• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

టీడీపీ కార్యాలయంలో సర్పంచ్‌ల సత్కారం

CTR: కుప్పం నియోజకవర్గంలో పదవీకాలం పూర్తి చేసిన 14 మంది సర్పంచ్‌లను MLC కంచర్ల శ్రీకాంత్ రెడ్డి, మునిరత్నం టీడీపీ కార్యాలయంలో శాలువాలతో సత్కరించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

April 10, 2026 / 05:20 PM IST

రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

NTR: కంచికచర్ల మండలం మొగులూరు గ్రామంలో డోనబండ–కీసర రాష్ట్ర రహదారి మెరుగుదల పనులకు శంకుస్థాపన జరిగింది. రూ.1.50 కోట్ల వ్యయంతో కిలోమీటర్ 14 నుంచి 21 వరకు ఆర్&బీ రోడ్డు అభివృద్ధి చేపట్టనున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈ కార్యక్రమంలో పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ రోడ్డు పూర్తైతే రైతులకు మరింత ఉపయోగంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

April 10, 2026 / 05:15 PM IST

పులివెందుల యువతి గ్రేట్..!

KDP: పులివెందుల పట్టణానికి చెందిన అనిలాదేవి, గురుదత్తల కుమార్తె సాయి వర్షిత తాజాగా విడుదలైన SSC CGL ఫలితాల్లో సత్తాచాటారు. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆమె గతేడాది ఐదు సెంట్రల్ జాబ్స్ సాధించి ఔరా అనిపించారు. న్యాయ శాస్త్రం చదివిన ఐదేళ్లలో నాలుగు బంగారు పతకాలు సాధించడం విశేషం. ఆమెను పలువురు అభినందించారు.

April 10, 2026 / 05:14 PM IST

దెందులూరు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యం

ELR: పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి అర్జీలు స్వీకరించారు. అలాగే వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే దెందులూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు.

April 10, 2026 / 05:14 PM IST

అధ్యాపకుల కృషితో ‘ఎ’ గ్రేడ్ సాధించాం: ప్రిన్సిపాల్

అన్నమయ్య: మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు అకాడమిక్ ఆడిట్‌లో ‘ఎ’ గ్రేడ్ లభించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన ఆడిట్‌లో ఆడిటర్లు డాక్టర్ రుక్మిణి, డాక్టర్ గులాబ్ జాన్ కళాశాల నిర్వహణ, బోధనా విధానాలను పరిశీలించి ఈ గ్రేడ్‌ను ప్రకటించారు. ఈ విజయానికి అధ్యాపకుల కృషి కారణమని ప్రిన్సిపాల్ వనజ తెలిపారు.

April 10, 2026 / 05:12 PM IST

ఆలూరులో టీడీపీ గ్రీవెన్స్ డే నిర్వహణ

KRNL: ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. ప్రధానంగా మౌలిక సదుపాయాల సమస్యలు ఫిర్యాదు చేశారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఇంఛార్జ్ హామీ ఇచ్చారు.

April 10, 2026 / 05:11 PM IST

భీమవరంలో ప్రజా వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం

W.G: భీమవరం నియోజకవర్గ టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రజావేదిక గ్రీవెన్స్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ తోట సీతారామ లక్ష్మీ పాల్గొన్నారు. అనంతరం ప్రజల నుంచి వినతి పత్రాలు సేకరించారు. అలాగే వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

April 10, 2026 / 05:10 PM IST

తోట్లవల్లేరులో CMRF చెక్కులు పంపిణీ

కృష్ణా: తోట్లవల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా లబ్ధిదారులకు CMRF చెక్కులు శుక్రవారం పంపిణీ చేశారు. సయ్యద్ అమీనాకు రూ. 45,905, సింహాద్రి రాజేష్ బాబుకు రూ. 26,218 పాముల చంటిబాబుకు రూ. 31,843, యేమినేని శ్రీలక్ష్మికు రూ.30,786, బడుగు నాగమణికు రూ.30,028ల చెక్కులు అందజేశారు.

April 10, 2026 / 05:09 PM IST

కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే

TPT: పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల 43వ వార్షికోత్సవంలో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. రూసా నిధులతో రూ.24.63 లక్షల వ్యయంతో నిర్మించిన మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. విద్యార్థులు కృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

April 10, 2026 / 05:07 PM IST

క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కలెక్టర్

SS: బుక్కపట్నం డైట్ కళాశాల వీడ్కోలు వేడుకలకు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ట్రైనీ ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు సమయపాలన, క్రమశిక్షణ అలవర్చుకుని జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు.

April 10, 2026 / 05:05 PM IST

తిరుమలను దర్శించుకున్న ఎమ్మెల్యే సునీత

ATP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆమెకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

April 10, 2026 / 05:04 PM IST

భైరవకోనను సందర్శించుకున్న పామూరు సీఐ

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రమైన భైరవకోనను శుక్రవారం పామూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దుర్గేష్ వినోద్ కుమార్ సందర్శించారు. పామూరు నూతన సీఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన ఆలయాన్ని సందర్శించుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు.

April 10, 2026 / 05:04 PM IST

పంట బోదెలోకి దూసుకుపోయిన కారు

కోనసీమ: మండపేట సంఘం కాలని జంక్షన్ వద్ద కారు ప్రమాదవశాత్తూ పంట బోదెలోకి దూసుకుపోయింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రాణనష్టం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు నుంచి రామచంద్రపురం వెళ్తుండగా మండపేట బైపాస్ రోడ్డుకు వచ్చేసరికి సత్యశ్రీ వైపు నుంచి వెళుతున్న మోటార్ సైక్లిస్ట్ అడ్డు వచ్చాడు. అతన్ని తప్పించే క్రమంలో కారు పంట బోదెలోకి దూసుకుపోయిందన్నారు.

April 10, 2026 / 05:02 PM IST

మే 1 నుంచి టీటీసీ శిక్షణ తరగతులు

మే 1 నుంచి జూన్ 11 వరకు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేశ్ తెలిపారు. సాలిపేట మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్లో ఈ తరగతులు జరుగుతాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 26 లోగా www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవచ్చన్నారు.

April 10, 2026 / 05:00 PM IST

నందిగామ ఎసీపీగా చలసాని శ్రీనివాసరావు

NTR: నందిగామ డివిజన్ ఏసీపీగా చలసాని శ్రీనివాసరావు నియమితులయ్యారు. ప్రస్తుతం నందిగామ ఏసీపీగా ఉన్న తిలక్‌ను మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. గన్నవరం డీఎస్పీగా పనిచేస్తున్న చలసాని శ్రీనివాసరావును నందిగామ ఏసీపీగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన త్వరలోనే విధుల్లో చేరనున్నారు.

April 10, 2026 / 04:47 PM IST