కడప జిల్లాలో ఇవాళ చికెన్, మటన్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. చికెన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేజీ స్కిన్‌తో కూడిన చికెన్ రూ.213, స్కిన్లెస్ చికెన్ రూ.243, నాటుకోడి మాంసం కేజీ రూ.700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ప్రాంతాలవారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వ్యాపారులు పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం 2 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం చూపుతున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బూర్జ, హిర మండలాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్య అవకాశం ఉందని తెలిపారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండల దృష్ట్యా వృద్దులు, చిన్నపిల్లలు జాగ్రత్తంగా ఉండాలని సూచించారు.
ELR: అంబేద్కర్ జయంతి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని చింతలపూడి ఎస్సై సతీష్ కుమార్ పేర్కొన్నారు. శనివారం రాత్రి మండలంలోని సీతానగరం గ్రామంలో అంబేద్కర్ కమిటీ సభ్యులకు ఆయన అవగాహన కల్పించారు. ప్రతి విగ్రహం వద్ద లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం, అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఊరేగింపులు సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
VSP: సండే వచ్చిందంటే మాంసం ప్రియులకు పండగే. విశాఖలో చికెన్, మటన్‌తో పాటు చేపల కోసం జనం మార్కెట్లు, ఫిషింగ్ హార్బర్ వద్ద క్యూ కడుతుంటారు. పెందుర్తి, గోపాలపట్నం, గాజువాక, తదితర ప్రాంతాల్లో ఇవాళ కేజీ మటన్ రూ.1000కి విక్రయిస్తున్నారు. చికెన్ స్కిన్లెస్ రూ.250, విత్ స్కిన్ రూ.230, లైవ్ రూ.155, సొంట్యాం కోడి రూ.300 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
W.G: ఏపీ మహిళా ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గాన్ని శనివారం తణుకులో ఎన్నుకున్నారు. తణుకు NGO సంఘ భవనంలో శనివారం నిర్వహించిన ఈ సమావేశానికి అమరావతి ఛైర్పర్సన్ వీకేఎన్ జయలక్ష్మి ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షులుగా కాట్రగడ్డ సుభాషిణి, కార్యదర్శి పిడకల సునీత, కోశాధికారి కోట చంద్రకుమారి, ఉపాధ్యక్షులుగా ఎం.షర్లీ, టి.అనంత ఎన్నికయ్యారు.
పల్నాడు: కారంపూడి మండలం కాకాని వారి పాలెంలో టీడీపీ నాయకుడు జాస్తి గంగారావు కుమారుడి వివాహం జరిగింది. కార్యక్రమానికి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మనంద రెడ్డి హాజరయ్యారు. నూతన దంపతులు మణికంఠ సాయి, గగన రత్నలను ఆశీర్వదించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద జరిగిన భీకర ప్రమాదంపై విచారణ వేగవంతమైంది. ట్యాంకర్ కారుపై పడటంతో BMW కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రత, సాంకేతిక కారణాలను తెలుసుకోవడానికి కంపెనీ సాంకేతిక బృందం ఆదివారం ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి నివేదిక ఇవ్వనుంది.
VZM: భోగాపురం ఏపీ మోడల్ హై స్కూల్లో నేడు 6వ తరగతికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి.పార్వతి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఉదయం 9 గంటలకే పాఠశాలకు హాజరుకావాలని సూచించారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్‌తో పాటు అవసరమైన పత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలని పేర్కొన్నారు.
SKLM: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం అని ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. శనివారం రాత్రి ఎచ్చెర్ల (M) భగీరథపురంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ మేరకు నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమంలో పాల్గొని , పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి గ్రామంలో ఉండే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
తిరుపతి జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో పని చేసే ఓ మహిళా ఉద్యోగినితో అదే కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రాజెక్ట్ కంట్రోలర్(APC) వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె స్థానిక MLAకు ఫిర్యాదు చేయడంతో శనివారం విచారణ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందనట్లు తెలుస్తోంది.
CTR: బైరెడ్డిపల్లి మండలం దొంతిరాళ్లపల్లి సమీపంలోని భాస్కర్ రెడ్డి అనే రైతు మామిడి తోటకు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టారు. ఈ కాలిపోయిన మామిడి తోటతో సుమారు రూ.7 లక్షల వరకు నష్టం వాటిలిందని రైతు వాపోయాడు. ఈ ఘటనపై బైరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు: తెనాలి సమీపంలోని చినరావూరులో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఇంటిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో ప్రాంతంలో భయం నెలకొంది. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మంటలను నియంత్రించారు. ఈ ఘటనలో ఇంటి సామగ్రి కాలిపోయింది. అయితే ఎవరికీ గాయాలు కాకపోవడం ఉపశమనం కలిగించింది.
AKP: కేజీబీవీలో ప్రవేశాలకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు పెంచినట్లు కోటవురట్ల కేజీబీవీ ప్రత్యేక అధికారి సరితాదేవి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. 6వతరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు, ఏడు నుంచి 12 తరగతిలో ఖాళీలకు ఆల్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
NLR: నెల్లూరు సంతపేట మార్కెట్లో ఖాళీగా ఉన్న 31 షాపులను కమిషనర్ వై.ఓ. నందన్ ఆధ్వర్యంలో శనివారం లీజుదారులకు కేటాయించారు. లీజుదారులు కరెంటు బిల్లులు చెల్లించాలని, కౌన్సిల్ నిర్ణయించిన మేరకు ప్రతి నెలా అద్దె వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ ఆఫీసర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
E.G: బీసీలంతా ఎకతాటిపైకి వచ్చి గొప్ప నాయకత్వంగా ఎదగాలని MLA మద్దిపాటి వెంకటరాజు సూచించారు. గోపాలపురంలో జ్యోతి బాఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో MLA మాట్లాడుతూ.. రూ.50 లక్షల విలువల గల జ్యోతి బాపూలే భవనం కడతానని హామీ ఇచ్చారు. బీసీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన ఆశయ సాధనకు బీసీలంతా కృషి చేయాలన్నారు.