• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విద్యుత్ షాక్‌తో వ్యక్తి దుర్మరణం

KRNL: ఓర్వకల్లు మండలం హుసేనాపురంలో నిన్న దాసరి మహేష్ (33) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. కాల్వబుగ్గ గురుకుల పాఠశాలలో పనుల కోసం తీసుకెళ్లిన ఇనుప నిచ్చెనను తిరిగి తీసుకువస్తుండగా, అది విద్యుత్ తీగలకు తగిలి వెంటనే కుప్పకూలిన మహేష్‌ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

April 8, 2026 / 11:40 AM IST

సందర్శకుల వినతుల పరిష్కారానికి మంత్రి భరోసా

SS: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి సవితను బుధవారం పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు కలిశారు. రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు కూడా ఆమెను కలిసి తమ సమస్యలను విన్నవించారు. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన మంత్రి, వాటిని సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

April 8, 2026 / 11:36 AM IST

దిలీప్ కుమార్‌ను కలిసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

ASR: ఒడిశాకు చెందిన రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి, మే ఫేర్ హోటల్స్ యజమాని దిలీప్ కుమార్ రేను జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు, సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ప్రముఖ హోటల్‌లో జరిగిన ఈ భేటీలో శాలువా కప్పి, బొకే అందజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో కూటమి నేతలు జగన్ తదితరులు పాల్గొన్నారు.

April 8, 2026 / 11:31 AM IST

సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల

SKLM: జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Ed 3వ సెమిస్టర్ అలాగే B.PEd & D.PEd 3వ సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ కావ్య జోష్ణ్న ఈ ఫలితాలను బుధవారం విడుదల చేశారు. అభ్యర్థులు ఫలితాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆమె సూచించారు.

April 8, 2026 / 11:30 AM IST

యార్డ్‌ గెస్ట్‌హౌస్‌‌ను పరిశీలించిన ఛైర్‌పర్సన్

ATP: అనంతపురం మార్కెట్ యార్డ్‌లో రైతులు, వ్యాపారుల కోసం నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి డైరెక్టర్లతో కలిసి బుధవారం పరిశీలించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుపయోగంగా ఉన్న భవనాన్ని పునరుద్ధరించినట్లు ఆమె తెలిపారు. త్వరలో దీనిని ప్రారంభించి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రైతుల సౌకర్యార్థం మరిన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.

April 8, 2026 / 11:28 AM IST

తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యే పుత్తా

KDP: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ విరామ బ్రేక్ సమయంలో ఆయన తన సోదరుడు పుత్తా లక్ష్మారెడ్డి ఇతర స్నేహితులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆయనను సత్కరించి ఆశీర్వదించారు.

April 8, 2026 / 11:12 AM IST

పోలీస్ క్రీడల్లో మహేశ్‌కు గోల్డ్ మెడల్

AKP: దేవరాపల్లి మండలానికి చెందిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ రెడ్డి మహేశ్ కుమార్ అనకాపల్లి జిల్లా పోలీస్ వార్షిక క్రీడల్లో ప్రతిభ కనబర్చారు. విశాఖపట్నం కైలాసగిరి సమీప ఆర్మడ్ రిజర్వ్ గ్రౌండ్‌లో జరిగిన పోటీల్లో బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్‌లో రెండు బంగారు పథకాలు సాధించారు. కబడ్డీలో కాంస్య పథకం సాధించినట్లు పేర్కొన్నారు.

April 8, 2026 / 11:10 AM IST

మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే ఫైర్

NLR: కందుకూరు మున్సిపాలిటీలో పారిశుధ్య పరిస్థితులపై ఎమ్మెల్యే ఇంటూరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అనూషతో పాటు సిబ్బందితో సమీక్ష నిర్వహించి, పర్యవేక్షణ లోపాలను ప్రశ్నించారు. కాలువల్లో చెత్త తొలగింపు లేకపోవడం, నిర్లక్ష్యంగా పనులు చేయడంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.

April 8, 2026 / 11:09 AM IST

ఈ నెల 10న మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ

ATP: ఆత్మకూరులోని ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 10న మండల స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ లక్ష్మీనరసింహ ఓ ప్రకటనలో బుధవారం తెలిపారు. మండలంలోని సమస్యలు, అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మండల స్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు తప్పక హాజరు కావాలని సూచించారు.

April 8, 2026 / 10:59 AM IST

‘సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలి’

NLR: రానున్న మూడు నెలల్లో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో, మే, జూన్, జూలై నెలల్లో తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

April 8, 2026 / 10:57 AM IST

విడవలూరులో శంకరంబాడి సుందరచారి వర్ధంతి కార్యక్రమం

NLR: విడవలూరు మండలంలోని వావిళ్ళ జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ ప్లస్ ఉన్నత పాఠశాలలో బుధవారం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత శంకరంబాడి సుందరాచారి వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం చెంచురామయ్య పాల్గొన్నారు.

April 8, 2026 / 10:53 AM IST

‘ప్రజలకు రుచికరమైన ఆహారం అందించాలి’

SKLM: ఆమదాలవలస పట్టణంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను  మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి బుధవారం ఉదయం సందర్శించారు. ఈ మేరకు ప్రజలతో మాట్లాడి క్యాంటీన్‌లో అందిస్తున్న ఆహారం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు రుచికరమైన ఆహారం అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. శానిటేషన్ సెక్రటరీ సింహాచలం ఉన్నారు. 

April 8, 2026 / 10:48 AM IST

ముంబయి పర్యటనకు వెళ్ళనున్న మంత్రి కందుల

E.G: నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ నేడు, రేపు ముంబయిలో పర్యటించమన్నారు. స్థానిక గ్రాండ్ హయత్ హోటల్‌లో ఏప్రిల్ 8, 9 తేదీల్లో జరిగే 21వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఏషియాకు మంత్రి హాజరు కానున్నారు. ముంబయి వేదికగా ఏపీ పర్యాటక రంగంలోని పెట్టుబడి అవకాశాలు తదితర వాటిని వివరించనున్నారు.

April 8, 2026 / 10:45 AM IST

జర్నలిస్టులకు రేపు ఉచిత వైద్య శిబిరం: కలెక్టర్

సత్యసాయి: పుట్టపర్తిలోని షాదీ మహల్‌లో ఈనెల 9న అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి రక్త పరీక్షలు, ఈసీజీతో పాటు జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ వంటి నిపుణులు సేవలు అందిస్తారని ఆయన పేర్కొన్నారు.

April 8, 2026 / 10:44 AM IST

పల్లాతో భేటీ పార్టీ బలోపేతంపై చర్చ

KRNL: ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ విజయవాడలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ సమస్యలు, పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపై ఆయనతో చర్చించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె కుమారుడు, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

April 8, 2026 / 10:41 AM IST