ప్రకాశం: టంగుటూరులోని కొండపి ఫ్లైఓవర్ వద్ద సోమవారం ఓ కంటైనర్ లారీ అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకువెళ్లింది. ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు నుంచి ఒంగోలు వైపు కంటైనర్ లారీ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లుగా లారీ డ్రైవర్ తెలిపాడు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూస్తారు.
NTR: ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకునేందుకు ఆన్‌లైన్ యోగా అద్భుత అవకాశమని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ‘అమరావతి యోగా’ యూట్యూబ్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారాలను ప్రారం...
VSP: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ నిర్వహించిన ‘డయల్ యువర్ APEPDCL సీఎండీ’ కార్యక్రమంలో 45 వినతులు అందాయి. లో-వోల్టేజ్, బిల్లులు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్ మార్పులు, సోలార్ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి వాటిని పరిశీలించి తక్షణ చర్యలకు ఆదేశించారు.
VZM: దేశవ్యాప్తంగా మెగా యూత్ ఫోర్స్ విస్తరణకు ప్రతి ఒక్క మెగా అభిమాని కృషి చేయాలని మెగా యూత్ ఫోర్స్ జాతీయ కన్వీనర్ ఏడిద బాబి పిలుపునిచ్చారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఓ హోటల్‌లో ఈ సమావేశం ఇవాళ నిర్వహించారు. చిరంజీవికి దేశవ్యాప్తంగా అపారమైన అభిమానులు ఉన్నారని, అభిమానులంటే ఆయనకూ ప్రత్యేకమైన అభిమానముందని తెలిపారు.
గుంటూరు జిల్లా పోలీసు శాఖ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని PGRS నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యల ఫిర్యాదులను నేరుగా పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు.
SKLM: టెక్కలిలో ఉన్న ఐతం కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి 2026లో గ్రాడ్యుయేట్ అయిన 9 మంది విద్యార్థులకు హైదరాబాద్‌కు చెందిన ఎన్‌సీసీ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగాలు లభించాయి. వీరికి ప్రారంభ వార్షిక వేతనం రూ. 3.19 లక్షలు అందనుంది. విద్యార్థుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలిపారు.
KDP: రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ స్మిత ఆధ్వర్యంలో స్త్రీ శక్తి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత సెల్ కన్వీనర్ శివమ్మ సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, స్వీయ రక్షణపై అవగాహన కల్పించారు. అధ్యాపకులు విద్యార్థినులకు విలువైన సూచనలు అందించగా, కార్యక్రమం మహిళా సాధికారతకు ప్రేరణగా నిలిచింది.
AKP: కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్లో ఇవాళ అంబేద్కర్ జీవిత చరిత్రపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఆయన జీవిత చరిత్రపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఇంఛార్జ్ హెచ్ఎం సుకుమార్ తెలిపారు. విజేతలకు రేపు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డ్రాయింగ్ టీచర్ ఎస్ కిషోర్ పాల్గొన్నారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఓ దివ్యాంగుడికి తక్షణమే ఊరట లభించింది. గోరంట్ల మండలానికి చెందిన హుస్సేన్ పీరా మూడు చక్రాల సైకిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ వెంటనే స్పందించారు. అక్కడికక్కడే బాధితుడికి ట్రై సైకిల్‌ను అందజేశారు.
ATP: కంబదూరు పాత ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ సోమవారం కాలనీవాసులు ఎంపీడీవో కార్యాలయాన్ని కాలి బిందెలతో ముట్టడించారు. కొంతకాలంగా నీటి సరఫరా నిలిచిపోవడంతో దూరప్రాంతాల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
PLD: నీటి వనరుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. నాదెండ్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ యంత్రాంగం సూచనలను ప్రజలు ఆచరణలో పెడితేనే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
ప్రకాశం: పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరులోని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం పోస్టర్‌లను ఆవిష్కరించారు. చిన్నపిల్లల ఆరోగ్యానికి సమతుల్య ఆహారం అవసరమని, జంక్ ఫుడ్ తగ్గించాలని ఎమ్మెల్యే సూచించారు. పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రులు సమయం కేటాయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో మహిత, సూపర్వైజర్ జ్యోతి పాల్గొన్నారు.
కృష్ణా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఎంపీలు భూపతి వర్మ, వల్లభనేని బాలశౌరి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించే బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి ఏపీ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
KDP: ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు టీ షాప్, కూల్ డ్రింక్స్ షాప్‌లలో అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని, వారి వద్ద నుంచి మొత్తం 23 Old Admiral మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు.
CTR: కుప్పంలో అంబేద్కర్ జయంతి వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టణంలోని RTC బస్టాండ్ కూడలి, NTR విగ్రహం సమీపంలో 40 అడుగుల ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ భారీ కటౌట్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణ నడిబొడ్డున పండుగ వాతావరణం నెలకొంది.