుమారు 190 మంది బాలింతలకు డ్రై ఫ్రూట్స్ అందజేశారు. హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ద్వారా తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

April 6, 2026 / 07:34 PM IST

కనిగిరిలో నీటి భద్రతపై 100 రోజుల కార్యక్రమం

ప్రకాశం: కనిగిరిలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు జల వనరుల శాఖ ఆధ్వర్యంలో “నీటి భద్రత-సాగు నీటి సంఘాల బాధ్యత” పేరుతో 100 రోజుల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, సాగు నీటి సంఘాల ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నీటి వినియోగంలో బాధ్యత అవసరమని అధికారులు సూచించగా, సాగు నీటి సంఘాలు సమర్థంగా పని చేయాలన్నారు.

April 6, 2026 / 07:30 PM IST

తెనాలిలో వెడ్డింగ్ ఫ్రీ వర్క్ షాప్

GNTR: తెనాలిలో వీడియో గ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం వెడ్డింగ్ వర్క్ షాప్ నిర్వహించారు. సుల్తానాబాద్‌లో నికాన్ కంపెనీ సహకారంతో జరిగిన ఈ ఫ్రీ వెడ్డింగ్ వర్క్ షాప్‌కు ఫ్యాకల్టీగా నికాన్ క్రియేటర్ నాని నరేంద్ర హాజరయ్యారు. ప్రత్యేక తరగతులు నిర్వహించి ఫోటోగ్రఫీ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చిందని అన్నారు.

April 6, 2026 / 07:30 PM IST

అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష

PPM: కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ADP, ABP పురోగతిపై సమీక్ష సమావేశం జరిగింది. సంపూర్ణత అభియాన్ 2.0 కింద కీలక సూచికలను 100% సాధించేందుకు మిషన్ మోడ్‌లో పనిచేయాలని ఆదేశించారు. ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.

April 6, 2026 / 07:29 PM IST

సర్పంచుల సేవలు చిరస్మరణీయం: వై.విశ్వేశ్వర్ రెడ్డి

ATP: గ్రామ స్వరాజ్య స్థాపనలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి కొనియాడారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని వైసీపీ తాజా మాజీ సర్పంచులను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు గుర్తిస్తూ, ప్రభుత్వ పథకాలను అర్హులకు చేర్చడంలో విశేష కృషి చేశారని ప్రశంసించారు.

April 6, 2026 / 07:20 PM IST

బాధితులకు న్యాయం చేయండి: ఎస్పీ

VZM: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ప్రజల నుంచి 40 ఫిర్యాదులు స్వీకరించారు. వాటిలో భూతగాదాలు 15, కుటుంబ కలహాలు 4, చీటింగ్ 3, నగదు వ్యవహారాలు 3, ఇతర సమస్యలు 15 ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించి చట్టపరిధిలో చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలన్నారు.

April 6, 2026 / 07:19 PM IST

కాల్వబుగ్గ ఆలయ చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్

కర్నూలు జిల్లా కాల్వబుగ్గ బుగ్గ రామేశ్వరం ఆలయంలో జరిగిన చోరీ కేసులో మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 10 కిలోల వెండి దొంగిలించగా, 4 కిలోల వెండి వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఆధారంగా కేసును ఛేదించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు.

April 6, 2026 / 07:13 PM IST

కలెక్టరేట్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

అనంతపురం కలెక్టర్ కార్యాలయం సమీపంలో సోమవారం మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. రాయదుర్గం ప్రాంతానికి చెందిన రాముడు విద్యుత్ స్తంభానికి ఉరివేసుకునేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు రాఘవేంద్ర సమయస్ఫూర్తితో అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, బాధితుడి పరిస్థితిని గమనించి ఆసుపత్రికి తరలించారు.

April 6, 2026 / 07:12 PM IST

పాసు పుస్తకాలు పంపిణీ చేసిన ఆర్డీవో

ASR: అనంతగిరి మండలం పల్లంవానివలస గ్రామంలో సోమవారం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామంలో రీ-సర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. దీంతో ప్రభుత్వం జారీచేసిన రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాలను ఆర్డీవో లోకేశ్వరరావు, తహసీల్దార్ వీరభద్రాచారి, ఎంపీపీ, జడ్పీటీసీ, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి లబ్ధిదారులకు అందజేశారు.

April 6, 2026 / 07:11 PM IST

సొంత నిధులతో కాలువలో పూడికతీత పనులు

NLR: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ 9వ వార్డు శాంతినగర్లో గుడిపల్లి కాలువ పూడిక నిండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దుర్వాసన, దోమలతో సతమతమవుతున్నామని వాపోయారు. సమస్యను స్థానిక కౌన్సిలర్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. ఆయన సొంత నిధులతో కాలువలో పూడిక తీత పనులు చేయించారు.

April 6, 2026 / 07:10 PM IST

పీజీఆర్ఎస్‌కు 131 అర్జీలు

AKP: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 131, రెవిన్యూ క్లినిక్‌కు 150 అర్జీలను ప్రజలు అందజేశారు. కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారితో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

April 6, 2026 / 07:05 PM IST