• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మహిళా ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్నిక

W.G: ఏపీ మహిళా ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గాన్ని శనివారం తణుకులో ఎన్నుకున్నారు. తణుకు NGO సంఘ భవనంలో శనివారం నిర్వహించిన ఈ సమావేశానికి అమరావతి ఛైర్‌పర్సన్ వీకేఎన్ జయలక్ష్మి ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షులుగా కాట్రగడ్డ సుభాషిణి, కార్యదర్శి పిడకల సునీత, కోశాధికారి కోట చంద్రకుమారి, ఉపాధ్యక్షులుగా ఎం.షర్లీ, టి.అనంత ఎన్నికయ్యారు.

April 12, 2026 / 08:12 AM IST

వివాహ వేడుకలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

పల్నాడు: కారంపూడి మండలం కాకాని వారి పాలెంలో టీడీపీ నాయకుడు జాస్తి గంగారావు కుమారుడి వివాహం జరిగింది. కార్యక్రమానికి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మనంద రెడ్డి హాజరయ్యారు. నూతన దంపతులు మణికంఠ సాయి, గగన రత్నలను ఆశీర్వదించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

April 12, 2026 / 08:09 AM IST

కీసర టోల్ ప్లాజా ప్రమాదం.. సాంకేతిక విచారణ వేగవంతం

ఎన్టీఆర్: కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద జరిగిన భీకర ప్రమాదంపై విచారణ వేగవంతమైంది. ట్యాంకర్ కారుపై పడటంతో BMW కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రత, సాంకేతిక కారణాలను తెలుసుకోవడానికి కంపెనీ సాంకేతిక బృందం ఆదివారం ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి నివేదిక ఇవ్వనుంది.

April 12, 2026 / 08:09 AM IST

గ్యాస్ లీక్‌తో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం

గుంటూరు: తెనాలి సమీపంలోని చినరావూరులో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఇంటిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో ప్రాంతంలో భయం నెలకొంది. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మంటలను నియంత్రించారు. ఈ ఘటనలో ఇంటి సామగ్రి కాలిపోయింది. అయితే ఎవరికీ గాయాలు కాకపోవడం ఉపశమనం కలిగించింది.

April 12, 2026 / 08:04 AM IST

వనికి పోయిన గిరిజనం: భారీ పాము హతం!

ASR: గూడెంకొత్తవీధి మండలంలోని జర్రెల కొత్తూరు గ్రామంలో భారీ పాము సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. శనివారం రాత్రి సమీప అడవి నుంచి సుమారు 15 అడుగుల పొడవైన పాము గ్రామంలోకి ప్రవేశించింది. పాము ఓ ఇంట్లోకి దూరడంతో అక్కడి గిరిజనులు భయంతో పరుగులు తీశారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తమై సుమారు గంటన్నర పాటు శ్రమించి పామును హతమార్చినట్లు తెలిపారు.

April 12, 2026 / 07:46 AM IST

పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి: ఎస్సై

NLR: పిల్లలకు పరీక్షలు పూర్తయి జూన్ 12 వరకు సెలవులు ఉండటంతో ఇంటిపట్టున ఉండే పిల్లలపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఆత్మకూరు ఎస్సై జిలాని శనివారం సూచించారు. పిల్లలు ఇళ్లలో చెప్పకుండా కుంటలు, నది ప్రాంతాలకు వెళ్లి ఈత కొట్టేందుకు వెళ్తుంటారని నీటిలో దిగి ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని, తల్లిదండ్రులు ముందస్తుగానే వారి కదిలికలను గమనించాలని అన్నారు.

April 12, 2026 / 07:40 AM IST

15 నుంచి గ్రామసభలు: MPDO

VZM: ఈ నెల 15 నుంచి 17 వరకు వంగరలోని 29 గ్రామ పంచాయతీలలో అభివృద్ధి ప్రణాళికపై గ్రామసభలు నిర్వహణకు సన్నాహకాలు చేస్తున్నట్లు డిప్యూటీ MPDO రామారావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టవలసిన పనులు, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, మహిళా శిశు సంరక్షణపై చర్చించనునట్లు తెలిపారు.

April 12, 2026 / 07:40 AM IST

విజయవాడలో గంజాయి ముఠా గుట్టురట్టు

ఎన్టీఆర్: వియజవాడలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. శనివారం సాయంత్రం శిఖామణి సెంటర్ సమీపంలో గంజాయి ఉందన్న సమాచారం మేరకు మాచవరం పోలీసులు మెరుపు దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టామన్నారు.

April 12, 2026 / 07:39 AM IST

కచ్చితత్వంతో జనగణనను నిర్వహించాలి: ఎమ్మెల్యే

PPM: జనగణనను కచ్చితత్వంతో నిర్వహించాలని కురుపాం MLA తోయక జగదీశ్వరీ సూచించారు. శనివారం గుమ్మలక్ష్మీపురం ZP హైస్కూల్‌లో MRO శేఖరం ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్యుమరేటర్స్‌ శిక్షణ తరగతులను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు అభివృద్ధికి ఎంతో కీలకమైన జనాభా గణనను క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి సర్వే చేపట్టాలన్నారు.

April 12, 2026 / 07:35 AM IST

లారీలో గ్యాస్ సిలిండర్ పేలి చెలరేగిన మంటలు

ఏలూరు నగరంలోని చోది మెళ్ళ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి తౌడు లోడుతో వెళ్తున్న లారీలో వంటకు వినియోగించే గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. క్షణాల్లో చూస్తుండగానే లారీ తగలబడిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

April 12, 2026 / 07:35 AM IST

ఎయిర్‌ పోర్ట్ భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్

SKLM: పలాసలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడం కోసం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తన కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. రైతులకు అవగాహన కల్పించి భూసేకరణ ప్రక్రియను సులభతరం చేయాలని అధికారులు సూచించారు. భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. SP మహేశ్వర రెడ్డి, JC ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఉన్నారు.

April 12, 2026 / 07:31 AM IST

రూ.48 లక్షల మోసం.. నిందితుడు అరెస్ట్

NLR: నెల్లూరులో టీటీడీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 48 లక్షలు వసూలు చేసిన కేటుగాడు షేక్ హుస్సేను వేదాయపాలెం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.25.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ దీక్ష వెల్లడించారు. నకిలీ నియామక పత్రాలతో నిరుద్యోగులను నమ్మించి ఈ మోసానికి పాల్పడినట్లు, దళారులను నమ్మి మోసపోవద్దని ఏఎస్పీ తెలిపారు.

April 12, 2026 / 07:25 AM IST

జిల్లా న్యాయమూర్తులుగా ఇద్దరు జడ్జీలకు పదోన్నతి

SS: జిల్లాలోని హిందూపురం, కదిరి సీనియర్ సివిల్ జడ్జీలకు జిల్లా న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. హిందూపురం జడ్జి వెంకటేశ్వర్లు నాయక్, కదిరి జడ్జి జయలక్ష్మి జిల్లా న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15 మంది సీనియర్ సివిల్ జడ్జీలకు ఈ పదోన్నతులు కల్పించారు.

April 12, 2026 / 07:21 AM IST

నీటి సంరక్షణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలన

E.G: భీమోలు గ్రామంలోని పెద్ద చెరువును, గంగోలు చెరువును జలదార విజిటింగ్ బృందం పరిశీలించింది. జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణ, వర్షం నీటి సంరక్షణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వీటితో వ్యవసాయానికి నీటి లభ్యత పెరగడంతో పాటు భూగర్భ జలాల స్థాయిలు మెరుగుపడతాయని చెప్పారు. అదేవిధంగా డ్యాంలు,చెరువు గట్టు పటిష్టానికి ప్రతిపాదనలు పంపాలన్నారు.

April 12, 2026 / 07:20 AM IST

ధర్మవరంలో ఆర్‌ఎంపీ డాక్టర్ హత్య

బాపట్ల: అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో అర్ధరాత్రి జరిగిన దాడిలో ఆర్‌ఎంపీ డాక్టర్ మేడగం కోటిరెడ్డి మృతి చెందారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న సీఐ సుబ్బరాజు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

April 12, 2026 / 07:17 AM IST