ATP: అనంతపురం నగరంలో జనగణన స్వీయ గణనపై అవగాహన కల్పించేందుకు ఆదివారం ‘సెన్సస్ 5K రన్’ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి జిల్లా రెవెన్యూ అధికారి మలోలాతో కలిసి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
సత్యసాయి: కదిరి ప్రభుత్వ ఖాజీగా హఫీజ్ అక్రమ్ భాష నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో MLA కందికుంట వెంకటప్రసాద్‌ను కలిసి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే కందికుంటకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అక్రమ్ భాష ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
NDL: గడివేముల మండల కేంద్రంలో దేశం సత్యం రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పాణ్యం యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలతో యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందుతుందని పేర్కొన్నారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి జట్లు పాల్గొన్నాయి.
KRNL: జిల్లా ప్రజలందరూ జనగణన సర్వే ప్రక్రియకు సహకరించి, నమోదు చేసుకోవాలని ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారు. ఇవాళ ఎంపీ కార్యాలయంలో జనగణన స్వీయ ఎన్యుమరేషన్ భాగంగా ఇటివల స్వీయ గణన చేసుకున్న ఎంపీ నాగరాజుకు జనగణన సహాయాధికారి శివన్న మెమెంటో అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం స్వీయ గణనలో పాల్గొని సరైన వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.
ELR: లింగపాలెం మండలం రంగాపురం గ్రామంలో చిన్న అన్నవరంగా పేరుగాంచిన శ్రీ భూనీల సహిత సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో 62వ బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మొదటిరోజు స్వామి అమ్మవార్లను ఆలయ వేద పండితులు స్వామివారిని పెళ్ళి కుమారుడిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా అలంకరించారు. అనంతరం విశేష పూజా కార్యక్రమాలు జరిపించారు.
అనకాపల్లి పట్టణం గవరపాలెం అంబేద్కర్ నగర్లో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహంపై రాళ్లతో దాడి చేసి కనుబొమ్మను పగలగొట్టారు. విషయం తెలుసుకున్న జనసేన సమన్వయకర్త భీమరశెట్టి రాంకి ఆదివారం ఘటన స్థలాన్ని సందర్శించి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
KRNL: వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరులో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. బినామీల జోరు పెరిగిందని, అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
విజయనగరం: జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం వారి క్యాంపు కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన ప్రజా సమస్యలపై గళమెత్తారు. పెన్షన్ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఇప్పటివరకు కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేశారా అని ప్రశ్నించారు. MSME శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదన్నారు.
E.G: సెన్సస్–2027 అవగాహన కోసం ఆదివారం ఉదయం వై జంక్షన్ వద్ద నుంచి 5K రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, కమిషనర్ రాహుల్ మీనా రన్‌ను ప్రారంభించారు. అధికారులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు. ఏప్రిల్ 30 వరకు స్వీయ నమోదు అవకాశం ఉండగా, ఇప్పటి వరకు 23 వేల మంది నమోదు చేసుకున్నారు. మే 1 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది.
ATP: టోల్ గేట్ సిబ్బందిపై కల్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరులు చేసిన దాడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గండబోయినపల్లె వద్ద జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు.
NLR: జనగణన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని నెల్లూరు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఆదివారం సూచించారు. జనగణనపై అవగాహన కల్పిస్తూ నెల్లూరు నగరంలో 5కే రన్ జరిగింది. కార్పొరేషన్ ఆధ్వర్యంలో VRC స్టేడియం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు ర్యాలీ చేపట్టారు. ప్రజలు కచ్చితమైన సమాచారం ఇవ్వాలని సూచించారు
కడపలో జనగణన–2027 అవగాహనలో భాగంగా నిర్వహించిన 5K రన్లో ఎమ్మెల్యే మాధవి, టీడీపీ నేత శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా ప్రజలు తమ వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువత, నగర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి సెవెన్ రోడ్స్ వరకు రన్ నిర్వహించారు. ఆరోగ్యకర జీవనశైలి ప్రాముఖ్యతను నేతలు వివరించారు.
KKD: గొల్లప్రోలులో శ్రీ వాసవి మాత జయంతిని ఆదివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని రథంపై ఆశీనులు చేసి పెద్ద ఎత్తున గొల్లప్రోలు పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. గొల్లప్రోలు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు నిర్వహించారు.
అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో విచారణ వేగం పుంజుకుంది. ఎస్పీ జగదీశ్ పర్యవేక్షణలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు సీఐలు, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లను వీఆర్‌కు పంపారు. ఈ కేసులో మరో సీఐ, కొంతమంది కానిస్టేబుళ్ల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.
KRNL: తిరుమల శ్రీవారిని ఆదివారం ఆలూరు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి దర్శించుకున్నారు. దర్శనానంతరం స్వామివారి ఆశీస్సులు స్వీకరించిన ఆమె.. నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాలు, శ్రేయస్సు, సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని, భగవంతుని కృపతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవ కొనసాగిస్తానన్నారు.