• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చెరువుల పునరుద్ధరణకు ప్రణాళిక సిద్ధం చేయాలి

AKP: జిల్లాలో చెరువులు పునరుద్ధరణపై అధికారులు 10 రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో జలధార-నీటి భద్రతపై సమీక్షించారు. జలవనరుల పరిరక్షణ, సాగునీటి వ్యవస్థను బలోపేతానికి చర్యలు చేపట్టాలన్నారు. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలన్నారు.కొత్తగా డీసిల్టింగ్ చేయాల్సిన చెరువులను గుర్తించాలన్నారు.

April 22, 2026 / 06:25 AM IST

తిరుపతి కోర్టుకు ప్రకాశ్ రాజ్ రావాల్సిందేనా..?

TPT: హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడారని TTD బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఇటీవల డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో డీజీపీ ఆఫీసు నుంచి తిరుపతి ఎస్పీకి ఆ ఫిర్యాదు అందింది. త్వరలోనే ఎస్పీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రకాశ్ రాజ్ తిరుపతి కోర్టుకు వచ్చే వరకు పరువునష్టం కేసు కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

April 22, 2026 / 06:22 AM IST

నేడు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు

KRNL: నంద్యాల, మన్యం, అల్లూరి, పోలవరం, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాతో పాటు కర్నూలులో కూడా ఇవాళ అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

April 22, 2026 / 06:12 AM IST

ఒంగోలు ప్రజలకు గుడ్‌న్యూస్

ప్రకాశం: ఒంగోలు సమీపంలోని చదలవాడలో సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో 148 గదుల ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 300 మందికి ఉపాధి లభిస్తుందని హోటల్ ప్రతినిధి రవిశంకర్ జాయింట్ కలెక్టర్‌కు వివరించారు. ఈ మేరకు ప్రభుత్వ రాయితీలు అందేలా చూడాలని ఆయన జేసీని కోరారు.

April 22, 2026 / 06:10 AM IST

నేడు ఈ గ్రామాలలో విద్యుత్‌కి అంతరాయం

కోనసీమ: నగరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం పవర్ కట్ అమల్లో ఉంటుందని అమలాపురం ఈఈ రాంబాబు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు కోనసీమ జిల్లా కేంద్రంలో పాటు మామిడికుదురు, పాసర్లపూడి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక, అప్పన్నపల్లి, పెదపట్నం, మొగలికుదురు గ్రామాలతో పాటు రాజోలు మండలం తాటిపాక గ్రామానికి కరెంటు సరఫరా నిలిపివేస్తామన్నారు.

April 22, 2026 / 06:08 AM IST

మహారాష్ట్రలో పర్యటిస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి

ATP: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మహారాష్ట్రలో రెండో రోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన సుప్రసిద్ధ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లోరా సమీపంలోని ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగంతో పాటు నాసిక్ దగ్గర ఉన్న త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగ స్వామిని దర్శించుకున్నారు. పర్యటన ఆద్యంతం ఆధ్యాత్మికంగా సాగింది. 

April 22, 2026 / 06:06 AM IST

భార్యను హింసించిన భర్తకు జైలు శిక్ష

గుంటూరు: భార్యపై దాడి చేసి బెదిరించిన కేసులో భర్తకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. లక్ష్మీనగర్‌కు చెందిన రాణి ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఫిర్యాదు ఉపసంహరించుకోమని ఒత్తిడి చేస్తూ భర్త రాంబాబు దాడి చేసినట్టు నిర్ధారణ కావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది.

April 22, 2026 / 06:06 AM IST

మహిళపై అత్యాచారయత్నం

సత్యసాయి: చెన్నేకొత్తపల్లి మండలంలో బంధువైన మహిళపై ఓ రాజకీయ నాయకుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. కుటుంబ కలహాల పంచాయతీకి వెళ్లిన క్రమంలో ఆ మహిళపై కన్నేసిన నిందితుడు, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి బలత్కారం చేయబోయాడు. బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

April 22, 2026 / 06:05 AM IST

నాటుసారా ఊటపై కార్వేటి నగరం పోలీసుల వేట

CTR: కార్వేటి నగరం మండలంలో నాటు సారా స్థావరాలపై మంగళవారం రాత్రి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎస్ఐ తేజస్విని కొటార్వేడు పరిధిలో 300 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. నాటు సారా తయారీతో పట్టుబడితే సహించబోమన్నారు. వారికి చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. మండలంలో నాటు సారా నిర్వీర్యం చేయడమే లక్ష్యం అన్నారు.

April 22, 2026 / 06:05 AM IST

కొండూరులో సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష

పల్నాడు: అచ్చంపేట మండలం కొండూరు గ్రామంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ‘ప్రజల వద్దకు ప్రవీణ్’ పర్యటనను 67వ రోజు కొనసాగించారు. గ్రామ సమస్యలను స్వయంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఆన్లైన్ రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. కూటమి ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపారు.

April 22, 2026 / 06:01 AM IST

యువత డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు: సీఐ

CTR: గ్రామీణ ప్రాంత ప్రజలు గంజాయి, డ్రగ్స్ జోలికి వెళ్లకూడదని కుప్పం రూరల్ సీఐ మల్లేశ్ యాదవ్ పేర్కొన్నారు. గుడిపల్లి(M) కనుమనుపల్లిలో మంగళవారం రాత్రి రోడ్డు భద్రత నియమాలు, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, ధైర్య స్పర్శ, సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, IPL బెట్టింగ్, ఫొక్సో చట్టం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.

April 22, 2026 / 05:18 AM IST

ఒకేరోజు మూడు చోట్ల అగ్ని ప్రమాదాలు.. భారీగా పంట నష్టం

NTR: కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో పలుచోట్ల అగ్నిప్రమాదాలు జరిగినట్లు ఫైర్ స్టేషన్ ఎస్‌ఎఫ్‌వో శివారెడ్డి తెలిపారు. వీరులపాడు మండలం నరసింహారావుపేటలో సుబాబుల్ తోట దగ్ధమై సుమారు లక్ష రూపాయల పంట నష్టం జరిగినట్లు చెప్పారు. అలాగే గండేపల్లిలో మొక్కజొన్న పంట, వేములపల్లిలో మరో సుబాబుల్ తోట అగ్నికి ఆహుతైనట్లు వివరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

April 21, 2026 / 10:02 PM IST

నైట్ బీట్ పెంచండి.. పోలీసులకు ఎమ్మెల్యే ఆదేశం

E.G: రాజమండ్రి సిటీ 46వ డివిజన్లో మంగళవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. మహిళలు తమ సమస్యలను విన్నవించారు. రాత్రి వేళల్లో అల్లరి మూకల ఆగడాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థులు, మహిళల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు నైట్ బీట్ పెంచాలని ఆదేశించారు.

April 21, 2026 / 10:00 PM IST

ప్లాస్టిక్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత: కమిషనర్

KDP: ప్లాస్టిక్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పులివెందులలోని ఓ ప్రైవేటు పాఠశాలలో స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ సమస్య ప్రధాన సమస్యగా మారిందని ప్రమాదకరంగా మారకముందే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

April 21, 2026 / 09:36 PM IST

తణుకులో మద్యం దుకాణాల్లో తనిఖీలు

W.G: తణుకులోని మద్యం దుకాణాలు, బార్లను ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కేవీ నాగ ప్రభుకుమార్ ఇవాళ తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఏపీ సురక్ష యాప్ ద్వారా మద్యం నిల్వలను పరిశీలించారు. అనంతరం తణుకు ఎక్సైజ్ స్టేషన్ సందర్శించి స్టేషన్లో కేసుల దర్యాప్తులో పురోగతి, అక్రమ మద్యాన్ని నిరోధించడానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.

April 21, 2026 / 09:31 PM IST