• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నరసరావుపేటలో CMRF చెక్కులు పంపిణీ

PLD: నరసరావుపేటలో శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తన కార్యాలయంలో CMRF చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం రూ.12 లక్షల విలువ గల చెక్కులను 25 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు.

April 10, 2026 / 07:51 PM IST

మే లేదా జూన్‌లో సీఎం పర్యటించే అవకాశం: కలెక్టర్

VZM: రీసర్వే పూర్తైన గ్రామాల్లో రికార్డులు సరిదిద్ది తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఇవాళ జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మే లేదా జూన్‌లో సీఎం పాల్గొనే కార్యక్రమంలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసే అవకాశం ఉందన్నారు.

April 10, 2026 / 07:51 PM IST

ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్

PLD: వినుకొండలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తన కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వివరించగా, ఆయన స్వయంగా వినతి పత్రాలను స్వీకరించారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల సమస్యలపై పలువురు ఫిర్యాదులు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తామని అన్నారు.

April 10, 2026 / 07:43 PM IST

పవర్లిఫ్టింగ్‌లో KVIK అకాడమీ ఘన విజయం

GNTR: రాజాం వేదికగా జరిగిన 13వ ఏపీ పవర్లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో KVIK అకాడమీ క్రీడాకారులు మెరిశారు. ఈ పోటీల్లో 4 బంగారు, 3 వెండి, 1 కాంస్య పతకాలను షానూన్, లిఖిత, వినయశ్రీ, కౌశిక్ గోల్డ్ సాధించారు. బౌషిక్ ఆచార్య 73 కేజీల విభాగంలో గోల్డ్‌తో పాటు స్ట్రాంగ్ టైటిల్ అందుకున్నారు.

April 10, 2026 / 07:42 PM IST

మంత్రి లోకేష్‌ను కలిసిన ఉన్నం మారుతి చౌదరి

ATP: జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఉన్నం మారుతి చౌదరి అమరావతిలో మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మారుతి చౌదరి తండ్రి హనుమంతరాయ చౌదరి మరణించిన నేపథ్యంలో, మంత్రి ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు. హనుమంతరాయ చౌదరి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా లోకేశ్ గుర్తు చేసుకున్నారు.

April 10, 2026 / 07:40 PM IST

ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి వేడుకలు

VSP: భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఈ నెల 14న ఎల్‌ఐసీ జంక్షన్ వద్ద ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు అంబేద్కర్ విగ్రహానికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సహా ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు అర్పిస్తారు. అనంతరం జయంతి సభ నిర్వహించనున్నారు.

April 10, 2026 / 07:37 PM IST

మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్

SS: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలో మైనర్లు వాహనాలు నడపకుండా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తున్నారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రజలు నిబంధనలు పాటించి రోడ్డు భద్రతకు సహకరించాలని కోరారు.

April 10, 2026 / 07:31 PM IST

సీతా నగర్‌లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

SKLM: సంతబొమ్మాళి మండలం సీతానగరం గ్రామంలో ఇవాళ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న 58మంది రోగులకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ పరీక్షలు నిర్వహించారు. వెన్ను, మోకాళ్ళు నొప్పులు, డయాబెటిస్, శ్వాస సమస్యలు, చర్మ రోగాలు, ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారిని పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

April 10, 2026 / 07:31 PM IST

విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి

W.G: విద్యుత్‌ షాక్‌ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం తణుకులో చోటు చేసుకుంది. సజ్జాపురానికి చెందిన సింహం భవానిశంకర్‌ (36) టైల్స్‌ అతికించే పని చేస్తుంటాడు. గురువారం సాయంత్రం ఇరగవరం రోడ్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంట్లో పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్‌ షాక్‌ తగిలింది. ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

April 10, 2026 / 07:28 PM IST

ప్రేమోన్మాదిపై కఠిన చర్యలు తప్పవు: మంత్రి

KDP: ఖాజీపేటలో విద్యార్థిని హత్య ఘటనపై జిల్లా ఇంచార్జ్ మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడు శ్రీనివాస్ చేసిన ఘాతుకాన్ని ఖండిస్తూ.. అతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మహిళలు, బాలికలపై ఉన్మాదంగా ప్రవర్తిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

April 10, 2026 / 07:28 PM IST

‘గర్భిణీలకు వైద్య పరీక్షలు తప్పనిసరి’

NLR: అల్లూరు మండలం గోగులపల్లి, చింత చెట్ల కాలనీలో ఇవాళ పౌష్టికాహార ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్‌వైజర్ పద్మావతి మాట్లాడుతూ.. గర్భిణీలు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. శిశువుకు టీకాలు, బరువు , శిశువు ఎదుగుదల పర్యవేక్షణ అన్ని చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

April 10, 2026 / 07:25 PM IST

తెనాలిలో ఎమ్మెల్సీ ప్రజా దర్బార్

GNTR: తెనాలి TDP కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో ఆలపాటికి అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన అన్నారు.

April 10, 2026 / 07:25 PM IST

అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం

BPT: కర్లపాలెం మండలం పేరలి గ్రామం ఐదవ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా జంక్ ఫుడ్ ప్రమాదాలు గురించి ఐసీటీఎస్ ప్రాజెక్ట్ అధికారిని సీడీపీవో ఎన్. లక్ష్మి పార్వతి మాట్లాడారు. రెండు సంవత్సరాల లోపు పిల్లల తినకూడనివి తినవలసినవి తల్లులకు ప్రదర్శించి చూపించారు.

April 10, 2026 / 07:25 PM IST

ఈనెల 12న జిల్లాకు రానున్న మంత్రి

ఈనెల 12న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామ్ నారాయణ రెడ్డి కోనసీమ జిల్లాలో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటలకు వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో శ్రీనివాస భవనానికి శంకుస్థాపన చేస్తారన్నారు. మందపల్లి దేవాలయాన్ని సందర్శిస్తారని, అక్కడ తిలబక్షక మండపానికి భూమి పూజ చేస్తారన్నారు. అనంతరం కుండలేశ్వరం, మురముళ్ల కార్యక్రమాల్లోనూ పాల్గొంటారన్నారు.

April 10, 2026 / 07:21 PM IST

స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే

ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయావరణలో శుక్రవారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తామన్నారు.

April 10, 2026 / 07:20 PM IST