VZM: ఈనెల 17న విజయనగరంలోని MR కాలేజ్‌లో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా ఇవాళ తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్, మెడ్‌ప్లస్, క్వెస్ కార్ప్, అపోలో ఫార్మసీలు సంస్థలు పాల్గొంటాయని వెల్లడించారు. 10వ తరగతి, డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణులై, 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వాళ్ళు అర్హులని పేర్కొన్నారు.
SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే, PUC ఛైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షతన గురువారం వెలగపూడి సచివాలయంలో పీయూసీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన ప్రజా రంగ సంస్థల పనితీరుపై చర్చించారు. అలాగే, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని తెలిపారు.
PPM: సీతానగరం మండలంలోని 35 గ్రామపంచాయతీల నాయకులతో స్థానిక మండల కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీని తెలుగు గౌరవం కోసం, తెలుగు వారి ఆత్మ అభిమానం కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టీడీపీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని అన్నారు.
విశాఖలోని శ్రీహరిపురం మార్కెట్ సముదాయం వాకర్స్ జోన్ వద్ద గాలివానకు తాటి చెట్టు నేలకూలింది. చెట్టు ముందు భాగం విరిగి పార్కింగ్‌లో ఉన్న కారుపై పడటంతో వాహనం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే స్థానికులు స్పందించి చెట్టును తొలగించారు.
PLD: మాచవరం మండలంలో RTC ప్రయాణం ప్రమాద భరితంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో వందల సంఖ్యలో మహిళలు బస్సుల్లో కిక్కిరిసిపోతున్నారు. కూర్చునేందుకు సీట్లు కూడా సరిగ్గా లేక ప్లాట్ ఫాంపై నిలబడి మరి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఇలాగైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కవ ఉందని, అదనపు బస్సులు వెయ్యాలని ప్రయాణికులు కోరుతున్నారు.
NDL: ఆత్మకూరు ప్రాజెక్టు పరిధిలోని 3 అంగన్వాడీ కేంద్రాలలో రోస్టర్ ప్రకారం ఆయా పోస్టులకు రిజర్వేషన్లు సవరణ చేసినట్లు ఇవాళ ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి కోటేశ్వరమ్మ తెలిపారు. మహానంది మండలం బసాపురం చలమ అంగన్వాడీ కేంద్రం ఎస్పీ-2, ఆత్మకూరు మండలం నల్లకాలువ గ్రామ అంగన్వాడీ కేంద్రం ఎస్టీ, బాపనంతపురం ఎస్సీ-3 వర్గాలకు రిజర్వేషన్లు మార్చామన్నారు.
GNTR: పొలిట్ బ్యూరో సభ్యులు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్‌లో జరుగుతున్న చర్చలను నేడు, రేపు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ప్రధాని, స్పీకర్, కేంద్రమంత్రులను కలిసి మహిళా సాధికారతకు మద్దతుగా కృతజ్ఞతలు తెలియజేయనున్నారు.
BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చుండూరు, పర్చూరు, చీరాల వన్ టౌన్ స్టేషన్‌ల పరిధిలో గురువారం సంబంధిత పోలీస్ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఆయా ప్రాంతాలను వారు జల్లెడ పట్టి, అనుమతి పత్రాలు లేని 90 బైకులు, మూడు ఆటోలు, ఒక కారును స్వాధీన పరుచుకున్నారు.
W.G: తాడేపల్లిగూడెంలో జనగణన-2027 కార్యక్రమం క్షేత్రస్థాయి పనులు మున్సిపల్ కమిషనర్ ఎం.యేసుబాబు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఎన్యూమరేటర్లు, జనగణన సిబ్బందితో కలిసి1వ వార్డులో ఇంటింటి సర్వే పనులను పరిశీలించారు. జనగణన దేశ అభివృద్ధికి, సంక్షేమ పథకాల రూపకల్పనకు ఆధారమని, ప్రజలందరూ ఎన్యూమరేటర్లకు సరైన సమాచారం అందించి సహకరించాలని కోరారు.
KRNL: మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఎమ్మిగనూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను మునిసిపల్ కమిషనర్ ఎన్.గంగిరెడ్డి పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ASR: మారేడుమిల్లి మండలం ఉత్తలూరు గ్రామానికి చెందిన ఆదిరెడ్డి(42) గురువారం అడవి దున్న దాడిలో మృతి చెందాడని సీఐ ప్రసాద్ తెలిపారు. తన జఫ్రా తోటలో పని చేస్తుండగా అడవి దున్న దాడి చేయడంతో అతను స్పాట్‌లోనే మృతి చెందాడని పేర్కొన్నారు. దీంతో, మారేడుమిల్లి మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ హెచ్చరించారు.
KDP: మైదుకూరు సమీపంలోని కృష్ణాపురంలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ DMHO మల్లేశ్ ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్చి నెలలో జరిగిన అబార్షన్లపై ఆడిట్ నిర్వహించారు. అబార్షన్ల ప్రక్రియలు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులకు ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
NLR: నగరంలోని 39వ డివిజన్ మూలపేట ప్రాంతంలో కమిషనర్ పర్యటించి తాగునీటి సరఫరాను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ ఎస్ఈ మోహన్, ఎన్ఎంసీ ఎస్.ఈ రహ్మత్ జాని, ఈఈ రఘురామ్, ఇతర అధికారులతో కలిసి బ్రాహ్మణ వీధి, ఈ.ఎస్.ఆర్.ఎం వాటర్ ట్యాంక్ పరిసరాల్లో కమిషనర్ పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో నీటి సరఫరా స్థితిగతులపై ఆరా తీశారు.
ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో గురువారం భారతదేశ జనాభా గణన – 2027లో భాగంగా స్వీయ గణన కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ స్లీవా జోజి ప్రారంభించారు. గ్రామంలోని ప్రజల చేత స్వీయ గణన కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ఈ సౌకర్యాన్ని ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని, సులభంగా, త్వరగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు.