• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘అక్రిడేషన్ అవకతవకల ఫిర్యాదులపై విచారణ చేయండి’

ATP: జిల్లాలో అక్రిడేషన్ మంజూరులో జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు సీనియర్ జర్నలిస్టులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీనియర్ జర్నలిస్టులు భాస్కర్ రెడ్డి, రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తినే జీవనాధారం చేసుకొని జీవనం సాగిస్తున్నామన్నారు. జర్నలిజం నమ్ముకున్న తమకు న్యాయం చేయాలన్నారు.

April 13, 2026 / 08:00 PM IST

పోక్సో కేసు నిందితుడికి 14 రోజుల రిమాండ్

ప్రకాశం: సింగరాయకొండ మండలానికి చెందిన పోక్సో కేసు నిందితుడు సురేష్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం సెక్షన్ 8 కింద అతడిపై కేసు నమోదైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కేసు తీవ్రతను పరిశీలించిన సింగరాయకొండ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ వివరాలను SI మహేంద్ర మీడియాకు వెళ్లడించారు.

April 13, 2026 / 07:44 PM IST

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి విగ్రహావిష్కరణ

సత్యసాయి: ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో సోమవారం మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని మంత్రి సత్య కుమార్ ఆవిష్కరించి, నివాళులు అర్పించారు. దేశానికి అంకితభావంతో సేవలందించిన మహానేత వాజపేయి ఆశయాలు, నాయకత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధికి కృషి చేయడం ఆ మహనీయునికి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.

April 13, 2026 / 07:30 PM IST

పేరూరు డ్యాంకు నీరు విడుదల చేయాలి: తోపుదుర్తి

ATP: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆరు మండలాల నాయకులతో కలిసి పేరూరు డ్యాంకు వెంటనే నీరు విడుదల చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ మోహన్ రెడ్డి చొరవతో డ్యాంకు నీరు అందించి రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు.

April 13, 2026 / 07:30 PM IST

స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా అలహరి శ్రీనివాస్

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని స్పెషల్ బ్రాంచ్ విభాగంలో డీఎస్పీగా అలహరి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎస్పీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ కార్యాలయ సిబ్బంది, ఫీల్డ్ సిబ్బంది కూడా అభినందనలు తెలియజేశారు.

April 13, 2026 / 07:29 PM IST

కొమరోలు క్రాస్ రోడ్డు వద్ద ఆటో బోల్తా.. మహిళ మృతి

ప్రకాశం: కొమరోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రాస్ రోడ్ వద్ద తాటిచెర్ల మోట నుంచి కొమరోలు వైపు వస్తున్న ఆటో సోమవారం అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న మొరం సుబ్బమ్మ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. మృతి చెందిన సుబ్బమ్మది మదనపల్లె గ్రామం అని సమాచారం. ఆటోలో ప్రయాణిస్తున్న మరొక ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

April 13, 2026 / 07:24 PM IST

ఫైర్ క్రాకర్స్ విక్రయదారులతో జేసీ సమీక్ష

PLD: జిల్లాలో ఫైర్ క్రాకర్స్ లైసెన్స్ దారులతో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ సమీక్షా సమావేశం నిర్వహించారు. లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గడువు ముగిసిన వారు వెంటనే రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. వేసవి కాలంలో షాపులు, క్రాకర్స్ నిల్వలో భద్రతా జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

April 13, 2026 / 07:23 PM IST

26 పరీక్షా కేంద్రాలు.. 8,053 మంది విద్యార్థులు

VZM: పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని KC సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 25న జరిగే పరీక్షకు జిల్లాలో నుంచి 8,053 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. జిల్లాలో మొత్తం 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

April 13, 2026 / 07:20 PM IST

ఒంటిమిట్ట సీఐగా శ్రీహరి బాధ్యతల స్వీకరణ

కర్నూల్ రేంజ్ DIG కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు జరిగిన బదిలీలలో ఒంటిమిట్ట సీఐగా శ్రీహరి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన కడప నేర విభాగంలో విధులు నిర్వహిస్తూ బదిలీపై ఒంటిమిట్టకు రావడం జరిగింది. ఇక్కడ CIగా పనిచేస్తున్న నరసింహారాజు బదిలీపై కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం జరిగింది.

April 13, 2026 / 07:13 PM IST

రేపు నూజివీడులో పర్యటించనున్న మంత్రి

ELR: నూజివీడు పట్టణ పరిధిలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం సోమవారం ప్రకటనలో తెలిపింది. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం 9 గంటలకు, శ్రీనివాస సెంటర్ వద్ద 10 గంటలకు బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు.

April 13, 2026 / 07:05 PM IST

సంపద కేంద్రాలపై దృష్టి పెట్టాలి: ఎంపీడీవో

AKP: పంచాయతీ కార్యదర్శులు సంపద కేంద్రాలపై దృష్టి పెట్టాలని పాయకరావుపేట ఎంపీడీవో లవరాజు ఆదేశించారు. ఇవాళ పీఎల్ పురంలో సంపద కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రాలను సక్రమంగా నిర్వహిస్తే పంచాయతీలకు ఆదాయం వస్తుందన్నారు. గ్రామాల నుంచి ప్రతిరోజు సేకరిస్తున్న చెత్తను కేంద్రాలకు తరలించి సేంద్రియ ఎరువుగా మార్చాలన్నారు.

April 13, 2026 / 07:00 PM IST

‘స్వీయ గణనపై విస్తృత అవగాహన కల్పించాలి’

VZM: ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ గణన విధానంపై జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఇవాళ ఆదేశించారు. ఈ నెల 16 నుంచి 30 వరకు ప్రజలు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన 15 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

April 13, 2026 / 07:00 PM IST

అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలి: కలెక్టర్

TPT: జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో మొత్తం 380 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. అర్జీలకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.

April 13, 2026 / 07:00 PM IST

చట్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం: సీఐ

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ ఎల్విన్‌పేట సీఐ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు సూచనలు చేశారు. మైనర్లు వాహనాలు నడపడం నేరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శివప్రసాద్ పాల్గొన్నారు.

April 13, 2026 / 07:00 PM IST

గ్రంథాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

విశాఖ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఛైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ ఆశయాలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని, తద్వారా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.

April 13, 2026 / 07:00 PM IST