KRNL: ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ AO వసుంధర ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. డివిజన్ పరిధిలోని వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రధానంగా భూ సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఆదోని ప్రాంతంలో వేధిస్తున్న తీవ్రమైన తాగునీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
E.G: అనపర్తి మండలం రామవరంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జెండాను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో నాయకులకు, కార్యకర్తలకు స్వీట్స్ పంచి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంత్యోదయ స్ఫూర్తితో సుపరిపాలన లక్ష్యంగా సేవయే పరమావధి – దేశమే ప్రథమం అంటూ కొనసాగుతున్నారు.
ATP: యాడికి మార్కెట్ యార్డులో నిర్వహించిన సభలో స్థానిక MLA జేసీ అస్మిత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగునీరు అందించాలని సీఎంకు విన్నవించారు. అలాగే యాడికి ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం నూతనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేయాలని కోరారు. స్థానిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
E.G: రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 7వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ సోమవారం తెలిపారు. పలు కంపెనీలోని ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. టెన్త్, ITI, డిప్లొమా, డిగ్రీ, MBA పూర్తిచేసిన 19 – 35 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KRNL: జేఎన్టీయూలో నిర్వహించనున్న స్నాతకోత్సవంలో పాల్గొనడానికి ఇవాళ పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను మంత్రులు టీజీ భరత్, సవిత మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు.
VZM: ఎమ్మెల్యే బేబినాయన సోమవారం స్దానిక సీతారామ సాగరం ఎంబనవలస వద్ద నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత అనే 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా మట్టి తట్ట మోసి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మాట్లాడుతూ… రాబోయే 100 రోజుల్లో చెరువుల పూడికతీత, కట్టల బలోపేతంపై దృష్టి సారిస్తామన్నారు.
ATP: యాడికి సభలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. అస్మిత్ రెడ్డి వినూత్న ఆలోచనలు కలిగిన ఉత్సాహవంతుడని కొనియాడారు. తాడిపత్రి నియోజకవర్గాన్ని ఆయన ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
NDL: ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలిచే భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 5, 8 లేదా ఆగస్టు 17, 19 తేదీల్లో ఏదో రోజున పోర్టును ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మరో 6 కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణాలు చేపట్టబోతున్నట్లు చెప్పారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. బొంగరాలబీడు, డొంక రోడ్డు తదితర ప్రాంతాల్లో ఇవాళ పర్యటించిన ఆయన, స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
KRNL: ఇవాళ నుంచి జులై 14 వరకు జిల్లాలో ‘నీటి భద్రత– సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఇవాళ కలెక్టర్ ఏ.సిరి ఆదేశించారు. 100 రోజుల కార్యాచరణలో భాగంగా నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టేలా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు.
ప్రకాశం: మార్కాపురం కలెక్టరేట్లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలను పరిశీలించి, నిర్ణీత సమయంలోపు సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ పి.శ్రీనివాసులు, తదితర అధికారులు పాల్గొన్నారు.
ELR: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి ప్రజలకు అండగా నిలవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
విశాఖ ప్రజలకు జీవీఎంసీ పలు సూచనలు చేసింది. స్వచ్ భారత్ మిషన్ ప్రకారం ఇండ్లలో చెత్తను నాలుగు భాగాలుగా విభజించి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు. తడి చెత్తను ఆకుపచ్చ డబ్బాలో, పొడి చెత్తను నీలం రంగు, సానిటరీ వేస్ట్‌ను ఎరుపు రంగు, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలను నలుపు రంగు డబ్బులో వేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు.
అనకాపల్లి: జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నెల 7న భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.రాము తెలిపారు. అచ్యుతాపురంలో సోమవారం భవన నిర్మాణ కార్మికులతో సమావేశయ్యారు. నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడంతో కార్మికులకు పనులు లేకుండా పోయారన్నారు. తక్షణమే పెంచిన నిర్మాణ సామగ్రి ధరలను తగ్గించాలన్నారు.
KDP: మైదుకూరు హైవేపై వ్యతిరేక దిశలో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, వాటి నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రమాదాలకు కారణమవుతున్న రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని మైదుకూరు అర్బన్ సీఐ కె. రమణా రెడ్డి సూచించారు.