• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తిరుపతి రుయాకు వెళ్తున్నారా..?

TPT: తిరుపతి రుయాలో గతంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీలు ఇచ్చేవాళ్లు. తర్వాత ఎమర్జెన్సీ ఓపీలే ఇస్తుండగా తాజాగా టైమింగ్స్ మార్చారు. ఎండలు పెరగడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఇబ్బంది పడకుండా ఉదయం 8గంటల నుంచే ఓపీలు ఇస్తున్నారు. సాయంత్రం 4గంటల వరకు ఓపీలు తీసుకుని సేవలు పొందవచ్చని వైద్యులు సూచించారు.

April 10, 2026 / 09:17 AM IST

నక్కపల్లి మండల వైసీపీ అధ్యక్షుడు నియామకం

AKP: నక్కపల్లి మండలం వైసీపీ అధ్యక్షుడిగా సీతంపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ గొర్ల గోవిందరావు నియమితులయ్యారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండలానికి నూతన కార్యవర్గాన్ని పార్టీ కేంద్ర కమిటీ గురువారం ప్రకటించింది. అలాగే, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా మండలానికి చెందిన జి. నరసింహమూర్తి, రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శిగా జి బాబురావును నియమించారు.

April 10, 2026 / 09:13 AM IST

పది రోజులపాటు ‘ప్రగతి పండుగ’: ఎమ్మెల్యే

ATP: CM చంద్రబాబు నాయుడు జన్మదినం రోజు ఏప్రిల్ 20 నుంచి రాయదుర్గం నియోజకవర్గంలో పది రోజులపాటు ప్రగతి పండుగ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 11 లోపు వెయ్యి మంది పేదలకు ఇంటి పట్టాల పంపిణీ చేస్తామని తెలిపారు.

April 10, 2026 / 08:49 AM IST

‘అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి’

ELR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఛైర్పర్సన్ పద్మశ్రీ అధ్యక్షతన గురువారం జిల్లా పరిషత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు త్వరితగతిన పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని ఆమె సూచించారు. పీఎఫ్ విభాగంలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

April 10, 2026 / 08:47 AM IST

గాజువాకలో ఇద్దరు యువకులు అరెస్టు

VSP: గాజువాకలోని మసీదు వద్ద ఇద్దరు యువకులు అనుమానస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నామని గాజువాక క్రైమ్ ఎస్సై సీహెచ్ హరికృష్ణ గురువారం తెలిపారు. గాజువాక ప్రాంతానికి చెందిన గండి బోయిన ఉదయ్ కిరణ్, తురక దుర్గారావు వద్ద నుంచి తనిఖీ చేసి బంగారం, 45 తులాల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నారు.

April 10, 2026 / 08:46 AM IST

‘ABN రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలి’

కృష్ణా: ఏపీఎన్ రాధాకృష్ణ వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలను పెనమలూరు వైసీపీ ఇంఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి నిన్న తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళల గౌరవం కాపాడడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతని అన్నారు. రాధాకృష్ణ వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకుని, మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

April 10, 2026 / 08:40 AM IST

బంగారం చోరీ కేసులో నిందితుడికి జరిమానా

VZM: 2022లో జామి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బంగారం చోరీ కేసులో నిందితుడికి కోర్టు రూ.10,000 జరిమానా విధించినట్లు ఎస్సై వై.వి. జనార్ధన్ గురువారం తెలిపారు. అన్నంరాజుపేట గ్రామానికి చెందిన మంగమ్మ వద్దకు ఫ్లోర్ క్లీనింగ్ నెపంతో ఇద్దరు వ్యక్తులు వచ్చి, ఆమె మెడలోని బంగారు గొలుసును బలవంతంగా లాకెళ్లారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి తీర్పుని వెల్లడించింది.

April 10, 2026 / 08:39 AM IST

అక్రమంగా ఇసుక తవ్వకాలు.. వాహనాలు సీజు

శ్రీకాకుళం నగర పరిధిలోని నాగావళి నదిలో అనుమతి లేకుండా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ సి. మోహనరావు నేతృత్వంలో గురువారం తనిఖీలు నిర్వహించి, ఇసుక తరలిస్తున్న ఎక్స్కవేటర్, ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. గత ఏడాది డిసెంబర్‌తో అనుమతులు ముగిశాయని స్థానికలు పేర్కొన్నారు.

April 10, 2026 / 08:32 AM IST

ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలి: మంత్రి

కృష్ణా: మచిలీపట్నం 8వ డివిజన్లో మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను అధికారులు వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. రాబోయే కాలంలో మచిలీపట్నం పోర్టు పూర్తై, యువతకు అనేక ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

April 10, 2026 / 08:27 AM IST

చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్: మంత్రి

సత్యసాయి: విజయవాడలో విద్యుత్, జౌళి శాఖాధికారుల సమన్వయ సమావేశంలో మంత్రి సవిత కీలక నిర్ణయాలు వెల్లడించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని ప్రకటించారు. చేనేతలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ మగ్గాలకు 500 యూనిట్ల వరకు రాయితీ కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇందు కోసం రూ.150 కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు.

April 10, 2026 / 08:25 AM IST

బెట్టింగ్‌లకు పాల్పడితే చర్యలు తప్పవు: సీఐ

KRNL: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, జూద కార్యకలాపాలపై దేవనకొండ పోలీసులు కఠిన నిఘా ఏర్పాటు చేశారు. గురువారం సీఐ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఐపీఎల్ బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ రమ్మీ, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.

April 10, 2026 / 08:25 AM IST

సముద్ర కోతను అరికట్టేందుకు చర్యలు: కలెక్టర్

కోనసీమ: అల్లవరం మండలం ఓడలరేవు తీర ప్రాంతంలో సముద్రపు కోతను అరికట్టడానికి గ్రోయింగ్స్ తోటల పెంపకానికి ఓఎన్‌జీసీ సహ కారంతో సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. గురువారం ఓఎన్‌జీసీ, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి భూసేకరణ ప్రత్యామ్నాయ భూమి సేకరణ భూ పరిహారాలు చెల్లింపు అంశాలపై సమీక్షించారు.

April 10, 2026 / 08:24 AM IST

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

KKD: తునిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉరేసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై విజయబాబు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని 1వ వార్డు డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న తాటిపర్తి బాలాజీ(28) అనే యువకుడు గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు సమాచారం. మృతుడు ప్రత్తిపాడు ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. 

April 10, 2026 / 08:22 AM IST

ఉరేసుకుని వ్యక్తి మృతి

KDP: జమ్మలమడుగు దిగువపట్నం కాలనీలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. ఆళ్లగడ్డ సుధాకర్ (45) అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రేకుల ఇంట్లో పైపునకు చీరతో ఉరేసుకుని చనిపోయినట్లు చెప్పారు. కుటుంబ కలహాలే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 10, 2026 / 08:20 AM IST

పదో తరగతి మూల్యాంకన రుసుము పెంచండి: APTF

KDP: పదో తరగతి పరీక్షల మూల్యాంకన రుసుమును 100% పెంచాలని కోరుతూ APTF నాయకులు గురువారం DEO శంషుద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు. మూల్యాంకన విధుల్లో పాల్గొనే స్పెషల్ అసిస్టెంట్లకు TA,DAలు చెల్లించాలని, ట్యాబ్‌లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. APTF జిల్లా అధ్యక్షుడు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ నేతలు DEOను కలిసి తమ సమస్యలను వివరించారు.

April 10, 2026 / 08:18 AM IST