• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చిప్పగిరిలో మాతృత్వ ఆరోగ్య శిబిరం

KRNL: చిప్పగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు.డా.అఫ్రోజ్ బేగం ఆధ్వర్యంలో గర్భిణీలకు రక్తపోటు,హీమోగ్లోబిన్ తదితర పరీక్షలు చేసి ఆరోగ్య స్థితిని పరిశీలించారు. గర్భధారణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు,పోషకాహారంపై అవగాహన కల్పించారు.క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

April 9, 2026 / 03:28 PM IST

సచివాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు

KDP: కలసపాడు మండలం ఎగువ తంబళ్లపల్లె సచివాలయం వద్ద పంచాయతీ సెక్రటరీ కవిత ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రం ఏర్పాటు చేశారు.పెరుగుతున్న వేసవికాలం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచినీరు అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకుడు ప్రహ్లాద రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

April 9, 2026 / 03:24 PM IST

ఎన్యూమరేటర్‌లు, సూపర్వైజర్‌లకు శిక్షణ

PLD: నూజెండ్ల మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సెన్సస్-2027లో భాగంగా ఎన్యూమరేటర్‌లు, సూపర్వైజర్‌లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నూజెండ్ల ఎమ్మార్వో రమేశ్, ఏఎస్వో నాగశ్రీనివాసరావు ప్రారంభించారు. ఎన్యూమరేటర్‌లు 26 మంది, సూపర్వైజర్‌లు ఐదుగురు పాల్గొన్నారు.

April 9, 2026 / 03:21 PM IST

సంతమాగులూరులో 8వ ‘పోషణ్ పక్వాడా’ ప్రారంభం

BPT: సంతమాగులూరులో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘పోషణ పక్వాడా’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీడీపీవో డీ. సుధా మాట్లాడుతూ.. గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆమెతో పాటు డాక్టర్ జోష్ణ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

April 9, 2026 / 03:20 PM IST

‘​ఆరు నెలల్లో లబ్బర్తికి మంచినీరు’

ASR: రాజవొమ్మంగి మండలం లబ్బర్తిలో జల్ జీవన్ మిషన్ కింద రూ.69 లక్షలతో నిర్మించనున్న రక్షిత మంచినీటి ట్యాంక్ పనులకు ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి శంకుస్థాపన చేశారు. కేవలం 6 నెలల్లో పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

April 9, 2026 / 03:12 PM IST

ఈనెల 12న ఉచిత వైద్య శిబిరం

GNTR: దుగ్గిరాల (మం) మోరంపూడి గ్రేటనాల్టీస్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఈనెల 12న ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్వాహకులు వంగర హేమచంద్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో చక్కెర వ్యాధి, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

April 9, 2026 / 03:11 PM IST

‘చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలి’

AKP: చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో 8వ పోషణ్ పక్వాడ అవగాహన పక్షోత్సవాల గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. గర్భిణీలు చిరుధాన్యాలు వంటి సంప్రదాయ ఆహారం తీసుకునే విధంగా చూడాలన్నారు. అలాగే, వివిధ థీమ్‌ల ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

April 9, 2026 / 03:11 PM IST

పొగాకు ఉత్పత్తులపై పోలీసుల ఉక్కుపాదం

సత్యసాయి: హిందూపురం పట్టణంలోని విద్యాసంస్థల సమీపంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. చిన్న మార్కెట్, బోయపేట తదితర ప్రాంతాల్లోని షాపుల్లో సోదాలు చేసి నిషేధిత గుట్కా, ఖైనీ, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. యువత ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు.

April 9, 2026 / 03:00 PM IST

ప్రతి ఒక్కరూ ఫెర్రర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి: బల్లా పల్లవి

ATP: ఆర్డీటీ సంస్థ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతిని అనంతపురంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. సమాజ సేవకు అంకితమైన ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

April 9, 2026 / 03:00 PM IST

అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని శవం లభ్యం

KDP: బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని బస్వాపురం టోల్ ప్లాజా సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో స్థానికులు ఓ గుర్తుతెలియని మగ శవాన్ని గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుమారు ఐదు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు శవాన్ని కాల్చి పడవేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

April 9, 2026 / 02:50 PM IST

గోదావరి వింత.. అన్ సీజన్‌లో చిక్కిన ‘పులస’

కోనసీమ జిల్లా పి. గన్నవరం ప్రాంతంలో గోదావరి నదిలో అన్‌సీజన్‌లో పులస చేప జాలరకు చిక్కడం విశేషంగా మారింది. సాధారణంగా వరద కాలంలో మాత్రమే కనిపించే ఈ పులస.. ఏప్రిల్ నెలలో దొరకడం చాలా అరుదైన విషయం కావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. గురువారం మార్కెట్‌కు తీసుకురాగానే పులస ప్రియులు పెద్ద ఎత్తున వేలంలో పాల్గొనగా.. రూ.4,000 ధర పలికింది.

April 9, 2026 / 02:50 PM IST

అనారోగ్యంతో బాధపడుతున్న వాచ్మెన్‌కు ఆర్థిక సాయం

GNTR: అనారోగ్యంతో బాధపడుతున్న వాచ్మెన్‌కు శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి ఆర్థిక సాయాన్ని మంగళవారం అందజేశారు. తెనాలి వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం కాపలాదారుడిగా పనిచేస్తున్న విష్ణుమూర్తి ఇటీవలె హార్ట్ సర్జరీ చేసుకున్నాడు. ఆయన ఆర్థిక స్థితిని గమనించిన సంస్థ అన్ని గ్రామ శాఖల నుంచి సేకరించిన రూ. 23 వేలు కిషోర్ గురూజీ ద్వారా దేవస్థాన అవరణలో అందించారు.

April 9, 2026 / 02:46 PM IST

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పాణ్యం ఎమ్మెల్యే

KRNL: ఓర్వకల్లు మండలం సోమయాజుల పల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

April 9, 2026 / 02:44 PM IST

‘పదోన్నతుల ఆరోపణలు నిరాధారం’

విశాఖలో హెడ్ నర్సుల పదోన్నతులపై వచ్చిన ఆరోపణలను ప్రభుత్వ నర్సుల సంఘం ఖండించింది. గంగా భవానీ, జీవీఎస్ వరలక్ష్మి నేతృత్వంలో 39 మంది విచారణకు హాజరై పూర్తి వివరాలు సమర్పించారు. ఫిర్యాదుదారులు హాజరుకాకపోవడంతో ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. పదోన్నతుల విషయంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగలేదని తెలిపారు.

April 9, 2026 / 02:39 PM IST

‘సర్పంచుల సేవలు అమూల్యం’

SKLM: గ్రామాల అభివృద్ధికి సర్పంచుల చేసిన సేవలు అమూల్యం అని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. కొత్తూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ఆయన సర్పంచులను ఘన సత్కారం చేసి మెమొంటోలు అందజేశారు. గ్రామ స్థాయి అభివృద్ధికి సర్పంచులు కీలక పాత్ర పోషించారని, వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

April 9, 2026 / 02:36 PM IST