• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు ఉలవపాడులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLR: ఉలవపాడు మండలం భీమవరం 33/11కేవీ సబ్ స్టేషన్‌లో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. బద్దపూడి, రాజుపాలెం, కృష్ణాపురంలో మరమ్మతుల నిమిత్తం పవర్ సప్లయ్ కట్ చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలని కోరారు.

April 10, 2026 / 06:58 AM IST

బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

సత్యసాయి: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గురువారం కనగానపల్లి మండలంలో పర్యటించి పలు మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనారోగ్యంతో మరణించిన కనగానపల్లికి చెందిన తలారి ఓబులపతి నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. అనంతరం కొండ్రెడ్డి బావి గ్రామానికి చేరుకుని మృతి చెందిన మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

April 10, 2026 / 06:56 AM IST

ఫైర్ స్టేషన్ ఏర్పాటు కోసం కలెక్టర్‌కు వినతి

మార్కాపురం జిల్లా పొదిలి కేంద్రంగా అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని లోక్ సత్తా పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందించారు. పొదిలి మండలం మూగచింతల, కంబాలపాడు గ్రామాల్లో ఇటీవల పొగాకు బ్యారెన్లు తగలబడిన విషయాన్ని ప్రస్తావించినట్లు వెల్లడించారు.

April 10, 2026 / 06:54 AM IST

రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గోవిందా నాయక్

ATP: వైసీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుంతకల్లుకు చెందిన ఎన్.గోవింద్ నాయక్, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పామిడికి చెందిన నీలమ్ గోపాల్‌రెడ్డిలు నియమితులయ్యారు. వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇరువురినీ ఆయా హోదాల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

April 10, 2026 / 06:53 AM IST

ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

ELR: ఇంటర్ చదువుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఏలూరులో గురువారం రాత్రి జరిగింది. వెంకటాపురం పంచాయతీ సాయి నగర్‌లో ఇంటర్ చదువుతున్న విద్యార్థి శివ దుర్గాప్రసాద్(16) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకులు స్పందించి శివను ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 10, 2026 / 06:50 AM IST

రాజంపేటలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

అన్నమయ్య: రాజంపేట పట్టణం నూనెవారిపల్లి మార్గంలోని ఆకేపాటి భవనం వద్ద గుర్తుతెలియని యాచకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యాచకుడికి సుమారు 60 సంవత్సరాలు ఉంటాయని, అతని వద్ద ఆధారాలు ఏమీ లేవని పేర్కొన్నారు. యాచకుడి వివరాలి తెలిస్తే రాజంపేట పీఎస్‌ని సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 10, 2026 / 06:43 AM IST

అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి షాపు కూల్చివేత

W.G: ఆచంట మండలం కొడమంచిలిలో 6 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వెంకటస్వామికి సంబంధించిన షాపును పోలీసులు గురువారం జేసీబీతో కూల్చివేశారు. సోమవారం షాపు వద్దకు వెళ్లిన బాలికకు షాపు యజమాని వెంకటస్వామి మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆచంట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

April 10, 2026 / 06:41 AM IST

‘వైసీపీలో యువతకు కీలక బాధ్యతలు’

AKP: వైసీపీ 2.0లో యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన సిద్ధార్థ రెడ్డితో పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ యూత్ వింగ్ అధ్యక్షుడు పి నరేష్ గురువారం భేటీ అయ్యారు. రానున్న రోజుల్లో పార్టీలో యువతకు కీలక బాధ్యతలు అప్పగిస్తామన్నారు.

April 10, 2026 / 06:40 AM IST

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే

KRNL: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవారిని గురువారం ఎమ్మెల్యే పీవీ పార్థసారథి దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు శేష వస్త్రం, ప్రసాదాలతో ఎమ్మెల్యేను సత్కరించారు. స్వామి కృపతో నియోజకవర్గ ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్ధించారు.

April 10, 2026 / 06:22 AM IST

కొండపి సర్కిల్ కార్యాలయంలో కేసుల పురోగతిపై సమీక్ష

ప్రకాశం: కొండపి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం కేసుల పురోగతిపై సీఐ సోమశేఖర్ సమీక్ష నిర్వహించారు. సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, సిబ్బందితో సమావేశం జరిగింది. వివిధ కేసుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. ప్రత్యేకంగా కేసు డైరీ ఫైల్స్‌ను ఆయన పరిశీలిస్తూ దర్యాప్తు విధానం, సాక్షాలు సేకరణ, కేసులు త్వరగా పరిష్కారం అంశాలపై సూచనలు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

April 10, 2026 / 06:22 AM IST

‘సీఎం చంద్రబాబుకు సినిమా చూపే సీన్ జగన్‌కు లేదు’

KRNL: సీఎం చంద్రబాబుకు సినిమా చూపే సీన్ జగన్‌కు లేదని గురువారం మంత్రి సవిత అన్నారు. ‘పాదయాత్ర కాకపోతే పొర్లుదండాలు పెట్టుకో. అమరావతి విషయంలో మూడు ముక్కలాట ఆడారు. అమరావతి మహిళలను ఇబ్బంది పెట్టారు. ఫిర్యాదులు చేయడం, పెట్టుబడులను అడ్డుకోవడం కొత్తేమీ కాదు’ అని ఈ మేరకు మంత్రి వ్యాఖ్యానించారు.

April 10, 2026 / 06:17 AM IST

మైనర్ డ్రైవింగ్‌పై 98 కేసులు నమోదు

ATP: జిల్లాలో మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా మొత్తం 98 కేసులు నమోదు చేసి, 97 వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. వాహనాలు నడిపిన మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

April 10, 2026 / 06:16 AM IST

నేడు అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఉచిత మెడికల్ చెకప్

W.G: జిల్లాలోని అక్రిడేటెడ్ జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ఉచిత మెడికల్ హెల్త్ చెకప్ నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ళ, ఆకివీడు, పాలకోడేరు జర్నలిస్టులకు శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో భీమవరం లయన్స్ క్లబ్, ఫెమినా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతాయన్నారు.

April 10, 2026 / 06:15 AM IST

పుట్టపర్తికి నేడు చైర్మన్ లంక దినకర్ రాక

సత్యసాయి: 20 సూత్రాల చైర్మన్ లంక దినకర్ శుక్రవారం మధ్యాహ్నం పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించి పథకాల అమలు, అభివృద్ధిపై చర్చించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

April 10, 2026 / 06:15 AM IST

నేడు సామర్లకోటలో మంచినీటి సరఫరా నిలిపివేత

KKD: సామర్లకోట పట్టణంలో ఏప్రిల్ 10న తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య ఓ ప్రకటనలో తెలిపారు. హెడ్ వాటర్ వర్క్స్ వద్ద పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఒకరోజు ముందే నీటిని నిల్వ చేసుకోవాలని, ప్రస్తుత పరిస్థితిని గమనించి సహకరించాలని కోరారు.

April 10, 2026 / 06:14 AM IST