• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కళలకి పుట్టినిల్లు పాలకొల్లు: హీరో

W.G: కళలకు పుట్టినిల్లు పాలకొల్లు అని సినీ హీరో శ్రీకాంత్ అన్నారు. శనివారం రాత్రి పాలకొల్లులో ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవంలో అయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నటుడికి శిక్షణ ఎంతో అవసరమన్నారు. పాలకొల్లులో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పి యువతను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.

April 12, 2026 / 10:26 AM IST

వేగంగా తుంగభద్ర జలాశయం మరమ్మతులు

ATP: జిల్లాకు సాగు, తాగునీరు అందించే తుంగభద్ర జలాశయం మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయి. హోస్పేటలో చివరి క్రెస్ట్ గేటు తయారీ పనులు తుది దశకు చేరుకున్నాయి. 33 గేట్లలో ఇప్పటికే 26 అమర్చగా, మిగిలిన 7 గేట్లను ఈ నెలాఖరులోపు పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో వచ్చే సీజన్ నాటికి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటి నిల్వకు సిద్ధం కానుందన్నారు.

April 12, 2026 / 10:25 AM IST

ఐపీఎల్ బెట్టింగ్‌కు యువత దూరంగా ఉండాలి: ఎస్ఎఫ్ఐ

PPM: గుమ్మలక్ష్మీపురంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి బి. అనిల్ మాట్లాడుతూ 2026 ఐపీఎల్ సీజన్ ప్రారంభంతో యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని తెలిపారు. క్రికెట్‌ను ఆస్వాదించడమే కాకుండా కొంతమంది బెట్టింగ్‌లకు పాల్పడి డబ్బులు కోల్పోతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

April 12, 2026 / 10:23 AM IST

రైలు ఎక్కుతూ జారిపడి.. నుజ్జు నుజ్జు అయిన కాలు..!

గుంటూరు: తెనాలి చినరావూరు రైల్వే స్టేషన్లో రైలు ఎక్కుతూ జారిపడి చుండూరు మండలం వామనగుంటపాలెంకు చెందిన వెలగా శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో డెల్టా ఎక్స్‌ప్రెస్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారీ పడడంతో ఆయన కాలు నుజ్జునుజ్జు అయింది. అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు గమనించి శ్రీనివాసరావును తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు.

April 12, 2026 / 10:07 AM IST

సంతమాగులూరులో ‘చదవటం మాకు ఇష్టం’

బాపట్ల: సంతమాగులూరులో మండల కేంద్రంలోని స్థానిక శాఖ గ్రంథాలయంలో ఆదివారం ‘చదవటం మాకు ఇష్టం’ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథపాలకుడు బాదం విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడం, వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

April 12, 2026 / 10:02 AM IST

ఈనెల 20 వరకు దరఖాస్తుల గడువు పెంపు

CTR: జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలో ఆరవ తరగతి, ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈనెల 20 కి పొడిగించినట్టు సమగ్ర శిక్ష ఏసీపీ వెంకటరమణ తెలిపారు. జిల్లాలోని ఏడు కేజీబీవీ పాఠశాలల్లో10 తేదీ వరకు ఆరవ తరగతికి 693, ఇంటర్ ఫస్టియర్‌కు 670 దరఖాస్తులు అందినట్టు ఆయన వెల్లడించారు. గడువు పెంపు అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 12, 2026 / 10:02 AM IST

‘అంబేద్కర్ జయంతికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి’

కోనసీమ: పీ.గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని బురుగుంట గ్రామంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు శనివారం రాత్రి పోలీసులు సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 14న జరగబోయే అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే లక్ష్యంగా SC నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులతో చర్చించి తగు సూచనలు అందించారు.

April 12, 2026 / 10:01 AM IST

సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం: ఎమ్మెల్యే

ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె అర్జీలను స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆమె స్పష్టం చేశారు.

April 12, 2026 / 09:45 AM IST

బండి మహంకాళి విగ్రహ ప్రతిష్ట‌లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్

VZM : గంట్యాడ మండలంలోని బోనంగి గ్రామంలో నూతనంగా నిర్మించిన బండి మహంకాళి అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. మంత్రి శ్రీనివాస్ హోమంలో పాల్గొనడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

April 12, 2026 / 09:44 AM IST

ఈనెల 17న నెల్లూరు RTC బస్టాండ్లో వేలం

NLR: ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా చాలామంది పార్శిళ్లు పంపిస్తుంటారు. ఇందులో చాలా వస్తువులను కొందరు ఇప్పటికీ తీసుకోలేదు. వీటికి బహిరంగ వేలం వేస్తామని నెల్లూరు లాజిస్టిక్స్ మేనేజర్ కామాక్షి తెలిపారు. ఈనెల 17న ఉదయం 10 గంటలకు నెల్లూరు బస్టాండ్ ప్రాంగణంలో వేలం జరుగుతుందన్నారు. ఆధార్, పాన్ కార్డు తీసుకురావాలని సూచించారు.

April 12, 2026 / 09:43 AM IST

పోలేరమ్మను ప్రార్థించిన మంత్రి దుర్గేష్

E.G: నిడదవోలు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా అభివృద్ధి చేయాలని తల్లి పోలేరమ్మను ప్రార్థించినట్లు మంత్రి కందుల దుర్గేష్ శనివారం తెలిపారు. పెరవలి మండలం ముక్కామల గ్రామంలో జరిగిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల సంక్షేమం కోసం ఆకాంక్షించారు.

April 12, 2026 / 09:35 AM IST

కొండవాగుల నీటితో గిరిజనుల వేసవి వరి సాగు

PPM: గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు తమ సంప్రదాయ పద్ధతుల్లో వేసవి వరి పంటను పండిస్తూ ఆకట్టుకుంటున్నారు. కొండవాగుల నుంచి వచ్చే సహజ జలాలను వినియోగిస్తూ నీటి కొరత మధ్య కూడా పంటలను సాగు చేస్తున్నారు. కష్టపడే తత్వం, ప్రకృతితో అనుసంధానం గల జీవన విధానం గిరిజనుల ప్రత్యేకతగా నిలుస్తోంది. వారి కృషితో పచ్చని పంట పొలాలు కళకళలాడుతున్నాయి.

April 12, 2026 / 09:33 AM IST

నేడు కుడమలూరులో అంకాలమ్మ తిరునాలు

KDP: ఒంటిమిట్ట మండలంలోని కుడమలూరులో ఇవాళ అంకాలమ్మ తిరునాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్తు దీప కాంతులతో అలంకరించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ వివరించింది. గ్రామానికి బంధువులు, మిత్రులు తరలిరావడంతో పండగ వాతావరణం నెలకొంది.

April 12, 2026 / 09:30 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో జిల్లాలో 442 మందికి శిక్షలు

మార్చి ఒకటో తేదీ నుంచి 31 వరకు పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో 442 మంది మద్యం తాగి వాహనం నడిపినట్లు గుర్తించినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం తెలిపింది. వారిని ఆయా న్యాయస్థానాల ముందు హాజరపరచగా 312 మందికి జరిమానాలు, 130 కేసుల్లో జైలు శిక్షలు విధించారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

April 12, 2026 / 09:30 AM IST

రూ. 20 లక్షల మోసం.. కేసు నమోదు

AKP: రాజకోడూరుకు చెందిన వ్యక్తి వద్ద రూ.20 లక్షలు మోసం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశ్‌నగర్‌కు చెందిన కర్రి వెంకటరమణ వద్ద బైలపూడి సన్యాసిరావు, వెంకటరమణ, గణేష్ డబ్బు తీసుకుని వడ్డీతో చెల్లిస్తామని చెప్పి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

April 12, 2026 / 09:28 AM IST