• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మామిడి రైతులకు తిరుపతి కలెక్టర్ సూచనలు

TPT: గతేడాది కంటే ఈసారి మామిడి పంట పరిస్థితులు మెరుగ్గా ఉండే అవకాశముందని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, పక్వానికి వచ్చిన కాయలనే కోయాలని సూచించారు. ప్రాసెసింగ్ యూనిట్లతో ఆయన సమీక్ష చేశారు. రైతులకు న్యాయమైన ధరలు అందేలా చూస్తామన్నారు. కొనుగోలు, రవాణా, నిల్వ సదుపాయాలపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

April 29, 2026 / 08:29 AM IST

‘కరెంట్’ కష్టాలకు చెక్.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..!

ELR: వేసవి దృష్ట్యా వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఎస్ఈ సాల్మన్ రాజు తెలిపారు. వినియోగదారులు టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఏలూరు (9440812702, 9440812704), జంగారెడ్డిగూడెం (9491049797), నూజివీడు (9440811746) సంప్రదించాలని కోరారు.

April 29, 2026 / 08:25 AM IST

పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణం

అన్నమయ్య: పెట్రోల్, డీజిల్ కొరతతో గత ఐదు రోజులుగా బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అధికారులను రంగంలోకి దింపడంతో పెట్రోల్ బంక్ యజమానులతో సమావేశమై సరఫరా సమస్యలను పరిష్కరించారు. దీంతో కోడూరు పట్టణంలో పెట్రోల్ డీజిల్ కొరత సాధారణ సిద్ధికి చేరుకుంది.

April 29, 2026 / 08:19 AM IST

చెక్ బౌన్స్ కేసులో ఆదోని కోర్టు కీలక తీర్పు

KRNL: చెక్ బౌన్స్ కేసులో నేరం రుజువవడంతో ఆదోనికి చెందిన బసిరెడ్డికి కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. 2020లో హరినాథబాబు రూ. 6 లక్షలు అప్పుగా ఇవ్వగా, తిరిగి చెల్లించేందుకు ఇచ్చిన చెక్ బ్యాంకులో బౌన్స్ అయింది. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. విచారణ అనంతరం నిందితుడికి నిన్న శిక్ష వేసింది.

April 29, 2026 / 08:14 AM IST

కల్వర్టు నిర్మాణం.. మార్గం మళ్లింపు

W.G: తణుకు పట్టణ పరిధిలోని ఇరగవరం కాలనీకు వెళ్లే రోడ్డు మార్గాన్ని అధికారులు మళ్లించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఇరగవరం రోడ్డు కాలనీకి వెళ్లే మార్గంలో కల్వర్టు నిర్మాణాన్ని అధికారులు చేపట్టారు. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిషేధించారు. ఈ మార్గంలో ప్రయాణించాల్సిన వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

April 29, 2026 / 08:13 AM IST

నేడు సురుటుపల్లిలో ప్రదోష పూజలు

TPT: నాగలాపురం మండలం సురుటుపల్లిలోని శ్రీప్రసన్నకోండేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వరునికి బుధవారం ప్రదోష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ పద్మనాభ రాజు తెలిపారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు జరిగే ఈ పూజలకు భక్తులు పూజా సామాగ్రి విరాళంగా అందించవచ్చన్నారు. అభిషేక పూజలో పాల్గొనే భక్తులు రూ.500 చెల్లించి టికెట్ పొందాలని ఈవో లత కోరారు .

April 29, 2026 / 08:06 AM IST

అక్రమ మద్యం ధ్వంసం

CTR: పాలసముద్రం మండలంలోని 2024-25 సంవత్సరంలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న డీపీఎల్ లిక్కర్, సారాను ఎక్సైజ్ ఏఈఎస్ కృష్ణ కిషోర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ రెడ్డి సమక్షంలో ధ్వంసం చేశారు. స్టేషన్ పరిధిలో 24 కేసుల్లో 331 లీటర్ల సారాయి, ఆరు కేసుల్లో 34.38 లీటర్ల డీపీఎల్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేశామని వారు తెలిపారు.

April 29, 2026 / 08:05 AM IST

చెన్నకేశవ స్వామి తిరుకళ్యాణ మహోత్సవాలు

NDL: అవుకు శ్రీ భూ లక్ష్మి చెన్నకేశవ స్వామి తిరుకళ్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి మే 6 వరకు వేడుకలు జరగనున్నాయి. బుధవారం స్వామివారికి ధ్వజారోహణ నిర్వహించనున్నారు. 30న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనుండగా, అదే రోజు స్వామివారి కళ్యాణం వైభవంగా జరగనుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

April 29, 2026 / 08:03 AM IST

రైలులో వివాహితపై లైంగిక దాడి

PLD: రెంటచింతల మండలానికి చెందిన ఓ వివాహితపై విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీవనోపాధి కోసం విశాఖలో ఉంటున్న బాధితురాలు ఈ నెల 26న నడికుడి వైపు ప్రయాణిస్తుండగా, జనరల్ బోగీలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఆమెను ఏసీ బోగీకి తీసుకెళ్లి దాడికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

April 29, 2026 / 08:03 AM IST

హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

NLR: కందుకూరు (M) కొండముడుసుపాలెం హైవే సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. సింగరాయకొండ వైపు నుంచి కడపకు వెళ్తున్న బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని ఏరియా వైద్యశాలకు తరలించారు.

April 29, 2026 / 08:03 AM IST

అగ్నిప్రమాదంలో దగ్ధమైన షాపును పరిశీలించిన బేబినాయన

VZM: బొబ్బిలిల్లో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైన స్వీట్ షాపును ఎమ్మెల్యే బేబినాయన పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను షాపు యజమాని, అగ్నిమాపక అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో షాపులో మంటలు చెలరేగి షాపు పూర్తిగా దగ్ధం కావడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం నుంచి ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

April 29, 2026 / 08:02 AM IST

రథోత్సవానికి డ్రోన్లతో పటిష్ట నిఘా

SS: ధర్మవరంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవాలయ పరిసరాలు, ప్రధాన కూడళ్లలో డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా షీ టీమ్స్, ట్రాఫిక్, సివిల్ పోలీసులతో ప్రత్యేక బృందాలను నియమించారు.

April 29, 2026 / 08:00 AM IST

‘జిల్లాలో 100 బంకుల్లో అందుబాటులో ఇంధనం’

కోనసీమ: జిల్లాలో ఇంధన పరిస్థితి మెరుగ్గా ఉందని జాయింట్ కలెక్టర్ నిడియా దేవి తెలిపారు. జిల్లాలోని 110 బంకులకు గాను 100 బంకుల్లో విక్రయాలు జరుగుతున్నాయన్నారు. గత ఏప్రిల్లో రోజువారీ వినియోగం 200 లక్షల కిలో లీటర్లు ఉండగా, ప్రస్తుతం అది 350 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు. కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ప్రజలు అధికంగా నిల్వ చేసుకోవడం వల్లే ఈ వ్యత్యాసం అన్నారు.

April 29, 2026 / 08:00 AM IST

జగన్‌పై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే పరిటాల సునీత

ATP: వైసీపీ పాలనలో రాయలసీమలోని 102 సాగునీటి ప్రాజెక్టులను జగన్ రద్దు చేశారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. హంద్రీనీవా కోసం నాడు టీడీపీ రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ కనీసం రూ. 2 వేల కోట్లు కూడా కేటాయించలేదని మండిపడ్డారు.

April 29, 2026 / 08:00 AM IST

ప్రత్తిపాడులో కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ అమ్మకం

KKD: ఎండల తీవ్రతతో ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తుండగా, ప్రత్తిపాడులో కొందరు వ్యాపారులు కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మంగళవారం ఓ వ్యక్తి కొనుగోలు చేసిన డ్రింక్ బాటిల్పై గడువు ముగిసి ఉండటంతో ఈ విషయం వెలుగుచూసింది. దీనిపై ప్రశ్నిస్తే షాపు యజమానులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

April 29, 2026 / 08:00 AM IST