• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

యువత మత్తుపదార్దాలకు , బెట్టింగులకు దూరంగా ఉండాలి

VZM: యువత మత్తుపదార్దాలకు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని రూరల్‌ సీఐ లక్ష్మణరావు సూచించారు. ఆదివారం సాయంత్రం స్దానిక వీటీ ఆగ్రహరం వై జంక్షన్‌ ప్రాంతంలో యువతకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. IPL జరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ బెట్టింగులు ఆడరాదని, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

April 6, 2026 / 07:24 AM IST

త్వరలోనే డోలి యాత్ర ప్రారంభిస్తున్నాం – కలెక్టర్

PPM:  జిల్లాలో త్వరలో డోలి యాత్ర ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి ఆదివారం డోలి రోడ్లపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో డోలి రోడ్లను మంజూరు చేశామని తెలిపారు.

April 6, 2026 / 07:20 AM IST

కార్మిక హక్కుల కోసం కర్నూలులో ధర్నా

KRNL: భవన, ఇతర నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 6న కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు నగర అధ్యక్షుడు డి. అబ్దుల్ దేశాయి ఆదివారం తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, కార్మికులకు పింఛన్, బీమా, ఇల్లు స్థలం వంటి ప్రాథమిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.

April 6, 2026 / 07:20 AM IST

బాలికపై లైంగిక దాడి..!

NTR: పాయికాపురంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై స్థానిక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలికకు కడుపునొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించగా గర్భం దాల్చినట్లు తేలింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

April 6, 2026 / 07:16 AM IST

నేడు అమలాపురంలో జాబ్ మేళా

కోనసీమ: అమలాపురంలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన వారు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

April 6, 2026 / 07:12 AM IST

నేడు అక్రమ చొరబట్లపై మత్స్యకారుల సమావేశం

ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో మత్స్యకారుల సమావేశం ఇవాళ జరగనుంది. తమిళనాడుకు చెందిన జాలర్లు అక్రమంగా తమ సముద్ర ప్రాంతాల్లోకి ప్రవేశించి మరబోట్లతో తమ వలలు, బోట్లకు నష్టం చేస్తున్నారన్న సమస్యపై చర్చించనున్నారు. తిరుపతి, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన మత్స్యకారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

April 6, 2026 / 07:09 AM IST

నేడు జిల్లా వ్యాప్తంగా ‘PGRS’ కార్యక్రమం

ELR: జిల్లా వ్యాప్తంగా ఇవాళ పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌ను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని డివిజన్, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. ప్రజలు నేరుగా రావడమే కాకుండా, ‘మీకోసం’ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

April 6, 2026 / 07:04 AM IST

నలుగురు విద్యుత్ ఆపరేటర్ల తొలగింపు

NDL: రుద్రవరం మండలం విద్యుత్ సబ్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఆపరేటర్లను ఉన్నతాధికారులు తొలగించినట్లు AE రాజశేఖర్ నిన్న తెలిపారు. ఎల్లావత్తుల సబ్ స్టేషన్ నుంచి హరి, చిన్నకంబలూరు నుంచి పెద్దిరెడ్డి, ఆలమూరు నుంచి నరసింహనాయక్, హరినగరం నుంచి ఆంజనేయులు అనే ఆపరేటర్లను తొలగించినట్లు తెలిపారు. వారంతా నకిలీ ధ్రువపత్రాలతో విధుల్లో చేరినట్లు వెల్లడించారు.

April 6, 2026 / 07:02 AM IST

రోడ్డు లేక గ్రామస్తుల అవస్థలు

ASR: అనంతగిరి మండలంలోని కాకరపాడు పీవీటీజీ గ్రామానికి బీటీ రోడ్డు పనులు ఏళ్లుగా నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో మట్టి రోడ్డు దెబ్బతిని రాళ్లు తేలడంతో రాకపోకలు కష్టమయ్యాయి. అంబులెన్స్‌ సహా వాహనాలు గ్రామానికి చేరలేని పరిస్థితి ఏర్పడింది. తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

April 6, 2026 / 07:00 AM IST

నేడు యథావిధిగా ‘PGRS’ కార్యక్రమం: కలెక్టర్

W.G: భీమవరం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో ఇవాళ ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకు ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. దూరప్రాంతాల వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

April 6, 2026 / 07:00 AM IST

224 కేసులు.. రూ.46,660 జరిమానా

KDP: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 224 మందిపై కేసులు నమోదు చేసి రూ.46,660 జరిమానా విధించారు. శిరస్త్రాణం లేకుండా, సీటు బెల్టు ధరిం చకుండా, పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.

April 6, 2026 / 07:00 AM IST

ఆగష్టు నెలాఖరుకి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తాం – మంత్రి

VZM: ఆగస్ట్‌ నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి కె.నారాయణ తెలిపారు. ఆదివారం బొబ్బిలి మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణ పేదల కోసం అధునాతన టెక్నాలజీతో టిడ్కో ఇళ్లను మంజూరు చేస్తే గత YCP ప్రభుత్వం రూ.3.60 లక్షల ఇళ్లను రద్దుచేసి మిగిలిన ఇళ్లను పూర్తి చేయలేదని విమర్శించారు.

April 6, 2026 / 06:49 AM IST

బినిగెరిలో ఆంజనేయస్వామి ఉత్సవాలు

KRNL: ఆస్పరి మండలం బినిగెరి గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఉత్సవాలు ఈనెల 6 నుంచి 9 వరకు ఘనంగా జరుగనున్నాయి. 8న రథోత్సవం, 9న వసంతోత్సవం నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు ఆదివారం తెలిపారు. ఆలయాన్ని విద్యుత్ కాంతులతో అలంకరించారు. అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

April 6, 2026 / 06:46 AM IST

యాడికిలో సీఎం కాన్వాయ్ రిహార్సల్స్

ATP: CM చంద్రబాబు సోమవారం యాడికిలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ పి.జగదీష్, కలెక్టర్ ఆనంద్ కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభా ప్రాంగణం, పెండేకల్లు రిజర్వాయర్ వరకు భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. బారికేడింగ్, అగ్నిమాపక చర్యలు, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసు అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు.

April 6, 2026 / 06:43 AM IST

ఎమ్మెల్యే రమణమూర్తి నేటి పర్యటన వివరాలు

SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి సోమవారం ఉ. 10 కు పోలాకి మండలం ఓది పాడు గ్రామంలో, నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత, చెరువుల పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. మ.3 కు సారవకోట మండలం తహశీల్దార్ కార్యాలయనికి శంకుస్థాపన చేస్తారు. సా. 4 కు జలుమూరు KG BV పాఠశాల అదనపు తరగతి గదుల భవనాలను ప్రారంభిస్తారు. అని ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ప్రకటనలో తెలిపారు.

April 6, 2026 / 06:40 AM IST