• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చెరువుల పునరుద్ధరణకు ప్రణాళిక సిద్ధం చేయాలి

AKP: జిల్లాలో చెరువులు పునరుద్ధరణపై అధికారులు 10 రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో జలధార-నీటి భద్రతపై సమీక్షించారు. జలవనరుల పరిరక్షణ, సాగునీటి వ్యవస్థను బలోపేతానికి చర్యలు చేపట్టాలన్నారు. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలన్నారు.కొత్తగా డీసిల్టింగ్ చేయాల్సిన చెరువులను గుర్తించాలన్నారు.

April 22, 2026 / 06:25 AM IST

సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పీఎస్‌లో ఫిర్యాదు

బాపట్ల: హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై బజరంగ్ దళ్ సభ్యులు బాపట్లలో ఫిర్యాదు చేశారు. పట్టణంలో ఆయన ఫొటోతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసులకు వినతిపత్రం అందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

April 22, 2026 / 06:22 AM IST

తిరుపతి కోర్టుకు ప్రకాశ్ రాజ్ రావాల్సిందేనా..?

TPT: హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడారని TTD బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఇటీవల డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో డీజీపీ ఆఫీసు నుంచి తిరుపతి ఎస్పీకి ఆ ఫిర్యాదు అందింది. త్వరలోనే ఎస్పీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రకాశ్ రాజ్ తిరుపతి కోర్టుకు వచ్చే వరకు పరువునష్టం కేసు కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

April 22, 2026 / 06:22 AM IST

నేడు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు

KRNL: నంద్యాల, మన్యం, అల్లూరి, పోలవరం, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాతో పాటు కర్నూలులో కూడా ఇవాళ అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

April 22, 2026 / 06:12 AM IST

డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు.. ఇద్దరికి జైలు శిక్ష

E.G: జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాలతో రాజమండ్రిలో మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 37 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఇద్దరికి జైలు శిక్ష, 35 మందికి రూ. 10 వేల చొప్పున జరిమానా విధించినట్లు ట్రాఫిక్ DSP వై.శ్రీకాంత్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

April 22, 2026 / 06:12 AM IST

ఒంగోలు ప్రజలకు గుడ్‌న్యూస్

ప్రకాశం: ఒంగోలు సమీపంలోని చదలవాడలో సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో 148 గదుల ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 300 మందికి ఉపాధి లభిస్తుందని హోటల్ ప్రతినిధి రవిశంకర్ జాయింట్ కలెక్టర్‌కు వివరించారు. ఈ మేరకు ప్రభుత్వ రాయితీలు అందేలా చూడాలని ఆయన జేసీని కోరారు.

April 22, 2026 / 06:10 AM IST

ఐవీఆర్ఎస్ కాల్స్, స్వీయ గణనపై అవగాహన

ASR: ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్‌కు లభ్ధిదారులు స్పందించాలని అరకులోయ ఎంపీడీఓ వీసం ప్రసాద్ తెలిపారు. మంగళవారం మండలంలోని మాడగడ గ్రామంలో ఐవీఆర్ఎస్ కాల్స్, స్వీయ గణనలపై నిర్వహించిన అవగాహనలో ఆయన మాట్లాడారు. అలాగే స్వచ్ఛరథం గురించి వివరించి, పాత పేపర్లు, వాడని ప్లాస్టిక్, అట్టలు, ఇనుము స్వచ్ఛరథం వద్ద ఇచ్చి నిత్యవసరాలను పొందవచ్చన్నారు. PFO రామస్వామి పాల్గొన్నారు.

April 22, 2026 / 06:09 AM IST

నేడు జిల్లా పరిషత్ కమిటీ సమావేశం

VSP: జిల్లా పరిషత్ స్థాయీ కమిటీ సమావేశాలు ఇవాళ  జడ్పీ సమావేశ మందిరంలో జరుగుతాయని జడ్పీ సీఈఓ నారాయణమూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఛైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగే సమావేశాలకు జడ్పీటీసీలు, సంబంధిత అధికారులు హాజరుకావాలని సూచించారు. 

April 22, 2026 / 06:09 AM IST

సత్యదేవుని కళ్యాణం.. కలెక్టర్‌కు ఆహ్వానం

KKD: ఈ నెల 27న జరిగే అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణానికి రావాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను మంగళవారం ఆహ్వానించారు. అన్నవరం దేవస్థానం EO నల్లం సూర్యచక్రధరరావు కాకినాడలో కలెక్టర్‌ను ఆయన ఛాంబర్‌లో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉత్సవ ఏర్పాట్ల గురించి వివరించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో కళ్యాణం జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. 

April 22, 2026 / 06:09 AM IST

నేడు ఈ గ్రామాలలో విద్యుత్‌కి అంతరాయం

కోనసీమ: నగరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం పవర్ కట్ అమల్లో ఉంటుందని అమలాపురం ఈఈ రాంబాబు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు కోనసీమ జిల్లా కేంద్రంలో పాటు మామిడికుదురు, పాసర్లపూడి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక, అప్పన్నపల్లి, పెదపట్నం, మొగలికుదురు గ్రామాలతో పాటు రాజోలు మండలం తాటిపాక గ్రామానికి కరెంటు సరఫరా నిలిపివేస్తామన్నారు.

April 22, 2026 / 06:08 AM IST

మహారాష్ట్రలో పర్యటిస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి

ATP: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మహారాష్ట్రలో రెండో రోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన సుప్రసిద్ధ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లోరా సమీపంలోని ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగంతో పాటు నాసిక్ దగ్గర ఉన్న త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగ స్వామిని దర్శించుకున్నారు. పర్యటన ఆద్యంతం ఆధ్యాత్మికంగా సాగింది. 

April 22, 2026 / 06:06 AM IST

భార్యను హింసించిన భర్తకు జైలు శిక్ష

గుంటూరు: భార్యపై దాడి చేసి బెదిరించిన కేసులో భర్తకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. లక్ష్మీనగర్‌కు చెందిన రాణి ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఫిర్యాదు ఉపసంహరించుకోమని ఒత్తిడి చేస్తూ భర్త రాంబాబు దాడి చేసినట్టు నిర్ధారణ కావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది.

April 22, 2026 / 06:06 AM IST

మహిళపై అత్యాచారయత్నం

సత్యసాయి: చెన్నేకొత్తపల్లి మండలంలో బంధువైన మహిళపై ఓ రాజకీయ నాయకుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. కుటుంబ కలహాల పంచాయతీకి వెళ్లిన క్రమంలో ఆ మహిళపై కన్నేసిన నిందితుడు, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి బలత్కారం చేయబోయాడు. బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

April 22, 2026 / 06:05 AM IST

నాటుసారా ఊటపై కార్వేటి నగరం పోలీసుల వేట

CTR: కార్వేటి నగరం మండలంలో నాటు సారా స్థావరాలపై మంగళవారం రాత్రి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎస్ఐ తేజస్విని కొటార్వేడు పరిధిలో 300 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. నాటు సారా తయారీతో పట్టుబడితే సహించబోమన్నారు. వారికి చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. మండలంలో నాటు సారా నిర్వీర్యం చేయడమే లక్ష్యం అన్నారు.

April 22, 2026 / 06:05 AM IST

కొండూరులో సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష

పల్నాడు: అచ్చంపేట మండలం కొండూరు గ్రామంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ‘ప్రజల వద్దకు ప్రవీణ్’ పర్యటనను 67వ రోజు కొనసాగించారు. గ్రామ సమస్యలను స్వయంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఆన్లైన్ రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. కూటమి ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపారు.

April 22, 2026 / 06:01 AM IST