CTR: చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర మే 12, 13వ తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని జాతర వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు తెలిపారు. మే 5న గంగమ్మ జాతర చాటింపు, 12న జాతర తొలి పూజలు చేస్తామని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం మహా కుంభ నైవేద్యం సమర్పిస్తామన్నారు. 13న నిమజ్జనం జరుగుతుందని తెలిపారు.
బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయాన్ని గురువారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పిల్లర్స్ పనులను ఆయన ప్రారంభించారు. అంతకుముందు విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తితోనే క్రమశిక్షణ, శాంతియుత జీవనం సాధ్యమని, గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
KKD: తుని పట్టణంలోని ప్రకాశం రోడ్డుపై ఆంజనేయ స్వామి గుడి వద్ద పరిస్థితి దయనీయంగా మారింది. వర్షం పడినప్పుడల్లా ఆ ప్రాంతం మొత్తం చెరువులా తయారవుతోంది. డ్రైనేజీ నీరు, వర్షపు నీరు కలిసిపోవడంతో రోడ్డుపై భారీగా ప్రవహిస్తున్నాయి. దుర్వాసన వెదజల్లే ఆ నీళ్ళు రోడ్డు మీదుగా పారుతుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
కృష్ణా: మచిలీపట్నం 6వ డివిజన్లో నిర్మాణంలో ఉన్న ఓ జనసైనికుడి ఇళ్లు కూల్చివేత కూటమిలో అంతర్యుద్ధానికి దారి తీసింది. అక్రమ కట్టడమంటూ శ్రీపతి వెంకటాచలం ఇంటిని ఇటీవల మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఇది కూటమిలోని TDP Vs జనసేనగా మారింది. మంత్రి కొల్లు రవీంద్ర దీన్ని అక్రమ కట్టడమని అధికారుల చర్యలను సమర్ధిస్తే జనసేనకు చెందిన MP బాలశౌరి మాత్రం తప్పు పట్టారు.
ఎన్టీఆర్: విజయవాడలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వినూత్న చర్యగా డ్రోన్ల ద్వారా నీటి తుంపర్లు (మిస్ట్) వెదజల్లే కార్యక్రమాన్ని కలెక్టర్ జి.లక్ష్మీశ క్షేత్రస్థాయిలో గురువారం పరిశీలించారు. మహాత్మా గాంధీ రోడ్, అంబేద్కర్ స్మృతి వనం వద్ద ఈ కార్యక్రమాన్ని VMC అధికారులతో కలిసి పరిశీలించారు.
ELR: జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితకి అప్పన్నవీడులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘన స్వాగతంపల్లి గారు. అనంతరం అప్పన్నవీడు అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకున్న హోం మంత్రి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందజేశారు. అలాగే హోం మంత్రికి సాంప్రదాయ బద్దంగా చీర, సారెను ఎమ్మెల్యే అందజేశారు.
NDL: కోవెలకుంట్ల శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతాయని ఆలయ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా చేపట్టడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు తిలకించడానికి వివిధ ప్రాంతాల భక్తులు తరలివస్తారని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
KDP: జమ్మలమడుగు-తాడపత్రి ప్రధాన రహదారిలోని మోరగుడి గ్రామం వద్ద బుధవారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి ఓ ఇంటిలోకి దూసుకెళ్లింది. స్థానికుల వివరాల ప్రకారం.. జమ్మలమడుగు వైపు వెళుతున్న కారు అతివేగంతో ఇంటిని ఢీకొని బోల్తా పడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారులో ఒక్కరే ఉండగా, అదృష్టవశాత్తు అతనికి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.
KRNL: కోసిగి గ్రామ ప్రత్యేక అధికారిగా వ్యవసాయ అధికారి వరప్రసాద్ నియమితులయ్యారు. గురువారం దొరల కాలనీలో పర్యటించి తాగునీటి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించారు. అనంతరం బీరప్పగుడ్డి కాలనీలో శ్మశానవాటికకు వెళ్లే దారిలోని డ్రైనేజీ కాలువ పూడికతీత పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.
ATP: అనంతపురం జిల్లాకు ట్రైని కలెక్టర్ సుయాష్ కుమార్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది జిల్లాలకు ట్రైనీ కలెక్టర్లను నియమించారు.ముస్సోరిలో శిక్షణ పూర్తి చేసుకున్న సుయా ష్ కుమార్‌ను జిల్లా ట్రైని కలెక్టర్‌గా నియమించినట్లు తెలిపారు.
E.G: బొమ్మూరు PS పరిధిలోని ప్రధాన కూడళ్లలో బుధవారం SI రమేశ్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించారు. తనిఖీల్లో భాగంగా వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లు, వారి తల్లిదండ్రులకు SI కౌన్సెలింగ్ ఇచ్చారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఆయన హెచ్చరించారు.
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో వైద్యం, మందులు, పరీక్షలు అన్నీ పూర్తిగా ఉచితమని సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి స్పష్టం చేశారు. ఎవరైనా సిబ్బంది డబ్బులు అడిగితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని రోగులకు సూచించారు. పేద ప్రజలు మధ్యవర్తుల చేతిలో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
SKLM: పోలాకి మండలం అంపలాం గ్రామంలో ఉన్న ప్రభుత్వ Z.P హైస్కూల్‌లో గురువారం శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల బాలికలకు స్వీయ రక్షణ అవసరం అని టెక్కలి డివిజన్ శక్తిటీంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం గిరిధర్ అన్నారు. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్స్ గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు: నరసరావుపేట సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. సుమారు 35-40 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందాడు. పట్టాలపైకి వచ్చిన వ్యక్తిని రైలు ఢీకొన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. లోకో పైలట్ రైలును ఆపి పరిశీలించగా అక్కడికక్కడే మృతి చెందినట్లు నిర్ధారించారు.
KRNL: జిల్లాలో కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, 20 సూత్రాల ఛైర్మన్ లంకా దినకరన్ పనితీరును ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర పథకాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించడం అవసరమన్నారు. అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇస్తే మెరుగైన సేవలు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు. పరిపాలన బలోపేతంతో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.