• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

30 నెలలుగా జీతాలు లేవని కలెక్టర్‌కు పిర్యాదు

కోనసీమ: జిల్లాలో ఎంపీపీలు, ఎంపీటీసీలకు తక్షణమే వేతనాలు చెల్లించాలని మంగళవారం కలెక్టర్ మహేశ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అంబాజీపేట, అల్లవరం ఎంపీపీలు దొమ్మేటి వెంకటేశ్వరరావు, ఇళ్ల శేషారావు కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని, దీనిపై తక్షణం స్పందించాలని వారు కోరారు.

April 22, 2026 / 08:12 AM IST

ఏల్చూరిలో చాపల చెరువు వేలం పాట వాయిదా

బాపట్ల: సంతమాగులూరు మండల పరిధిలోని ఏల్చూరి గ్రామంలో నిర్వహించాల్సిన చేపల చెరువు బహిరంగ వేలం వాయిదా పడింది. అధికారులు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వేలం నిర్వహించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల దీనిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వేలం నిర్వహణకు సంబంధించి తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

April 22, 2026 / 08:09 AM IST

మద్యం మత్తులో యువకుడిపై దాడి

ప్రకాశం: పొదిలి మండలం ఏలూరు గ్రామంలో మద్యం మత్తులో మంగళవారం రాత్రి బీహార్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు హుస్సేన్ అనే వ్యక్తిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడిలో హుస్సేన్‌కి తీవ్ర గాయాలు కావడంతో పొదిలి ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 22, 2026 / 08:08 AM IST

ఈ నెల 23న సర్టిఫికెట్ల వెరిఫికేషన్: సీడీపీవో

ASR: కొయ్యూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 37 అంగన్వాడీ ఆయా పోస్టులకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 23న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం హాజరు కావాలని సీడీపీవో ఎల్. దేవమణి మంగళవారం తెలిపారు. ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో గురువారం ఉదయం 11గంటలకు స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో హాజరు కావాలన్నారు.

April 22, 2026 / 08:07 AM IST

దొంగతానానికి వెళ్లి షాక్‌తో మృతి

VZM: సంతకవిటి మండలం గుళ్ల సీతారామపురం సమీప మామిడితోటలో సోమరాజుపేటకు చెందిన భాస్కరరావు మృతి చెందిన ఘటనపై పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈనెల 19న వేకువజామున తోటలో నిరుపయోగంగా ఉన్న మూడు విద్యుత్ స్థంభాల తీగలను దొంగిలించిన అతడు, పక్కనే విద్యుత్ సరఫరా ఉన్న వైర్లు కత్తిరించే సమయంలో షాక్‌కు గురై మృతి చెందినట్లు ఎస్ఐ గోపాలరావు తెలిపారు.

April 22, 2026 / 08:05 AM IST

ఉత్సవాల ముందస్తు ఏర్పాట్లపై కమీషనర్ సమీక్ష

VZM: బొబ్బిలిలోని పైడితల్లి, పోలమాంబ అమ్మవార్ల సిరిమానోత్సవాల ముందస్తు ఏర్పాట్లపై మున్సిపల్‌ కమిషనర్‌ రామలక్ష్మి సంభందిత అదికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎండల దృష్ట్యా ప్రధాన కూడళ్లలో వాటర్‌ పాయింట్లు, ఏరియా వైజ్‌ టీములతో క్లీనింగ్‌ పర్యవేక్షణ, మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

April 22, 2026 / 08:04 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి రూ.10000 జరిమానా

AKP: పాయకరావుపేటలో నమోదు చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఓ వ్యక్తికి ఎలమంచిలి కోర్టు రూ.10,000 జరిమానా విధించినట్లు సీఐ అప్పన్న తెలిపారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న పి. వెంకటరమణపై కేసు నమోదు చేసి ఎలమంచిలి కోర్టులో మంగళవారం హాజరు పరిచామన్నారు. ముద్దాయి జరిమానా కట్టలేనందున 6 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఎలమంచిలి సబ్ జైలుకు తరలించామన్నారు.

April 22, 2026 / 08:02 AM IST

ట్రాఫిక్‌ సమస్యలకు ఏఐ టెక్నాలజీ

VSP: విశాఖ‌లో ట్రాఫిక్‌ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ యోచిస్తున్నారు. గతంలో పోలీసుల ప్రతిపాదనపై ఐదు చోట్ల పైలట్‌ ట్రయల్‌ నిర్వహించిన ఈ ప్రాజెక్టు అనివార్య కారణాలతో నిలిచిపోయిందని తెలిపారు.

April 22, 2026 / 08:02 AM IST

నేడు పారిజాత గిరిలో తిరునక్షత్ర వేడుకలు

ELR: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం భగవద్ రామానుజాచార్య తిరునక్షత్ర వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 9 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు, అనంతరం తదియారాధన కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.

April 22, 2026 / 07:59 AM IST

నీలమణి దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే

SKLM: జిల్లా కేంద్రంలోని కొన్న వీధిలో జరుగుతున్న నీలమణి దుర్గ అమ్మవారి ఉత్సవాల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం రాత్రి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.

April 22, 2026 / 07:39 AM IST

23న, భగీరథ మహర్షి జయంతి వేడుకలు: కలెక్టర్

PPM: ఈనెల 23న శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలను కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా,ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్ మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. వేడుకలకు జిల్లాస్థాయి అధికారులు, పాల్గొంటారని చెప్పారు.

April 22, 2026 / 07:31 AM IST

చంద్ర ప్రభ వాహనంపై వీరేశ్వర స్వామి ఊరేగింపు

కోనసీమ: మురమళ్లలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణం మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా జరిగింది. ఈ వేడుకకు MLA దాట్ల సుబ్బరాజు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అంతకుముందు స్వామి వారు చంద్ర ప్రభ వాహనంపై గ్రామోత్సవంలో ఊరేగారు. ఎదురు సన్నాహం, ద్వాదశ ప్రదక్షిణల అనంతరం వేద మంత్రాల మధ్య కళ్యాణ మహోత్సవం జరిపారు.

April 22, 2026 / 07:30 AM IST

ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు

ASR: జిల్లాలో వచ్చే ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 26 వరకు స్వల్ప వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. 0.2 నుంచి 2.1 మి.మీ వరకు వర్షపాతం ఉండొచ్చని పేర్కొన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 35-36 డిగ్రీల మధ్య కొనసాగనున్నాయి. రైతులు వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

April 22, 2026 / 07:29 AM IST

అడవిలో నుంచి బయటకు వచ్చిన దుప్పి

NLR: అనంతసాగరం మండలంలోని పాత దేవరపల్లిలో మంగళవారం రాత్రి చుక్కల దుప్పి ఒక ఇంట్లోకి ప్రవేశించింది. గ్రామ సమీపంలోని ఉత్తర కాలువ వద్దకు నీటి కోసం వచ్చిన దుప్పిని కుక్కలు గమనించి తరమడంతో గ్రామంలోని ఒక ఇంట్లోకి దూరింది. స్థానికులు దుప్పిని బంధించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

April 22, 2026 / 07:28 AM IST

మాజీ సీఎంను కలిసిన మక్బూల్

సత్యసాయి: వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్.మక్బూల్ మర్యాదపూర్వకంగా కలిశారు. పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు. మక్బూల్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

April 22, 2026 / 07:28 AM IST