VZM: కొత్తవలస, ఉత్తరాపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడైన సబ్బవరపు పోతురాజు తన సమస్యను తెలియజేయడానికి కలెక్టరేట్‌కు వచ్చారు. పోర్టికో వద్ద ఆయనను గమనించిన కలెక్టర్ రాం సుందర్ రెడ్డి నేరుగా వెళ్లి దరఖాస్తును స్వీకరించారు. తన సమస్యను వివరించగా, కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. వారికి వీల్ చైర్ ఏర్పాటు చేయించారు.
కోనసీమ: కొత్తపేటలోని కమ్మిరెడ్దిపాలెం ప్రభుత్వ పాఠశాల సోమవారం కురిసిన వర్షానికి నీట మునగడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు వెళ్లాలంటే నీటిలో నడవాల్సిన పరిస్థితి నెలకొంది. సరైన మురుగు నీటి వ్యవస్థ లేకపోవడంతో ప్రతి వర్షానికి పాఠశాల జలమయమవుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
విశాఖ: అడవివరం పరిధిలోని 523, 524, 528 సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు.
అనకాపల్లి: జార్ఖండ్ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల జాతీయస్థాయి హాకీ పోటీలకు కోచ్‌గా ఎలమంచిలికి చెందిన హాకీ ప్లేయర్ ఈపు రవికుమార్ వ్యవహరిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కే నరేష్ సోమవారం తెలిపారు. ఆయన కడప జిల్లా పులివెందులలో ఖేలో హాకీ కోచ్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. రవికుమార్ ఆధ్వర్యంలో మహిళా హాకీ జట్టు సత్తా చాటుతున్నట్లు తెలిపారు.
GNTR: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన పోలీసులను హోంమంత్రి వంగలపూడి అనిత ఇవాళ పరామర్శించారు. మంగళగిరి NRI ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బందిని ఆమె కలిసి ధైర్యం చెప్పారు. బాధితులకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మెరుగైన చికిత్స అందించాలన్నారు.
అల్లూరి: పాడేరులోని నన్నయ వర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న నిర్వహించే ‘తలాష్’ స్టేట్ లెవెల్ ఫెస్ట్ పోస్టర్‌ను ఇవాళ పడేరులో జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ఆవిష్కరించారు. విద్యార్థుల్లో ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇది అద్భుత వేదికని ఆయన అన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ డా.మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
BPT: కర్లపాలెం మండలం యాజలి గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శిగా జి.అమర్నాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బుచ్చిరెడ్డిపాలెం నుంచి బదిలీపై వచ్చిన ఆయన తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవోలను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ఏట్రవారిపాలెం గ్రేడ్-2 కార్యదర్శిగా ఎం.చలపతి బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముత్తుకూరు మండలం పంటపాలెం నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు.
PLD: జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను వివరించగా, సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ప్రకాశం: సంతమాగులూరులో హైస్కూల్ వెనకవైపు ఉన్న కర్ణ నాగిరెడ్డి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న కొద్దిపాటి బంగారన్ని తీసుకెళ్లారని పోలీసులు చెప్పారు. ఇంటియజమాని వైజాగ్‌లో నివాసం ఉంటారని స్థానికులు తెలిపారు. ఇంటికి తాళం వేసి ఉంటుందని, ఎప్పుడో వచ్చి వెళ్తుంటారని అన్నారు.
అల్లూరి: బీజేపీ సిద్ధాంతాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీఏసీఎస్ డైరెక్టర్ రీమల చంద్రరావు, గిరిజన మోర్చా జిల్లా నేత అరిమెల రాజు కార్యకర్తలకు సూచించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం (మన ఊరు మన జెండా) సందర్భంగా సోమవారం కొయ్యూరు మండలంలోని రత్నంపేట గ్రామంలో బీజేపీ జెండాను ఎగురవేశారు. దేశసేవ, సుపరిపాలన, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా బీజేపీని స్థాపించారన్నారు.
ELR: కొయ్యలగూడెం మండలం సీతంపేటలో బీజేపీ పార్టీ 46వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా యూవ మోర్చా నాయకులు పెనుమర్తి సురేష్ బాబు, మండల కిసాన్ మోర్చా రామినా రమేష్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బాలం నరేష్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర నిధులు పథకాలు ప్రతి ఒక్కరికి అందడమే బీజేపీ లక్ష్యం అన్నారు.
కడప నగరపాలక సంస్థ కమిషనర్ చంద్ర ఇవాళ మార్నింగ్ విజిట్‌లో భాగంగా 12వ, 14వ డివిజన్లలో పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. ప్రాంతాల్లో జరుగుతున్న శుభ్రత కార్యక్రమాలను సమగ్రంగా పరిశీలించి, పనుల నాణ్యతపై శానిటేషన్ అధికారులు నిరంతరం సమీక్ష నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణకు ఆదేశించారు.
విశాఖ: మధురవాడ ఐటీ సెజ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా మృతి చెందిన యువకుడి మృతదేహన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెందిన యువకుడు మణికంఠ (34)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ATP: అనంతపురం జేఎన్టీయూ ఎన్టీఆర్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన 15వ స్నాతకోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన బంగారు పతకాలు, పట్టాలను అందజేశారు. విద్యా రంగంలో జేఎన్టీయూ అందిస్తున్న సేవలను కొనియాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
NDL: ప్రజలు వడదెబ్బ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు సూచించారు. ఇవాళ ప్రధాన కూడళ్లలో అవగాహన బ్యానర్లను ఆయన ఆవిష్కరించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మధ్యాహ్నం వేళల్లో అనవసరంగా బయట తిరగవద్దని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ నుంచి ప్రజలను చైతన్య పరిచేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.