• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అక్కడికక్కడే బాధితుడికి ట్రై సైకిల్‌ అందజేత

సత్యసాయి: పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఓ దివ్యాంగుడికి తక్షణమే ఊరట లభించింది. గోరంట్ల మండలానికి చెందిన హుస్సేన్ పీరా మూడు చక్రాల సైకిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ వెంటనే స్పందించారు. అక్కడికక్కడే బాధితుడికి ట్రై సైకిల్‌ను అందజేశారు.

April 13, 2026 / 06:30 PM IST

తాగునీటి సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందెలతో నిరసన

ATP: కంబదూరు పాత ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ సోమవారం కాలనీవాసులు ఎంపీడీవో కార్యాలయాన్ని కాలి బిందెలతో ముట్టడించారు. కొంతకాలంగా నీటి సరఫరా నిలిచిపోవడంతో దూరప్రాంతాల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

April 13, 2026 / 06:30 PM IST

‘నీటి భద్రతపైనే భవిష్యత్ ఆధారపడి ఉంది’

PLD: నీటి వనరుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. నాదెండ్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ యంత్రాంగం సూచనలను ప్రజలు ఆచరణలో పెడితేనే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.

April 13, 2026 / 06:25 PM IST

మదనపల్లె డీఎస్పీగా పావని బాధ్యతల స్వీకారణ

అన్నమయ్య: పోలీస్ సబ్‌డివిజన్ నూతన డీఎస్పీగా బి. పావని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు ఎస్పీ ధీరజ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్రాఫిక్ నియంత్రణ, నేరాల అణచివేతపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు త్వరిత న్యాయం అందేలా కట్టుబడి పనిచేస్తానని డీఎస్పీ పావని తెలిపారు. మహిళలు, విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

April 13, 2026 / 06:10 PM IST

క్రికెట్ బెట్టింగ్‌లపై పోలీసుల నిఘా.!

NTR: విజయవాడలో IPL సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసులు కఠిన నిఘా ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వీ. రాజశేఖర బాబు ఆదేశాలతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌పై హైటెక్ నిఘా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో బెట్టింగ్ ప్రచారాలపై ట్రాకింగ్ జరుగుతోంది. నిందితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

April 13, 2026 / 06:06 PM IST

స్టోన్ కటింగ్ మిషన్ కాలిపై పడి వ్యక్తికి తీవ్రగాయాలు

KDP: జమ్మలమడుగు(M) లింగాపురంకి చెందిన సుదీప్ ఆంజనేయపురం వద్ద కూలీ పని చేస్తుండగా స్టోన్ కటింగ్ మిషన్ అతని ఎడమ కాలిపై పడింది. దీంతో కాలుకి తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న EMT రామ మునయ్య, పైలెట్ గురు మోహన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స చేస్తూ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 13, 2026 / 06:04 PM IST

విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం

ASR: పాడేరు మండలం కందమామిడి జీటీ డబ్ల్యూ బాలికల పాఠశాలలో ఇవాళ ప్రపంచ మొక్కల అభినందన దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ. వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

April 13, 2026 / 06:00 PM IST

ఆలమూరు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా షరీఫ్

కోనసీమ: ఆలమూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది ఎస్.కె షరీఫ్ ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా చల్లా సతీష్, జాయింట్ సెక్రటరీగా గానుగుల శేషారావు, ఉపాధ్యక్షుడిగా కే. ధనరాజు, కోశాధికారిగా బి. విద్యా ప్రసన్నలు తమ ప్రత్యర్థులపై భారీ మెజార్టీతో విజయం సాధించారు.

April 13, 2026 / 06:00 PM IST

‘సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి’

AKP: తమ సమస్యల పరిష్కారానికి ఈనెల 15న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇంటికి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలిపారు. పరవాడ ఎంఈవో కార్యాలయం వద్ద ఇవాళ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, హెచ్ఐఆర్ పాలసీ అమలు, సమాన పనికి సమాన వేతనం, గ్రాట్యూటీ వంటి డిమాండ్ల సాధనకే ఈ పాదయాత్ర చేపడుతున్నామన్నారు.

April 13, 2026 / 06:00 PM IST

పీజీఆర్‌ఎస్‌కు 70 వినతలు: కలెక్టర్

PPM: పీజీఆర్ఎస్‌కు వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకూడదని, తక్షణ పరిష్కారం చూపాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా రెవిన్యూ అధికారి కె. హేమలతతో కలసి కలెక్టర్ వినతులు స్వీకరించారు. PGRSకు 70 వినతలు వచ్చాయన్నారు.

April 13, 2026 / 06:00 PM IST

‘అంబేద్కర్ జయంతి రోజున మద్యం విక్రయాలను నిషేధించాలి’

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒకరోజు మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని కోరుతూ జన విజ్ఞాన వేదిక విశాఖపట్నం జిల్లా కమిటీ ఇవాళ కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించింది. రేపు జిల్లా వ్యాప్తంగా మద్యం అమ‍్మకాలను నిషేధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్. చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

April 13, 2026 / 06:00 PM IST

కాకినాడలో త్రాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

KKD: కాకినాడ నగరంలో త్రాగునీటి ఎద్దడి నివారణకు సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ తెలిపారు. సోమవారం నగరంలోని గుడారిగుంట ప్రాంతంలోని లక్ష్మీనగర్, ఆర్ఆర్ నగర్ ప్రాంతాల్లో ఆయన అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను నేరుగా కమిషనర్ సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు.

April 13, 2026 / 06:00 PM IST

రేపు ఉరవకొండలో మంత్రి పయ్యావుల పర్యటన

ATP: ఉరవకొండ పట్టణ కేంద్రంలో మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించనున్నారని ఏఎస్ డబ్ల్యూవో రామ్మోహన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అంబేద్కర్ జయంతి వేడుకలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారన్నారు. అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు, కూటమి నాయకులకు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

April 13, 2026 / 06:00 PM IST

రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన కూటమి ఎంపీలు

KRNL: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా సోమవారం భేటీ అయ్యారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర కూటమి ఎంపీలతో కలిసి రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి యొక్క చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను లోకేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ నాగరాజు సహా ఇతర ఎంపీలు పాల్గొన్నారు.

April 13, 2026 / 05:56 PM IST

మీకోసం కార్యక్రమంలో 74 అర్జీలు

ప్రకాశం: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు 74 అర్జీలు వచ్చాయి. ప్రజలతో నేరుగా మాట్లాడిన ఎస్పీ అర్జీలను పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీకోసం కార్యక్రమం జరిగింది.

April 13, 2026 / 05:55 PM IST