• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘స్వీయ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి’

తూ.గో జిల్లాలో సెన్సస్–2027లో భాగంగా స్వీయ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని, వివరాలతో పాటుగా కుటుంబ సభ్యులు వివరాలు కూడా నమోదు చేసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా https://se.census.gov.in పోర్టల్ ద్వారా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చన్నారు.

April 16, 2026 / 03:24 PM IST

పొదలకూరులో అగ్నిమాపక వారోత్సవాలపై అవగాహన

NLR: పొదలకూరులో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా గురువారం మారుతీ నగర్ అగ్నిమాపక సిబ్బంది స్థానిక ప్రజలకు ఎలక్ట్రికల్, గ్యాస్, వల్ల ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా సురక్షితంగా రక్షించుకోవాలి అనే అంశంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఎండాకాలం చిన్న పిల్లలు బావులు, చెరువుల వద్దకు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

April 16, 2026 / 03:20 PM IST

వన్యప్రాణుల కోసం ముందుకొస్తున్న స్వచ్ఛంద సేవకులు

KDP: మైదుకూరు పట్టణ ప్రాంతానికి చెందిన పలువురు యువత వన్యప్రాణుల సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన యువత అటవీ ప్రాంతానికి వెళ్లి తొట్లను ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనాలతో బిందెల ద్వారా నీటిని తెచ్చి మూగజీవాల దాహార్తి తీరుస్తున్నారు. అటవీ అధికారులు చేపట్టాల్సిన పనిని స్వచ్ఛంద సేవకులు చేస్తూ ఉండడం పట్ల పలువురు యువతను అభినందిస్తున్నారు.

April 16, 2026 / 03:20 PM IST

రెండో స్థానంలో నిలిచిన విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే

ELR: చింతలపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ విభాగంలో 979 మార్కులతో జిల్లాలో రెండవ స్థానంలో నిలిచిన మారుమూడి చరిష్మాను ఎమ్మెల్యే రోషన్ కుమార్ అభినందించారు. ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యార్థిని అభినందించారు. నారా లోకేష్ విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ కళాశాలలు , పాఠశాలలో పెను మార్పులు తీసుకొచ్చారని వివరించారు.

April 16, 2026 / 03:18 PM IST

తిరుపతిలో ఘనంగా తెలుగు నాటక రంగ దినోత్సవం

TPT: తిరుపతిలో తెలుగు నాటక రంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి కళాకారులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం ఛైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కందుకూరి వీరేశలింగం తన రచనలు, నాటకాల ద్వారా ఆంధ్రులను ప్రగతి పథంలో నడిపించారని కొనియాడారు.

April 16, 2026 / 03:17 PM IST

ఆసుపత్రిలో రోగికి నిర్లక్ష్యం.. బంధువుల ఆవేదన

అన్నమయ్య: మదనపల్లె ప్రభుత్వ సర్వ బోధన ఆసుపత్రిలో రోగిని పట్టించుకోలేదనే ఆరోపణలు ఇవాళ చర్చనీయాంశంగా మారాయి. అత్యవసర పరిస్థితిలో రోగిని స్ట్రెచర్‌పై తీసుకువచ్చినా, వైద్య సిబ్బంది స్పందన ఆలస్యమైందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

April 16, 2026 / 03:15 PM IST

రేపు మినీ జాబ్ మేళా

VZM: ఈనెల 17న విజయనగరంలోని MR కాలేజ్‌లో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా ఇవాళ తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్, మెడ్‌ప్లస్, క్వెస్ కార్ప్, అపోలో ఫార్మసీలు సంస్థలు పాల్గొంటాయని వెల్లడించారు. 10వ తరగతి, డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణులై, 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వాళ్ళు అర్హులని పేర్కొన్నారు.

April 16, 2026 / 03:14 PM IST

‘PUC సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే’

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే, PUC ఛైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షతన గురువారం వెలగపూడి సచివాలయంలో పీయూసీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన ప్రజా రంగ సంస్థల పనితీరుపై చర్చించారు. అలాగే, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని తెలిపారు.

April 16, 2026 / 03:13 PM IST

‘పార్టీ కోసం నా ప్రాణం ఇస్తాను’

PPM: సీతానగరం మండలంలోని 35 గ్రామపంచాయతీల నాయకులతో స్థానిక మండల కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీని తెలుగు గౌరవం కోసం, తెలుగు వారి ఆత్మ అభిమానం కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టీడీపీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని అన్నారు.

April 16, 2026 / 03:11 PM IST

కారుపై కూలిన తాటి చెట్టు

విశాఖలోని శ్రీహరిపురం మార్కెట్ సముదాయం వాకర్స్ జోన్ వద్ద గాలివానకు తాటి చెట్టు నేలకూలింది. చెట్టు ముందు భాగం విరిగి పార్కింగ్‌లో ఉన్న కారుపై పడటంతో వాహనం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే స్థానికులు స్పందించి చెట్టును తొలగించారు.

April 16, 2026 / 03:11 PM IST

మంత్రి నిధులతో భక్తులకు అన్నసంతర్పణ

ELR: నూజివీడు పట్టణంలోని పోతురెడ్డిపల్లి రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో మంత్రి పార్థసారథి సొంత నిధులతో ఇవాళ భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. మంత్రి పార్థసారథి జన్మదినోత్సవ వేడుకలు సందర్భంగా, ఆయనను శిరిడి సాయి ఎల్లవేళలా ఆశీర్వదించి, అండగా నిలవాలని కోరారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

April 16, 2026 / 03:04 PM IST

మంగళగిరిలో ‘ప్రజా దర్బార్’

GNTR: మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో పాటు పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్ జానీ సైదా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను స్వీకరించారు. సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

April 16, 2026 / 03:01 PM IST

జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం

CTR: వీ.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. MPCలో మమత (979), CECలో తస్మియా భాను (967), BiPCలో వనిత (951), నర్సింగ్‌లో మోహర్ (926) ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు జాకీర్, డా. తమీం, అఖిల్ అహ్మద్ తదితరులు విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు.

April 16, 2026 / 03:01 PM IST

పెద్దకడబూరులో గడ్డివాము దగ్ధం

KRNL: పెద్దకడబురుకి చెందిన బొగ్గుల దేవన్న అనే రైతుకు చెందిన సుమారు 4 ఎకరాల వరిగడ్డి ఇవాళ అగ్నికి ఆహుతి అయింది. ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు రైతు వాపోయారు. కళ్లెదుటే మూగజీవాలకు ఆహారంగా నిల్వ ఉంచిన వరిగడ్డి బూడిద కావడంతో రైతు బొరున విలపించాడు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.80 వేల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు.

April 16, 2026 / 03:00 PM IST

CITU యూనియన్‌లోకి చేరికలు

ATP: గుంతకల్లు పట్టణంలో 60 మంది AITUC ఆటో కార్మికులు గురువారం CITU భగత్ సింగ్ ఆటో యూనియన్‌లోకి చేరారు. వారిని CITU జిల్లా నాయకులు శ్రీనివాసులు, సాకే నాగరాజు కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. కార్మిక చట్టాల అమలు, కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, 8 గంటల పనిదినం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

April 16, 2026 / 03:00 PM IST