• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1.10 కోట్లతో కట్టవాని చెరువు–తాడిచర్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి, పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పాడి రైతులకు ఉచిత మందులు పంపిణీ చేశారు. గ్రామాల అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

April 6, 2026 / 02:29 PM IST

‘నీటి సంరక్షణలో సాగునీటి సంఘాల బాధ్యత కీలకం’

VSP: నీటి భద్రతలో సాగునీటి సంఘాల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. పెందుర్తి మండలం సరిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో కాలువల పూడికతీత, నీటి వృథా నివారణపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు.

April 6, 2026 / 02:14 PM IST

‘నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత’

AKP: నీటి భద్రతకు సాగునీటి సంఘాలు బాధ్యత తీసుకోవాలని పాయకరావుపేట మండల టీడీపీ అధ్యక్షుడు చించెలపు ప్రదీప్ విజ్ఞప్తి చేశారు. సోమవారం శ్రీరాంపురంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలన్నారు. అలాగే, గేట్ల ఆధునీకరణ, పంట కాలువల మరమ్మత్తులు చేపట్టాలన్నారు.

April 6, 2026 / 02:13 PM IST

‘వినతులను పరిశీలించి పరిష్కరిస్తాం’

PPM: ప్రజా దర్బార్ లో వచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సోమవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలు విన్నవించిన పలు వినతులను ఆయన స్వీకరించారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు.

April 6, 2026 / 02:12 PM IST

‘నిర్దేశిత మెనూను అందజేయాలి’

SKLM: నిర్దేశిత మెనూను అందజేయాలని ఐఐఐటీ డైరెక్టర్ ఆచార్య అమరేంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం ఉదయం డైరెక్టర్ ఐఐఐటీ మెస్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఉదయం తయారుచేసిన అల్పాహారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థినీ విద్యార్థులకు అందజేసిన ఆహారంలో రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు.

April 6, 2026 / 02:12 PM IST

9న సర్వసభ్య సమావేశం

VZM: జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఏప్రిల్ 9న (గురువారం) ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరగనుంది. ఈ మేరకు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.వి.సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు సకాలంలో హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

April 6, 2026 / 02:11 PM IST

శ్రీ వీర అభయాంజనేయ స్వామి ప్రతిష్టకు భూమి పూజ

శ్రీకాకుళంలో శ్రీవీర అభయాంజనేయ స్వామి విగ్రహ స్థాపనకు భూమి పూజ సోమవారం ఘనంగా నిర్వహించారు. తోటపాలెం జంక్షన్ సమీపంలోని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయం ఆవరణంలో ఈ కార్యక్రమం జరిగింది. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు లోకనాథం ఆనంద్ రావు భూమి పూజ అనంతరం మాట్లాడుతూ.. దాతల సహకారం అవసరమని పేర్కొన్నారు.

April 6, 2026 / 02:04 PM IST

డ్రగ్స్‌పై “దండి మార్చ్ 2.0” అవగాహన కార్యక్రమం

TPT: జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో “దండి మార్చ్ 2.0” పేరుతో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1.10 లక్షల మంది విద్యార్థులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించగా, సూళ్లూరుపేట పరిధిలోని పాఠశాలలు, కళాశాలల నుంచి 7 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.

April 6, 2026 / 02:02 PM IST

ప్రజల నుంచీ అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

PLD: నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు తమ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు.

April 6, 2026 / 02:00 PM IST

దివాకర్ రెడ్డి “ఎలా ఉన్నావు?” అంటూ సీఎం కుశల ప్రశ్నలు

ATP: యాడికి పర్యటనకు విచ్చేసిన CM చంద్రబాబు నాయుడుకు జేసీ కుటుంబం ఘన స్వాగతం పలికింది. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి కలిసి సీఎంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరిస్తూ “ఎలా ఉన్నావు?” అని కుశలప్రశ్నలు వేశారు.

April 6, 2026 / 02:00 PM IST

అగ్నిప్రమాదంలో 15 ఎకరాల గడ్డివాము దగ్ధం

BPT: కర్లపాలెం మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద గొల్లపాలెం గ్రామానికి చెందిన రైతు నర్రా కృష్ణమూర్తికి చెందిన గడ్డివామి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. ప్రమాదంలో సుమారు 15 ఎకరాల గడ్డివాము కాలి బూడిదైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో అదుపు చేయడం సాధ్యం కాలేదు. దీంతో సదరు రైతుకు భారీ నష్టం వాటిల్లింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 6, 2026 / 02:00 PM IST

VZM: మానవత్వం చూపించిన జిల్లా కలెక్టర్

VZM: కొత్తవలస, ఉత్తరాపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడైన సబ్బవరపు పోతురాజు తన సమస్యను తెలియజేయడానికి కలెక్టరేట్‌కు వచ్చారు. పోర్టికో వద్ద ఆయనను గమనించిన కలెక్టర్ రాం సుందర్ రెడ్డి నేరుగా వెళ్లి దరఖాస్తును స్వీకరించారు. తన సమస్యను వివరించగా, కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. వారికి వీల్ చైర్ ఏర్పాటు చేయించారు.

April 6, 2026 / 01:40 PM IST

మానవత్వం చూపించిన జిల్లా కలెక్టర్

VZM: కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడైన సబ్బవరపు పోతురాజు తన సమస్యను తెలియజేయడానికి కలెక్టరేట్‌కు వచ్చారు. పోర్టికో వద్ద ఆయనను గమనించిన కలెక్టర్ రాం సుందర్ రెడ్డి నేరుగా వెళ్లి ఆయన దరఖాస్తును స్వీకరించారు. తన సమస్యను వివరించగా, కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఆయనకు వీల్ చైర్ ఏర్పాటు చేయించారు.

April 6, 2026 / 01:40 PM IST

భారీ వర్షం.. నీటమునిగిన ప్రభుత్వ పాఠశాల

కోనసీమ: కొత్తపేటలోని కమ్మిరెడ్దిపాలెం ప్రభుత్వ పాఠశాల సోమవారం కురిసిన వర్షానికి నీట మునగడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు వెళ్లాలంటే నీటిలో నడవాల్సిన పరిస్థితి నెలకొంది. సరైన మురుగు నీటి వ్యవస్థ లేకపోవడంతో ప్రతి వర్షానికి పాఠశాల జలమయమవుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

April 6, 2026 / 01:38 PM IST

సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే

ATP: జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఘనంగా స్వాగతం పలికారు. యాడికి మండలంలోని హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం గుంతకల్లు నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని సీఎంను ఎమ్మెల్యే కోరారు. ఈ పర్యటనలో నియోజకవర్గంలోని స్థానిక టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

April 6, 2026 / 01:30 PM IST