ప్రకాశం: సింగరాయకొండ (మం) కలికివాయలో టీడీపీ సీనియర్ నాయకులు గాంధీ చౌదరిని మంత్రి డోలా శనివారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల కాలంలో అయినా అనారోగ్యంతో ఆసుపత్రి నుంచి చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చాడు. ఈ మేరకు గాంధీ ఆరోగ్య పరిస్థితుల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. మంత్రి డాక్టర్ కావడంతో కొన్ని సలహాలు సూచనలు చేశారు.
KRNL: కోడుమూరు పట్టణం, పరిసర గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం రూ.39 కోట్ల నిధులను మంజూరు చేసింది. ప్రజల్ జీవన్ మిషన్ పథకం కింద విడుదలైన ఈ నిధులతో సంవత్సరాలుగా ఎదురవుతున్న నీటి కొరత తీరనుంది. శనివారం టీడీపీ పట్టణాధ్యక్షుడు గంగాధర్ నాయుడు, గోపాల్ నాయుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా అమలు చేయలేదని విమర్శించారు.
NDL: బనగానపల్లె మండలంలో గ్రామ పంచాయతీల అభివృద్ధిలో వైసీపీ సర్పంచులు,వార్డు మెంబర్ల కృషి ఎంతో గొప్పదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొనియాడారు. శనివారం పట్టణంలో వైసీపీ కార్యాలయంలో పదవీకాలం ముగిసిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల అభినందనలు వేడుకలు నిర్వహించారు. వారిని సన్మానించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని, గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ (DDRC) సమావేశంలో శనివారం మంత్రుల నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని అభివృద్ధి పనుల గురించి సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
VZM: మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని బొండపల్లి ఎస్సై మహేష్ హెచ్చరించారు. ఇవాళ బొండపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మైనర్లు నడుపుతున్న వాహనాలను పట్టుకున్నారు. అనంతరం తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లకు వాహనాలు ఇస్తే లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ATP: గుంతకల్లులో శనివారం ఉదయం “రన్ ఫర్ జీసస్” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రైస్తవులు పట్టణ పుర విధులలో యేసు క్రీస్తూ మరణాన్ని, పునురుత్తాన్ని గురించి చెబుతూ…, “రన్ ఫర్ జీసస్” కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో “UCWF” జెనరల్ సెక్రటరీ సొల్మన్ విజయరాజ్, ప్రెసిడెంట్ ఇమ్మానుయేల్, వైస్ ప్రెసిడెంట్ చౌరప్ప, తదితర పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నార...
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లె మండలంలోని గంగమ్మ దేవాలయ ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు EO శ్రీనివాసులు తెలిపారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి కలిగిన భక్తులు ఈవో కార్యాలయంలో లభించే దరఖాస్తు ఫారాలను తీసుకుని, 20 రోజుల్లోపు పూర్తి వివరాలతో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
VSP: గాజువాకకు చెందిన ఇద్దరు మహిళా న్యాయవాదులు జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికయ్యారు. రాష్ట్ర హైకోర్టు ప్రకటించిన ఎంపిక వివరాల్లో వీరి పేర్లు ఉండడంతో గాజువాక బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. కొట్టాన బిందు రెండో ప్రయత్నంలోనే విజయం సాధించగా, ధర్మాల లలితశ్రీ వివాహం తర్వాత కూడా చదువు కొనసాగించి జడ్జిగా ఎంపికయ్యారు.
కోనసీమ: రామచంద్రపురం మండలం ద్రాక్షారామం ప్రత్యేక పరిపాలన అధికారిగా ఎంపీడీవో పద్మజ్యోతి బాధ్యతలు స్వీకరించారు. ఆమె ద్రాక్షారామంతో పాటు రామచంద్రపురం మండల పరిధిలోని వెల్ల, వెంకటాయపాలెం, వెలంపాలెం గ్రామాలకు కూడా ఆమె ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఆమెను సచివాలయ ఉద్యోగులు, గ్రామ పెద్దలు ఆమెను కలిసి స్వాగతం పలికారు.
KRNL: మద్దికేర KGBV పాఠశాలలో 2026-27 విద్యాసంవత్సరం పాఠశాలల ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 10వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ జ్యోతిరెడ్డి ఇవాళ తెలిపారు. పాఠశాలల్లోని 6, 11 తరగదుల్లో అన్ని సీట్లతో పాటు 7, 8, 9, 12 తరగతుల్లో ఖాళీ సీట్లు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఫారాలను పాఠశాలలో అందించాలని తెలిపారు.
ATP: టీటీడీ చైర్మన్ పదవి నుంచి బిఆర్ నాయుడుని తొలగించాలని వైసిపి జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం గుంతకల్లులోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. నైరుతి రెడ్డి మాట్లాడుతూ.. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని పాపా కాలనీలో షేక్ రహీం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో మనస్పర్దాల కారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకొని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు విచారణలో తేలింది. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
KRNL: ప్రజలు ఆధ్యాత్మిక భావనను అలవర్చుకుని భగవంతుని అనుగ్రహం పొందాలని MP బస్తిపాటి నాగరాజు సూచించారు. ఇవాళ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా కర్నూలు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కోల్స్ చర్చి ఆవరణంలో నిర్వహించిన “రన్ ఫర్ జీసస్” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మికత మనసుకు శాంతి, సమాజానికి ఐక్యతను అందిస్తుందన్నారు.
GNTR: తెనాలి నియోజకవర్గంలో పలువురు లబ్ధిదారులకు CMRF చెక్కులను శనివారం ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పంపిణీ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేదలకు వీటిని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనను కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. కష్టకాలంలో ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు.
NTR: ఇబ్రహీంపట్నం(M) కొటికలపూడిలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ జరిగింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఈ కార్యక్రమంలో పాల్గొని పుస్తకాలు అందజేశారు. రీసర్వే పూర్తైన గ్రామాల్లో కొత్త పాస్‌పుస్తకాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. గతంలో రైతులు అధికారులు చుట్టూ తిరిగేవారని, ఇప్పుడు అధికారులే రైతుల వద్దకు వెళ్లి పుస్తకాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు.