• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం: ఎమ్మెల్యే

SS: కదిరి STSN డిగ్రీ కళాశాల మైదానంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్‌లో సత్యసాయి జిల్లా ఎస్పీ సతీశ్ జట్టుతో కలిసి MLA కందికుంట వెంకటప్రసాద్ క్రికెట్ ఆడారు. ఎంత ఒత్తిడి ఉన్నా క్రీడల్లో పాల్గొనడం వల్ల మనోస్థైర్యం లభిస్తుందని చెప్పారు. యువత ప్రతిరోజూ కొంత సమయం క్రీడలకు కేటాయించి ఆరోగ్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

May 30, 2026 / 01:05 PM IST

జిల్లాలో గిరిజన బాలికపై అఘాయిత్యం..!

NLR: కలువాయి మండలంలో తల్లిదండ్రులు లేని 12 ఏళ్ల గిరిజన బాలికపై బంధువుల మనవడు (24) లైంగిక దాడికి పాల్పడటంతో 6 నెలల గర్భిణి అయిందని స్థానికులు తెలిపారు. కేసు దాచిపెట్టేందుకు పెద్దలు అబార్షన్‌కు, అధికారుల వద్ద తప్పుడు వయసు సర్టిఫికెట్‌కు యత్నించగా వైద్యులు, MRO నిరాకరించినట్లు సమాచారం. ICDS, సఖీ అధికారులు విచారణ చేస్తున్నా కేసు నమోదు కాలేదని తెలిసింది.

May 30, 2026 / 01:03 PM IST

ముమ్మరంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం

కోనసీమ: అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని 6వ, 7వ వార్డుల్లో శనివారం నిర్వహించిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. కాలువలు, డ్రైన్లలోని పూడికలు, చెత్తను తొలగించి శుభ్రపరిచారు. ప్రజలు చెత్తను డ్రైన్లలో వేయకుండా పరిశుభ్రత పాటించాలని కమిషనర్ సూచించారు.

May 30, 2026 / 01:02 PM IST

తెనాలిలో అనధికార కార్యకలాపాలపై టాస్క్ ఫోర్స్ కొరడా

GNTR: నందివెలుగు జంక్షన్ నుంచి ఆటోనగర్ వరకు ఉన్న ఆక్రమణలను రూరల్ టాస్క్ ఫోర్స్ అధికారులు తొలగించారు. రహదారికి ఇరువైపులా హోల్డింగ్స్, అనధికార వ్యాపారాలు, కూలేందుకు సిద్ధంగా ఉన్న చెట్లను పోలీస్ రెవెన్యూ, పంచాయతీ అధికారులు కలిసి తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. భారీ ఈదురుగాలలో వర్షాలు కురుస్తున్నందున ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తగా తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

May 30, 2026 / 01:01 PM IST

గిరిజన యువత క్రీడల్లో రాణించాలి: జిల్లా ఎస్పీ

అల్లూరి: గిరిజన యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, క్రీడల్లో రాణించాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సూచించారు. యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు తలారిసింగి ఆశ్రమ పాఠశాలలో నెల రోజుల పాటు 100 మంది గిరిజన యువకులకు వేసవి క్రికెట్ క్రీడా శిక్షణా కేంద్రాన్ని నిర్వహించామన్నారు. శనివారం ఆ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. శిక్షణలో పాల్గొన్న యువతను అభినందించారు.

May 30, 2026 / 01:01 PM IST

పోలవరం ఎస్సైగా అప్పారావు బాధ్యతలు స్వీకరణ

ELR: పోలవరం పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పి. అప్పారావు శనివారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తానని పేర్కొన్నారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకైనా తావులేకుండా, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

May 30, 2026 / 12:57 PM IST

వేముగోడులో గ్యాస్ సిలిండర్ పేలి భారీ నష్టం

KRNL: గోనెగండ్ల మం. వేముగోడులో శనివారం గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించి ఇల్లు, పక్కనే ఉన్న కొట్టం పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంట్లోని సామాన్లు, కొట్టంలో ఉన్న నగదు, బంగారం, ధ్రువపత్రాలు, ధాన్యం బూడిదయ్యాయి. సుమారు రూ.6 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు బోయ రాముడు వాపోయారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరారు.

May 30, 2026 / 12:40 PM IST

సాలూరు రైల్వే స్టేషన్లకు మోక్షం ఎప్పుడో..?

PPM: సాలూరు రైల్వే స్టేషన్ పరిసరాలు నిర్వహణ లేక పిచ్చిమొక్కలతో దర్శనం ఇస్తుంది. విశాఖ రైలు సౌకర్యం కోసం నిర్మించిన కొత్త స్టేషన్, రైల్వే ట్రాక్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై అధ్వాన్నంగా మారింది. పాత స్టేషన్ కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రైలు సేవలు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.

May 30, 2026 / 12:39 PM IST

దుంపగడపలో ఉచిత కంప్యూటర్ శిక్షణ విజయవంతం

W.G: దుంపగడపలోని వి.వి.గిరి ప్రభుత్వ కళాశాలలో నెల రోజుల పాటు నిర్వహించిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ముఖ్య అతిథి శ్రీ పల్లి లక్ష్మరెడ్డి మాట్లాడుతూ.. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధి అవసరమని పేర్కొన్నారు, శిక్షణ తీసుకున్న 120 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి. ప్రతాప్ కుమార్ పాల్గొన్నారు.

May 30, 2026 / 12:39 PM IST

మహిళల సాధికారతకు టీడీపీ కట్టుబడి ఉంది : దండంగి మమత

కోనసీమ: చట్టసభల్లో టీడీపీ తరపున 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామని మంత్రి లోకేష్ మహానాడులో ప్రకటించడం హర్షణీయమని చింతలూరుకి చెందిన టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు దండంగి మమత పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం టీడీపీ ఎప్పుడూ కృషి చేస్తోందన్నారు. మహిళలకు ఆస్తి హక్కులు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వంటి పథకాలు టీడీపీ తీసుకొచ్చిందన్నారు.

May 30, 2026 / 12:38 PM IST

స్వచ్ఛ ఆంధ్ర కోసం చీపురు పట్టన మంత్రి.

కోనసీమ: స్వచ్ఛమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల భాగస్వామ్యంతోనే “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” సాధ్యమవుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాలూరు పట్టణంలో శనివారం నిర్వహించిన “స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో పాల్గొన్న ఆమె స్వయంగా చీపురు పట్టి రోడ్లు, కాలువలను శుభ్రం చేశారు.

May 30, 2026 / 12:36 PM IST

కాకినాడ కలెక్టర్‌తో ఎంపీ భేటీ.. సీఎం పర్యటన పై చర్చ

KKD: రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ బాబు శనివారం కాకినాడ కలెక్టర్ హరేంధిరప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లో ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. CM చంద్రబాబు తుని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై వారిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హరేంధిరప్రసాద్‌తో కలిసి ఎంపీ సతీశ్ బాబు నేరుగా తుని పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు.

May 30, 2026 / 12:35 PM IST

‘మహిళలను వేదిస్తే జైలుకెళ్లటం ఖాయం’

VZM: మహిళలు, బాలికలను వేధిస్తే జైలుకు వెళ్లడం ఖాయమని రామభద్రాపురం SI జ్ఞాన ప్రసాద్ హెచ్చరించారు. శనివారం మండలంలోని పాడివానివలసలో ఉపాధి కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు రక్షణకు కఠిన చట్టాలు అమలులో ఉన్నాయని తెలిపారు. అలాగే గంజాయి వాడిన, అమ్మిన, రవాణా చేసిన, తాగిన చర్యలు ఉంటాయన్నారు.

May 30, 2026 / 12:31 PM IST

మద్దిలేటి స్వామి ఆలయానికి భారీ విరాళం

NDL: రంగాపురం శ్రీలక్ష్మి మద్దిలేటి స్వామి దేవస్థానం అభివృద్ధికి ఆళ్లగడ్డ మండలం భాచాపురం గ్రామానికి చెందిన గజ్జల మధుమోహన్ రెడ్డి దంపతులు రూ.1.40 లక్షల విరాళం అందించినట్లు ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు నేడు తెలిపారు. దాతలు దేవస్థానం కార్యాలయంలో అధికారులను కలిసి ఈ మొత్తాన్ని అందజేశారు. విరాళం ఇచ్చిన దాతల కోసం, అమ్మవారి ప్రసాదాలు అందించే శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు.

May 30, 2026 / 12:30 PM IST

తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ ఎమ్మెల్యే

VZM: బొబ్బిలి పట్టణానికి రూ. 123.9 కోట్ల వ్యయంతో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి ఎమ్మెల్యే ఆర్‌వీ‌ఎస్ కేకే రంగారావు (బేబీ నాయన) భూమిపూజ నిర్వహించారు. సీతానగరం మండలంలో సువర్ణముఖి నది నుంచి బొబ్బిలికి తాగునీరు అందించేలా ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. పనులు పూర్తయితే పట్టణ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం అందుబాటులోకి రానుంది.

May 30, 2026 / 12:16 PM IST