KRNL: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. CM సహాయనిధి నుంచి మంజూరైన సుమారు రూ. 60 వేల విలువైన చెక్కులను ఇవాళ ఆయన లబ్ధిదారులకు అందజేశారు. పంచలింగాలలోని తన నివాసంలో జరిగిన ఈ కార్య క్రమంలో ఎంపీ మాట్లాడుతూ.. అనారోగ్యం, కష్టాల్లో ఉన్న పేదలకు ఈ నిధి కొండంత అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
CTR: గ్రామ సర్వేయర్లు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా చిత్తూరు రెవెన్యూ భవనంలో గ్రామ సచివాలయ సర్వేయర్లు నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రక్త నిల్వల సమస్యలు పరిష్కరించేందుకు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.
TPT: తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం(NSU) 5వ స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీజ్ఞి నాథన్ కామకోటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కులపతి ఎన్.గోపాలస్వామి అధ్యక్షతన పట్టాలను అందజేశారు. ప్రొఫెసర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుత్తి, పామిడి మండల ఇన్చార్జి గుమ్మనూరు ఈశ్వర్‌ను శుక్రవారం వారి నివాసంలో నూతనంగా నియమించిన గుత్తి మండల తెలుగు యువత అధ్యక్షులు కిట్ట యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కిట్ట యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబుకు దానికి సహకరించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు కృతజ్ఞతలు తెలిపారు.
KKD: సామర్లకోట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిలరాజప్ప శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుండి ఆయా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించి, అధికారుల ద్వారా వాటికి పరిష్కారాలకు కృషి చేస్తామని ఎమ్మెల్యే చిన్న రాజప్ప తెలిపారు. అధికారులు సీఎం ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కరానికి కృషి చేయాలన్నారు
CTR: రొంపిచర్ల AP మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు ఎంట్రెన్స్ టెస్ట్ ఈనెల 12వ తేదీ జరుగుతుందని ప్రిన్సిపల్ రెడ్డి ప్రదీప్ చెప్పారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు స్థానిక మోడల్ స్కూల్లో హాల్ టికెట్లు తీసుకోవాలని సూచించారు. మోడల్ స్కూల్లో ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు గంట ముందు పాఠశాల వద్దకు చేరుకోవాలని సూచించారు.
E.G: రాజమండ్రి గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో శుక్రవారం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ చౌదరి చేరుకుని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కి ఘన స్వాగతం పలికారు. ఆయనని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నిర్వహించే స్నాతకోత్సవం, పలు కార్యక్రమాల్లో గవర్నర్ పాల్గొనున్నారు.
ASR: రాజవొమ్మంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 65 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు చేసినట్లు వైద్యాధికారి సుష్మ తెలిపారు. వీరిలో 37మంది హైరిస్క్‌తో ఉన్నట్లు గుర్తించామని వీరికి ప్రత్యేక వైద్య సహాయం, మందులు అందజేస్తున్నామన్నారు. గర్భిణులు బాలింతలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అలాగే, పెరట్లో లభించే ఆకు కూరలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
CTR: పుత్తూరు నూతన SIగా నాగేంద్రబాబు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈక్రమంలో నగరి MLA గాలి భాను ప్రకాశ్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు పూష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఎస్సైకు ఆయన సూచించారు.
NDL: పాఠశాల ఆవరణలలో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని శక్తి టీం సభ్యులు సూచించారు. శుక్రవారం కౌలూరు ప్రాథమిక పాఠశాలలో ఏఎస్పీ ఆదేశాల మేరకు శక్తి యాప్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ విద్యార్థులకు ‘బ్యాడ్ టచ్’ గురించి వివరించారు. అందరూ శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.
ప్రకాశం: దర్శిలో కలెక్టర్ రాజాబాబు పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం శుక్రవారం రాత్రి పోతవరం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. కలెక్టర్ అక్కడే రాత్రి బస చేసి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే, స్థానిక అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.
నెల్లూరు నగరంలో దోమల నివారణకు కమిషనర్ వై.ఓ నందన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. డ్రోన్ల ద్వారా మందు పిచికారీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు 135 రోజులు నగరంలోని మురుగు కాలువల్లో ఈ హైటెక్ పద్ధతిలో మందులు చల్లుతామని చెప్పారు. ప్రజలు సైతం సహకరించి నెల్లూరును దోమల రహిత నగరంగా మార్చాలని పిలుపునిచ్చారు.
PPM: వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రక్తదానం మహాదానమని, ప్రజలు రక్తదానం పట్ల ఉన్న అపోహలను వీడి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మనం ఇచ్చే రక్తం మరొకరికి పునర్జన్మను ప్రసాదిస్తుందని గుర్తు చేశారు.
SKLM: ఉపాధి హామీ పనుల్లో ఫేస్ యాప్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. హిరమండలం మండలం గుళుమూరులో శుక్రవారం ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో ప్రవేశపెట్టిన ఈపద్ధతి వలన కొంతమందికి హాజరుపడక ఇబ్బంది పడుతున్నారని, దీనివలన వేతనం నష్టపోతున్నారన్నారు.
ATP: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. ఈ భేటీలో ఉమ్మడి అనంతపురం జిల్లా మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.