• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో పోలీసుల సమీక్ష

CTR: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత, ఐపీఎల్ బెట్టింగ్ నియంత్రణపై అవగాహన పెంచాలని అధికారుల సూచించారు. గ్రామ స్థాయిలో మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచేలా కార్యదర్శులు వారధిలా పనిచేయాలని సూచించారు.

April 8, 2026 / 10:14 PM IST

స్తంభాన్ని ఢీకొన్న బైక్.. యువకుడు దుర్మరణం!

W.G: కాళ్ల మండలం కోలనపల్లికి చెందిన చెల్లెం ఐజక్(19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మంగళవారం సోదరుడిని బస్సు ఎక్కించి తిరిగి వస్తుండగా, కాళ్లలోని దత్తాత్రేయ గుడి వద్ద బైక్ స్తంభాన్ని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అతడిని భీమవరం ఆసుపత్రికి తరలించగా, బుధవారం చికిత్స పొందుతూ.. ప్రాణాలు విడిచాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

April 8, 2026 / 10:01 PM IST

సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన కార్యక్రమం

NTR: నందిగామలో సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ వైవిఎల్ నాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ మహతి, గాంధీ సెంటర్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. హెల్మెట్ ధరించడం, అతివేగం నివారించడం, వాహన పత్రాలు వెంట ఉంచుకోవడం తప్పనిసరి అన్నారు.

April 8, 2026 / 10:00 PM IST

ల్యాండ్ పూలింగ్‌పై రైతులతో ఎమ్మెల్యే భాష్యం సమావేశం

PLD: అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై పెదమద్దూరు గ్రామ రైతులతో పాటు సీఆర్‌డీఏ అధికారులతో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు త్వరితగతిన ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

April 8, 2026 / 10:00 PM IST

కోళ్ల మకాంలో ఆరడుగుల పాము హల్‌చల్

ELR: జంగారెడ్డిగూడెం శ్రీనివాసపురం చక్రి అనే వ్యక్తికి చెందిన కోళ్లు మకాంలోకి బుధవారం మధ్యాహ్నం ఆరడుగుల గోధుమ తాచుపాము ప్రవేశించింది. పామును గమనించిన అక్కడ పనిచేసే వర్కర్లు సమీపంలో ఉన్న స్నేక్ సేవియర్స్ సొసైటీకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సంస్థ అధ్యక్షుడు క్రాంతి పామును చాకచక్యంగా పట్టుకుని అడవి ప్రాంతంలో విడిచిపెట్టాడు.

April 8, 2026 / 09:51 PM IST

వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్‌కు బుధవారం రావులపాలెం వాస్తవ్యులు సత్తి సాయి శ్రీ వైష్ణవి ఆమె కుటుంబ సభ్యులు రూ.1,00,000 విరాళం అందజేశారు విరాళం అందించారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. ఆయన దాత కుటుంబానికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.

April 8, 2026 / 09:47 PM IST

రైల్వే ప్రభుత్వ భూమిలో మట్టి అక్రమ తరలింపు

KRNL: తుగ్గలి మండలం పరిధిలోనే చెన్నంపల్లి రెవెన్యూలో ఉన్న రైల్వే ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకం చేసి, రైల్వే డబుల్ లైన్ నిర్మాణానికి తరలిస్తున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై చెన్నంపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సంబంధిత అధికారులకు బుధవారం ఫిర్యాదు చేసినట్లు గ్రామానికి చెందిన సంజీవ చౌదరి, మరి కొంతమంది తెలిపారు.

April 8, 2026 / 09:45 PM IST

‘అమరావతి పేరుతో వేల కోట్లు దోపిడీ’

అన్నమయ్య: సీఎం చంద్రబాబు ప్రసంగాలు “నేనే చేశాను” అన్న దానికే పరిమితమై హాస్యాస్పదంగా మారాయని వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. అమరావతి పేరుతో వేల కోట్ల దోపిడీ జరుగుతోందని, కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే భారీ అంచనాలు పెంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని విమర్శించారు.

April 8, 2026 / 09:40 PM IST

సైబర్ మోసాలపై యువతకు అవగాహన

KDP: జిల్లాలో సైబర్ నేరాలపై అప్రమత్తత పెంచేందుకు కడప తాలూకా సీ.ఐ టీ.రెడ్డెప్ప ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు నగర్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆన్‌లైన్ మోసాల ప్రమాదాలపై యువతకు సూచనలు ఇచ్చారు. అనుమానాస్పద కాల్స్‌కు స్పందించవద్దని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని హెచ్చరించారు.

April 8, 2026 / 09:37 PM IST

పరిగిలో పశువులకు దాన పంపిణీ కార్యక్రమం

SS: పరిగిలోని రైతు భరోసా కేంద్రం వద్ద పశువులకు దాన పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. పశుసంవర్ధక రంగానికి మద్దతు ఇవ్వడం, రైతులకు తోడ్పాటు అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీడీపీ మండల కన్వీనర్ గోవింద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ధాన కార్యదర్శి హనుమయ్య, ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు సూర్యనారాయణ, ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.

April 8, 2026 / 09:35 PM IST

గుత్తి పింఛన్ భవనంలో నకారాకు ఘనంగా నివాళులు

ATP: గుత్తి పెన్షనర్ల భవనంలో బుధవారం పెన్షనర్ల ఆశాజ్యోతి నకారా 112 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా నకారా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కోశాధికారి జన్నే కుల్లయ్య బాబు మాట్లాడుతూ.. పెన్షనర్ల హక్కుల కోసం సాధన కోసం నకారా ఎంతో కృషి చేశారని వారు పేర్కొన్నారు. ఫించన్ అనేది ప్రభుత్వ దయ దక్షిణ్యం కాదని అది ఉద్యోగి హక్కు అన్నారు.

April 8, 2026 / 09:17 PM IST

ఉపాధి మహిళా కూలీ మృతి

NDL: చాగలమర్రి మండలంలోని మూడురాళ్ళపల్లె గ్రామంకు చెందిన ఓబులమ్మ(65) ఉపాధి పనులకు వెళ్తూ జీవనం సాగించేది. బుధవారం ఉపాధి పనులకు వెళ్ళి పని ముగించుకొని మోటర్‌ సైకిళ్‌లో ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా క్రింద పడింది. వెంటనే స్థానికులు 108 సహాయంతో వాహనంలో చాగలమర్రిలోని కేరళ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

April 8, 2026 / 09:00 PM IST

పాఠశాల యాజమాన్యాలతో సమక్ష సమావేశం

PLD: పెదకూరపాడు మండలంలోని అన్ని ప్రైవేటు, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమీక్ష సమావేశం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సంవత్సరం పదవ తరగతి విద్యార్థులకు హెచ్.పీ.సీ వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఎంఈవోఏ కుల ప్రసాదరావు, సత్యనారాయణ కోరారు.

April 8, 2026 / 09:00 PM IST

సంతమాగులూరులో ‘జల ధార-జల హారతి’ వర్క్‌షాప్

BPT: భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి కలగకుండా చూడాలంటే ప్రతి గ్రామంలో నీటి భద్రత సాధించడం అనివార్యమని సంతమాగులూరు మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) ఎనుబర్ల యలమంద పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో “జల ధార-జల హారతి, నీటి భద్రత-నీటి సంఘాల బాధ్యత” అనే అంశంపై ఆయన అధ్యక్షతన ప్రత్యేక కార్యచరణ వర్క్‌షాప్ నిర్వహించారు.

April 8, 2026 / 09:00 PM IST

జడ్పీ హైస్కూల్ పాఠశాల సిబ్బంది ప్రచారం

AKP: రోలుగుంట మండలం జానకిరామపురం జడ్పీ హైస్కూల్ పాఠశాల సిబ్బంది బుధవారం సాయంత్రం నూతన విద్యార్థుల ఎన్రోల్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ రావు ఆధ్వర్యంలో పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలను నూతన విద్యార్థులకు వివరించారు. అత్యధిక మార్కులు తెచ్చుకునే విధంగా విద్యార్థులను మోటివేట్ చేస్తున్నామన్నారు.

April 8, 2026 / 08:55 PM IST