• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

హిందూపురంలో వైసీపీ మహిళా నేతల కీలక సమీక్ష

SS: హిందూపురంలోని సరిగమ ఫంక్షన్ హాల్‌లో జిల్లా YCP మహిళా నేతలు, కార్యకర్తలతో జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో MLC వరుదు కల్యాణి, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయమనోహరి, జడ్పీ ఛైర్మన్ గిరిజమ్మ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో మహిళా విభాగం బలోపేతం, పార్టీ విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

April 8, 2026 / 08:52 AM IST

వార్డుల పునర్విభజన గడువు పొడిగింపు

ATP: అనంతపురం నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని పురపాలికలు, నగర పంచాయతీల వార్డుల పునర్విభజన గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ విభాగాలు ప్రస్తుతం జనగణన విధుల్లో నిమగ్నం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధం చేయడానికి ఈ నెల 26 వరకు గడువును అధికారులు పొడిగించారు.

April 8, 2026 / 08:44 AM IST

కంభంలో అధికారులతో సమీక్ష

ప్రకాశం: ‘జలధార-జలహారతి’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కంభంలో ఫీల్డ్ పరిశీలన, సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరభద్రచారి, ఇరిగేషన్ శాఖ DE, AE, డిప్యూటీ MPDO, APOతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పనుల పురోగతిని సమీక్షించి, పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

April 8, 2026 / 08:41 AM IST

నల్లజర్ల PHCలో అగ్ని ప్రమాదం

E.G: నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మెడిసిన్ స్టోర్ రూమ్‌లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో రోగుల వార్డుకు ముప్పు తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.15 లక్షల విలువైన మందులు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు.

April 8, 2026 / 08:38 AM IST

’15 లోపు వనరుల సేవలు అందించాలి’

PPM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్న విద్యాంజలి పథకం ద్వారా పాఠశాలల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యా వనరులు, సేవల వివరాలను ఈ నెల 15న తప్పని సరిగా నమోదు చేయాలని డిఈఓ బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులకు చెప్పారు. సేవల రూపంలో మాత్రమే సహకారం అందించాలన్నారు.

April 8, 2026 / 08:34 AM IST

ఆటో బోల్తా.. పది మందికి గాయాలు

ప్రకాశం: కొనకలమిట్ల మండలం సిద్దవరం సమీపంలో ఇవాళ అడవి పంది అడ్డురాగా కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని 108లో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పెదారకట్లకు చెందిన కూలీలు మిరపకాయల కోతకు కొత్తపల్లి వెళ్లే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆటోలోని వారికి స్వల్ప గాయాలు తప్ప పెద్ద ప్రమాదం లేదని సమాచారం.

April 8, 2026 / 08:29 AM IST

పునరావాస పనుల పంపిణీలో జాప్యం వద్దు

KDP: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్ఆర్ పెండింగ్ పనులపై మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ డా.శ్రీధర్ సమీక్షించారు. JC నిధి మీనా, ఇరిగేషన్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పరిహారం, పునరావాస పంపిణీలో అస్సలు జాప్యం చేయొద్దని అధికారులకు స్పష్టం చేశారు. భూసేకరణకు బడ్జెట్ ప్రణాళికలు సిద్ధం చేయాలని, అవసరమైన పర్యావరణ అనుమతులను తీసుకోవాలన్నారు.

April 8, 2026 / 08:29 AM IST

పొంచి ఉన్న తాగునీటి సమస్య?

NDL: ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలకు తాగునీటి సమస్య తప్పేలా లేదు. మరో వారంలో శ్రీశైలం జలాశయం డెడ్ స్టోరేజీకి పడిపోయే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం నీటిమట్టం 822.60 అడుగులుగా నమోదైంది. ప్రస్తుతం నీటి నిల్వ 42.8047 టీఎంసీలకు చేరింది.

April 8, 2026 / 08:28 AM IST

మంచినీటి పథకాన్ని ప్రారంభించనున్న DY.CM

కోనసీమ: అంతర్వేదిలో రూ.17.33 కోట్ల జేజేఎం నిధులతో నిర్మించిన మంచినీటి పథకాన్ని ఈనెల 9న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించనున్నారని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. సఖినేటిపల్లెలో ఆయన మాట్లాడారు. దీని ద్వారా అంతర్వేది, గొంది సహా నాలుగు గ్రామాలకు రోజుకు 30 లక్షల లీటర్ల శుద్ధ జలం అందుతుందని పేర్కొన్నారు. దీంతో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

April 8, 2026 / 08:18 AM IST

SC కమిషన్ ఛైర్మన్‌కు వినతులు సమర్పించవచ్చు: కలెక్టర్

CTR: రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ కే.ఎస్.జవహర్ ఇవాళ జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఛైర్మన్ చిత్తూరులోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో ఉదయం 10.10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వినతులు స్వీకరిస్తారన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలు తమ సమస్యలపై నేరుగా ఛైర్మన్‌ను కలిసి వినతులు సమర్పించవచ్చని ఆయన సూచించారు.

April 8, 2026 / 08:15 AM IST

గుంతలో పడి చిన్నారి మృతి

TPT: ఏర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీ సమీపంలో ఎండ్ల సుస్మిత (6) నీటి గుంతలో పడి మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. నెల్లూరు జిల్లాలోని సౌత్ అమలూరు, ఏకే నగర్‌కు చెందిన శంకరయ్య, విజయ దంపతులు జీవనోపాధి కోసం చిందేపల్లికి వలస వచ్చి నివసిస్తున్నారు. వారి కూతురు సుస్మిత పాఠశాలకు వెళ్లి వచ్చి తోటి పిల్లలతో ఆడుకుంటుండగా కాలుజారి గుంతలో పడి మృతి చెందింది.

April 8, 2026 / 08:14 AM IST

ఎక్సైజ్ సీఐ హెచ్చరిక

KRNL: నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంగళవారం ఎక్సైజ్ సీఐ చంద్రహాస్ హెచ్చరించారు. బంగారుపేట పరిధిలో దాడులు నిర్వహించినట్లు నాటుసారా నిర్మూలనలో భాగంగా అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి, నిఘా పెంచినట్లు తెలిపారు. ప్రజలకు దాని వల్ల కలిగే హానిపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని, ఎలాంటి సమాచారం ఉన్నా అధికారులకు తెలియజేయాలని కోరారు.

April 8, 2026 / 08:14 AM IST

మద్యం మత్తులో విధులు.. సెక్రటరీ సస్పెండ్

NDL: జిల్లా గోస్పాడు మండలం పసురపాడు గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ రాజకుమారి నిన్నఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ విజయ భాస్కర్ రెడ్డి మద్యం సేవించి విధులకు హాజరైనట్లు గుర్తించి, వెంటనే బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయగ ఆల్కహాల్ స్థాయి అధికంగా నమోదైంది. దీంతో ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

April 8, 2026 / 08:12 AM IST

గేదెలపై కుక్కల దాడి

AKP: దేవరాపల్లి మం. కె.ఎం.పాలెంలో పిచ్చికుక్కల దాడులతో రైతులకు నష్టం జరిగింది. గట్రెడ్డి రాము, రెడ్డి గోవింద, సింగంపల్లి సూరికి చెందిన గేదెలపై కుక్కలు దాడి చేసి రెండు పెయ్యలను చంపాయి. పలువురు రైతుల కోళ్లను కూడా హతమార్చడంతో నష్టం పెరిగింది. కుక్కల స్వైర విహారంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. వెంటనే చర్యలు తీసుకుని కుక్కలను నియంత్రించాలని గ్రామస్థులు కోరారు.

April 8, 2026 / 08:08 AM IST

ప్రతీ చెరువుకు నీళ్లిస్తాము: ఎమ్మెల్యే బీవీ

KRNL: ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నెలో మంగళవారం ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి పర్యటించారు. స్థానిక చెరువును ట్రాక్టర్‌పై వెళ్లి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతీ చెరువుకు నీళ్లిస్తామన్నారు. పశువులకు తాగు నీరు, రైతుల పంటల కోసం ప్రతీ చెరువులో నీరు నిండుగా ఉంచుతామన్నారు.

April 8, 2026 / 08:07 AM IST