• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ను కలిసిన రంగయ్య, విశ్వేశ్వరరెడ్డి

ATP: ​ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్‌ను మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి కలిశారు. అనంతపురంలోని ఆర్డీటీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. గతంలో నిలిచిపోయిన FCRA లైసెన్స్ పునరుద్ధరణ కోసం వారు చేసిన కృషిని మాంచో ఫెర్రర్ గుర్తుచేసుకున్నారు. జిల్లాలో సంస్థ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలపై చర్చించారు.

April 13, 2026 / 04:00 PM IST

ఖాద్రీశుని అంతరాలయ దర్శనం పునఃప్రారంభం

సత్యసాయి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కదిరి లక్ష్మీనరసింహ స్వామి వారి అంతరాలయ దర్శనం ఈ నెల 15 నుంచి పునఃప్రారంభం కానుంది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 6:45 గంటల వరకు భక్తులకు ప్రహ్లాద సమేత అంతరాలయ దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ సౌకర్యం అందుబాటులోకి రావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

April 13, 2026 / 04:00 PM IST

‘తిరుపతిలో కార్మిక సత్తా చూపిద్దాం’

E.G: ఈ నెల 26, 27, 28 తేదీలలో తిరుపతిలో జరిగే AITUC రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని, 26న జరిగే కార్మిక ప్రదర్శనకు పెద్ద ఎత్తున కార్మికులు తరలిరావాలని CPI రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. సోమవారం రాజమండ్రిలో మేస్త్రీల సమావేశం యూనియన్ అధ్యక్షుడు కె. రాంబాబు అధ్యక్షతన జరిగింది. మే డే వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు.

April 13, 2026 / 04:00 PM IST

‘ప్రభుత్వ లైబ్రరీని అందుబాటులోకి తీసుకురాండి’

NLR: కొండాపురం మండల కేంద్రంలో ఉన్న లైబ్రరీ రెండేళ్ల నుంచి మూసివేశారు. దీని వలన విశ్రాంత ఉద్యోగులకు, పోటీ పరీక్షలకు చదువుకునే విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతుందని సోమవారం బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేస్తూ.. గతంలో ఎంతో ఉపయోగంగా ఉండే లైబ్రరీని మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.

April 13, 2026 / 03:45 PM IST

దుద్దుకూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరు ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రెసిడెంట్ కరుటూరి శ్రీరామమూర్తి, పంచాయతీ ప్రత్యేక అధికారితో కలిసి సోమవారం ప్రారంభించారు. రైతులు తమ పంటను సరైన ధరకు విక్రయించేలా ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం పారదర్శకంగా కొనుగోలు జరుగుతాయని హామీ ఇచ్చారు.

April 13, 2026 / 03:45 PM IST

సీసీ రోడ్డు, డ్రైన్స్ పనులకు శ్రీకారం

గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని రాజీవ్ గాంధీ నగర్ 7వ లైన్‌లో సీసీ రోడ్డు, డ్రైన్స్ నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

April 13, 2026 / 03:44 PM IST

వినుకొండలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు

PLD: వినుకొండలో ఈ నెల 15 నుంచి 18 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శివరామ ప్రసాద్ తెలిపారు. మున్సిపల్ ఆఫీసులోని 1వ సచివాలయం, ఓబయ్య కాలనీలోని సచివాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఆధార్ కార్డు నమోదు, మార్పులు చేయించుకోవాల్సిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

April 13, 2026 / 03:44 PM IST

ఐదేళ్ల వైసీపీ పాలనలో మావిగన్ గుర్తు రాలేదా: భూపేశ్ రెడ్డి

KDP: మాజీ సీఎం వైఎస్ జగన్ మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు జగన్‌కు మావిగన్ గుర్తుకు రాలేదా, అమరావతి చట్టబద్దత ఓర్వలేకే మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

April 13, 2026 / 03:44 PM IST

అంగన్వాడీ టీచర్‌కు తోటి అంగన్వాడీలు భరోసా

NTR: అంగన్వాడీ టీచర్ కుటుంబానికి తోటి అంగన్వాడీ టీచర్లు భరోసా కల్పించారు. తిరువూరు పట్టణానికి చెందిన అంగన్వాడీ టీచర్ కృపావరం ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విస్సన్నపేట, ఏ. కొండూరు, తిరువూరు మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు కొంత నగదును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

April 13, 2026 / 03:43 PM IST

చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన మదర్ థెరిసా సేవా సంఘం

VZM: వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం, అయ్యన్నపేట జంక్షన్లో ఉన్న బస్టాప్‌లో మదర్ థెరిసా సేవా సంఘం అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో ఇవాళ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాదచారులకు 200 ఉచిత మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు త్యాడ వేణుగోపాలం, గండ్రేటి రామారావు, తదితరులు పాల్గొన్నారు.

April 13, 2026 / 03:34 PM IST

‘నాణ్యమైన రోడ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం’

కడప 15వ డివిజన్ పరిధిలోని పుట్లంపల్లి చెరువు కట్ట వద్ద రూ. 1.35 కోట్లతో 2.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవి సోమవారం భూమిపూజ నిర్వహించారు. నాణ్యమైన రోడ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వారు తెలిపారు.

April 13, 2026 / 03:32 PM IST

ఆళ్లగడ్డలో PGRS కార్యక్రమం నిర్వహణ

NDL: ఆళ్లగడ్డ మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి పాల్గొని భూ సమస్యలు, ఆన్‌లైన్ సంబంధిత ఫిర్యాదులను స్వీకరించారు. పలువురు ప్రజలు తమ వినతిపత్రాలను సమర్పించారు. అనంతరం కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు పాల్గొన్నారు.

April 13, 2026 / 03:31 PM IST

‘మహనీయుల విగ్రహాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి’

KRNL: ఎమ్మిగనూరులో అంబేద్కర్ విగ్రహానికి పెయింటింగ్, లైటింగ్ ఏర్పాటు చేయాలని దళిత సంఘాల నేతలు కోరారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గంగిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. విగ్రహం పరిసరాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని ఈరన్న, చిన్ని ప్రసాద్, వీరేష్ డిమాండ్ చేశారు. మహనీయుల విగ్రహాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు.

April 13, 2026 / 03:31 PM IST

రోడ్లను తక్షణమే నిర్మించాలి: సీపీఎం

AKP: ధ్వంసమైన రోడ్లను వెంటనే నిర్మించాలని సీపీఎం ఆధ్వర్యంలో ఇవాళ పరవాడ ఎంపీడీవో కార్యాలయం జంక్షన్ వద్ద ఆందోళన నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జీ.కోటేశ్వరరావు మాట్లాడుతూ.. హిందూజా, NTPC బొగ్గు లారీల అధిక లోడ్ల వల్ల వల్ల కాలుష్యం పెరిగి రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని అన్నారు.

April 13, 2026 / 03:30 PM IST

వికలాంగులకు మూడు చక్రాల సైకిల్ పంపిణీ

PPM: పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో వినతులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి వద్దకు వచ్చిన నలుగురు దివ్యాంగులు తమ గోడు వెళ్ళబోసుకుంటూ తమకు మూడు చక్రాల సైకిళ్లను ఇప్పించాలని విన్నవించారు. వారి పరిస్థితికి చలించిన కలెక్టర్ దివ్యాంగుల సంక్షేమ శాఖ సిబ్బంది రమణను పిలిచి వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్లను ఇవ్వాలని ఆదేశించారు.

April 13, 2026 / 03:30 PM IST