• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పాముకాటుకు 11 ఏళ్ల బాలుడి మృతి

CTR: బైరెడ్డిపల్లి మండలం కమ్మనపల్లి గ్రామానికి చెందిన కిరణ్ (11) శాంతిపురం మండలంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన కిరణ్ శుక్రవారం రాత్రి ఆరుబయట నిద్రిస్తుండగా విష సర్పం కాటేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నట్లు స్థానికులు తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ చికిత్స పొందుతూ ఇవాళ బాలుడు మృతి చెందాడు.

May 30, 2026 / 09:28 PM IST

మాదకద్రవ్యాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం

NTR: వీరులపాడు మండలంలోని జగన్నాధపురం, జమ్మవరం గ్రామాల్లో శనివారం సాయంత్రం ఎస్సై అభిమన్యు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.

May 30, 2026 / 09:22 PM IST

‘మురుగునీటి సమస్య పరిష్కరించాలి’

CTR: సదుం ఉస్మాన్ సాహెబ్ సందులో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తున్నట్టు స్థానికులు ఈవో చలపతికి శనివారం ఫిర్యాదు చేశారు. చాలా రోజులుగా సమస్య నెలకొందని.. దీనిపై ఫిర్యాదు చేస్తున్న పట్టించుకోవడంలేదని వాపోయారు. చిన్నారులు రోగాల బారిన పడుతున్నారని చికిత్సకు వేలాది రూపాయల ఖర్చు అవుతున్నాయని వెల్లడించారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

May 30, 2026 / 09:21 PM IST

కర్మయోగి పోర్టల్‌ కోర్సులపై జేసి సమీక్ష

W.G: ఐగాట్ కర్మయోగి పోర్టల్‌లో ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా నైపుణ్యాభివృద్ధి కోర్సులు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఉద్యోగి 48 కోర్సులు పూర్తి చేయాలని, డీడీవోలు దీనిపై రోజువారీ పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

May 30, 2026 / 09:17 PM IST

ప్రొఫెషనల్ టాక్స్ బకాయిలపై నోటీసులు జారీ.!

KDP: ప్రొద్దుటూరులోని విద్య,వైద్య,వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు చెల్లించాల్సిన ప్రొఫెషన్ టాక్స్ బకాయిలపై శనివారం స్థానిక స్టేట్ GST అధికారులు నోటీసులు ఇచ్చారు. CTO జ్ఞానానంద రెడ్డి ఆధ్వర్యంలో DCTO, ACTO, సిబ్బంది యజమానులకు నోటీసులు ఇచ్చారు. ప్రొఫెషనల్ టాక్స్ చెల్లింపుపై వారికి అవగాహన కల్పించారు.

May 30, 2026 / 09:17 PM IST

పెద్ది ఈవెంట్ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ

NTR: జూన్ 1న జరగనున్న ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించనున్న ఇందిరా గాంధీ స్టేడియం పరిసరాలను ఎంపీ కేశినేని చిన్ని,సెంట్రల్ ఏసీపీ దామోదర్ పోలీసు అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. సినీ ప్రముఖులు, వీఐపీలు, అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

May 30, 2026 / 09:10 PM IST

స్ఫూర్తి భవన్‌లో జనరల్ బాడీ సమావేశం

ELR: సీపీఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో జూన్ 9న ఆర్.ఆర్.పేటలోని స్ఫూర్తి భవన్‌లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్రంలోని మతోన్మాద విధానాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడేందుకు పార్టీ శ్రేణులను చైతన్యపరిచే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.

May 30, 2026 / 09:09 PM IST

గుండెలపై చంద్రబాబు బొమ్మతో వీరాభిమాని

KDP: బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంటకు చెందిన బోడికే ఓబుల నాయుడు టీడీపీకి వీరాభిమానిగా గుర్తింపు పొందారు. పార్టీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ.. గుండెలపై సీఎం చంద్రబాబు ఫొటోను పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీతో అనుబంధం కొనసాగిస్తున్న ఆయనకు చంద్రబాబు కుటుంబంపై ప్రత్యేక అభిమానం ఉందని స్థానికులు చెబుతున్నారు.

May 30, 2026 / 09:06 PM IST

వైసీపీ బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ

AKP: ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా కొత్త ఓటర్లను చేర్పించాలని ఎమ్మెల్సీ, రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి సూచించారు. శనివారం నక్కపల్లిలో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణలో పాల్గొన్నారు. పార్టీ సానుభూతి ఓటర్ల పేర్లు తొలగించకుండా చూడాలన్నారు.

May 30, 2026 / 09:03 PM IST

ముగిసిన జాతీయ ట్రెక్కింగ్ క్యాంప్

ASR: అరకులో నిర్వహించిన జాతీయ ట్రెక్కింగ్ క్యాంప్ శనివారంతో ఘనంగా ముగిసింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఎన్ సీసీ క్యాడెట్లు, యువ ట్రెక్కర్లు పట్టుదల, ధైర్య సాహసాలతో కఠినమైన కొండ మార్గాల్లో ప్రయాణించి ఐక్యత, క్రమశిక్షణ చాటి చెప్పారని ఎన్ సీసీ కమాండెంట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో ట్రెక్కర్లను అభినందించి, బహుమతులు అందజేశారు.

May 30, 2026 / 09:02 PM IST

మట్టి కుప్పను తప్పించబోయి ఆటో డ్రైవర్ మృతి!

PLD: కారంపూడి రోడ్డుపై ఉన్న మట్టి కుప్పను తప్పించబోయి ఆటో పల్టీ కొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. చినగార్లపాడుకు చెందిన కె. జానీ బాషా (24) కారంపూడి నుంచి వస్తుండగా బ్రహ్మనాయుడు కాలనీ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆటో కింద పడి తలకు బలమైన గాయాలు కావడంతో జానీ బాషా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

May 30, 2026 / 08:56 PM IST

పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో నాగరాజు అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఓ స్థలానికి సంబంధించిన విషయంలో ఖాళీ చేయాలని అధికారులు ముందుగానే నాగరాజుకు నోటీసులు ఇచ్చారు. నాగరాజు పట్టించుకోకపోవడంతో అధికారులు బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నించగా నాగరాజు ఆత్మహత్య ప్రయత్నించాడు.

May 30, 2026 / 08:50 PM IST

ఈదురు గాలులకు నేలకూలిన సందర్శకుల వసతి గృహం

ATP: అనంతపురం నగరంలో ఉరుముల,మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సందర్శకులు వసతి కేంద్రం ఈదురు గాలులకు కుప్ప కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వసతి కేంద్రం కింద ఉన్న ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

May 30, 2026 / 08:48 PM IST

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

NTR: కంచికచర్ల మండలం బత్తినపాడు గ్రామంలోని నూతన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శనివారం సందర్శించారు. కూటమి నేతలు, భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, నందిగామ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు.

May 30, 2026 / 08:45 PM IST

‘ఓట్లు తొలగించకుండా చూడాలి’

CTR: ప్రతి ఓటు విలువైనదని.. దాని ప్రాధాన్యతను గుర్తించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి సూచించారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ ఆధ్వర్యంలో వైసీపీ బీఎల్ఏలకు సర్ కార్యక్రమంపై అవగాహన సమావేశం శనివారం నిర్వహించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం వైసీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

May 30, 2026 / 08:44 PM IST