CTR:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ జవహర్, కార్యదర్శి చిన రాములు ఐఏఎస్‌లను జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్సీ వర్గాల సమస్యలు మరియు వారి అభివృద్ధిపై చర్చించారు. ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్డైరెక్టర్ బాబు పాల్గొన్నారు.
E.G: ఇళ్లు లేని అర్హులందరికీ త్వరలోనే టిడ్కో ఇళ్లు కేటాయిస్తామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయంలో మున్సిపల్ & రెవెన్యూ అధికారులతో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం నాటికి మెయిన్ డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేస్తాం అన్నారు.
GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావేదిక’ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
KRNL: హాలహర్వి మండలంలోని 15 గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో వరలక్ష్మి ఇవాళ తెలిపారు. బాపురం, కామినహల్, మెదేహలకు బీ.లక్ష్మీనారాయణ, బెవినహల్ తదితర గ్రామాలకు కే.శ్రీనివాసరెడ్డి, హాలహర్వి పరిధిలోని గ్రామాలకు పీ.రామాంజినేయులు, మిగిలిన గ్రామాలకు వరలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి గ్రామాల అభివృద్ధి పనులు సమర్థంగా నిర్వహించాలన్నారు.
SKLM: అమరావతి ఒక అంతులేని దోపిడీ అని, రాజధానిగా ‘మావిగన్’ మాత్రమే ఆచరణ సాధ్యమని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస తన కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అమరావతి నిర్మాణానికి రూ. 401 కోట్లు ఖర్చు చేశారని, ఇది దోపిడీకి నిదర్శనం అని అన్నారు.
కోనసీమ: ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. అమలాపురంలో వైసీపీ నేతలు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చిన దగ్గరనుంచి కూటమి నేతలకు నిద్ర పట్టడం లేదని అన్నారు. అందుకే రాధాకృష్ణ విష ప్రచారం చేస్తున్నారన్నారు.
KDP: YCP అధినేత జగన్ ప్రతిపాదించిన మావిగన్‌పై ABN ఛానల్లో మహిళలను కించపరిచేలా ప్రసారం చేయడం నీచమైన చర్య అని YCP రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి అన్నారు. బుధవారం సిద్ధవటం (మం) భాకరాపేటలో ఆమె మాట్లాడారు. రాధాకృష్ణ ఒక ఛానల్ ఎండిగా సమాజాలకి ఆదర్శంగా ఉండాల్సింది పోయి మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.
NDL: మహానంది రెగ్యులర్ తహసీల్దారుగా పీ. రమాదేవిని నియమిస్తూ బుధవారం కలెక్టర్ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహసీల్దారుగా ఉన్న ఆమెకు తహసీల్దారుగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం మహానంది మండలంలో తాత్కాలిక తహసీల్దారుగా (FAC) పనిచేస్తున్న ఆమె.. పదోన్నతిపై మండలంలో విధులు నిర్వహించనున్నారు.
SKLM: జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, వృత్తి గౌరవం కోసం ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర వ్యాప్తంగా దూకుడు ప్రదర్శిస్తోందని జాతీయ కమిటీ సభ్యుడు ఎన్. ఈశ్వరరావు అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని ఏపీ ఎన్జీవో హోమ్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలపై సమగ్రంగా పోరాటం చేస్తామన్నారు.
VZM: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని నెల్లిమర్ల జూట్ మిల్ కార్మిక సంఘం అధ్యక్షులు తిరుపతిరావు డిమాండ్ చేశారు. ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో బుధవారం నెల్లిమర్ల జూట్ మిల్ వద్ద నిరసన చేపట్టారు. బ్రిటిష్ కాలంలో కార్మిక వ్యతిరేక బిల్లును నిరసిస్తూ భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్తులు అసెంబ్లీపై పొగబాంబు విసిరారని గుర్తుచేశారు.
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 52, 89, 90వ వార్డుల్లో సుమారు రూ.2.39 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించే లక్ష్యంతో ఈ పనులను చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
ASR: రాష్ట్ర స్థాయి విద్యా సదస్సును విజయవంతం చేయాలని డుంబ్రిగూడ యూటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. డుంబ్రిగుడలో బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 12న రంపచోడవరంలో 6వ రాష్ట్రస్థాయి గిరిజన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆశ్రమ, జీపీఎస్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, కనీస వసతుల లేమి, అదనపు బాధ్యతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
E.G: తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్నీ కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. మండలంలో ఇప్పటికే 50 శాతం కోతలు పూర్తయ్యాయని, మిగిలిన పంటలు కూడా కోతలకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
అన్నమయ్య: మదనపల్లె నుంచి తిరువన్నామలైకు ప్రతి మంగళవారం ప్రత్యేక రైలు సౌకర్యాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ట్రైన్ నం.17165 తెల్లవారుజామున 01:05 గంటలకు బయలుదేరి ఉదయం 07:28 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. భక్తులకు అనుకూలంగా ఈ సేవలను ప్రారంభించగా, తక్కువ ధరలతో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
SS: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇందులో భాగంగా ధర్మవరం నుంచి హెచ్ఎస్ నాందేడ్‌కు ప్రత్యేక రైలును నడపనున్నారు. రైలు నంబర్ 07190 ధర్మవరం నుంచి ఈనెల 12వ తేదీ ఆదివారం బయలుదేరుతుంది. అలాగే నాందేడ్ నుంచి ధర్మవరానికి (07189) ఈనెల 10న రైలు అందుబాటులో ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది.