• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మీకోసం కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన ఎస్పీ

కృష్ణా: మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో 35 ఫిర్యాదులను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సోమవారం స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సమర్పించే అర్జీలపై ఎలాంటి జాప్యం లేకుండా స్పందించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

April 6, 2026 / 10:00 PM IST

చెరువుల పునరుద్ధరణతోనే జల భద్రత

PLD: శావల్యాపురం మండలం కనుమర్లపూడిలో ‘నీటి భద్రత’ కార్యక్రమం జరిగింది. చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని ప్రోక్లైన్‌తో చెరువు పనులను ప్రారంభించారు. కాలువల్లో పూడికతీతతో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ప్రతి ఊరిలో ‘గ్రామ నీటి బడ్జెట్’ రూపొందించాలన్నారు. భవిష్యత్ తరాల కోసం జల వనరులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

April 6, 2026 / 10:00 PM IST

కంచల ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో బాధ్యతలు

NTR: సర్పంచుల పదవీకాలం ముగియడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు నందిగామ MPDO ఆర్.వి.ఎస్. ప్రసాదరావు సోమవారం కంచల గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

April 6, 2026 / 10:00 PM IST

మొక్కజొన్న రైతులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

ELR: పోలవరం మండలంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మొక్కజొన్న రైతుల సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు పెరిగాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో మద్దతు ధరతో రైతులను ఆదుకుందని కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే క్వింటాకు రూ.2400ల మద్దతు ధర ఇవ్వాలన్నారు.

April 6, 2026 / 09:55 PM IST

‘పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం’

VZM: అకాల వర్షాలు, ఈదురు గాలులు కారణంగా చేతివరకు వచ్చిన పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్బంగా బొబ్బిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలని ఆదేశించారు. నివేదికను సత్వరమే తయారుచేయాలని కోరారు.

April 6, 2026 / 09:40 PM IST

సత్తెనపల్లి ఆసుపత్రిలో భద్రతా సిబ్బందికి యూనియన్ కార్డులు

PLD: సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిని ఏఐటీయూసీ నాయకులు అంజిరెడ్డి, కంబాల శ్రీనివాసరావు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ పూదోట సందర్శించారు. కూటమి ప్రభుత్వం ప్యానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి రూ.18,600 జీతాలు ఆదేశించినా, కాంట్రాక్టు ఏజెన్సీలు తక్కువ మొత్తంలో మాత్రమే చెల్లిస్తూ దోపిడీ చేస్తున్నాయని వారు ఆరోపించారు.

April 6, 2026 / 09:32 PM IST

ఈనెల 12న కనిగిరి మోడల్ స్కూల్‌లో 6వ తరగతి ప్రవేశాలు

ప్రకాశం: కనిగిరి ఏపీ మోడల్ స్కూల్‌లో ఈనెల 12న ఆరో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి తులసి తెలిపారు. పరీక్ష రాయనున్న విద్యార్థులు అరగంట ముందుగానే పాఠశాలకు చేరుకుని తమకు కేటాయించిన గదులను చూసుకోవాలని సూచించారు. హాల్ టికెట్లు ఈనెల 3వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

April 6, 2026 / 09:30 PM IST

ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్‌కు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం

GNTR: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ నెల 8న నిర్వహించనున్న మెగా కల్చరల్ ఫెస్ట్ వేడుకలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు యూనివర్సిటీ అధికారులు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విశ్వవిద్యాలయం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

April 6, 2026 / 09:30 PM IST

ద్వారపూడిలో జలధార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: మండపేట మండలం ద్వారపూడిలో పంగిడి చెరువు వద్ద ‘జలధార’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఏపీఐడీసీ ఛైర్మన్ లీలా కృష్ణతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రకటించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి జులై 14 వరకు జలవనరుల సంరక్షణ పనులు చేపడతామని తెలిపారు.

April 6, 2026 / 09:20 PM IST

ఎమ్మెల్యేను కలిసిన ఎస్సై

ELR: తడికపూడి పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై వల్లి పద్మ సోమవారం చింతలపూడిలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తడికలపూడి పోలీస్ స్టేషన్ చరిత్రలో ఒక మహిళ ఎస్సైగా రావడం విశేషమని అన్నారు. మండలంలో శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి చేయాలని, అసాంఘిక కార్యక్రమాలపై దృష్టి సారించి వాటిని నిలువరించేందుకు కృషి చేయాలన్నారు.

April 6, 2026 / 09:17 PM IST

బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా

CTR: బీజేపీ పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా “మన ఊరు- మన జెండా” కార్యక్రమం భాగంగా ఎస్ఆర్ పురం మండలంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు జల్లా జ్యోతి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

April 6, 2026 / 09:01 PM IST

CM వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

సత్యసాయి: రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చేపట్టిన ‘జలధార – జలహారతి’ కార్యక్రమంపై CM చంద్రబాబు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, JC మౌర్య భరద్వాజ్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

April 6, 2026 / 09:00 PM IST

శుభకార్యానికి వచ్చిన యువకుడు అంతలోనే విషాదం

NTR: గంపలగూడెం మండలం అనుములంక గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. అమ్మమ్మ ఇంటికి శుభకార్యానికి వచ్చి, చెరువులో ఈతకు వెళ్లి మిరియాల రమేష్(19) అనే యువకుడు మునిగిపోయాడని స్థానికులు తెలిపారు. కాగా చెరువులో గాలింపు చర్యలు గ్రామస్తులు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

April 6, 2026 / 09:00 PM IST

పిడుగుపాటుకు ఫీల్డ్ ఆఫీసర్ మృతి

PLD: వెల్దుర్తి మండలం మిట్టమీదపల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఫీల్డ్ ఆఫీసర్, యూనిట్ ఇంఛార్జ్‌గా పనిచేస్తున్న మడతల శ్రీనివాసరెడ్డి ప్రమాదవశాత్తు పిడుగుపాటుకు గురయ్యారు. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాసరెడ్డి అకాల మరణంతో ఆయన కుటుంబంతో పాటు స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

April 6, 2026 / 09:00 PM IST

కన్న కూతురిపై అత్యాచారం.. 20 ఏళ్లు జైలు శిక్ష

ప్రకాశం: కొండపి మండలంలో గత సంవత్సరం కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి ఒంగోలు పోక్సో కోర్టు 20 సంవత్సరాలు జైలు శిక్ష సోమవారం విధించింది. నిందితుడు అత్యాచారానికి పాల్పడి కూతుర్ని బెదిరించాడు. కూతురు జరిగిన విషయాన్ని తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి సాక్షాదారాలను పరిశీలించిన న్యాయమూర్తి శైలజ రూ.7 వేల జరిమన జైలు శిక్ష వింధించారు.

April 6, 2026 / 09:00 PM IST