• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తిరుపతమ్మ అమ్మవారి హుండీ ఆదాయం వివరాలు

NTR: జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో 60 రోజుల హుండీ ఆదాయం రూ. 91.95 లక్షలు నమోదైంది. హుండీ లెక్కింపులో 25 గ్రాముల మిశ్రమ బంగారం, 380 గ్రాముల మిశ్రమ వెండి లభించాయి. అలాగే అమెరికా, లండన్, బ్రెజిల్, లిబియా దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు అధికారులు తెలిపారు.

May 30, 2026 / 06:44 PM IST

జలధార-జలహారతి పనులపై కలెక్టర్ సమీక్ష

ELR: జలధార- జలహారతి పనులపై కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాల్వలు, చెరువుల్లో కనీసం 2 అడుగుల మేర పూడికతీత చేపట్టాలని పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. జూన్ 15 లోపు మంజూరైన పనులన్నింటినీ పూర్తి చేసి ఫోటోలు అప్లోడ్ చేయాలన్నారు.

May 30, 2026 / 06:43 PM IST

ఉపాధి కూలీలకు పలు అంశాలపై అవగాహన

VZM: గజపతినగరం మండలంలోని మరుపల్లి, ములకల గుమడాం గ్రామాల్లో జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు శనివారం ఉపాధి కూలీలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మహిళ సాధికారత, సైబర్ నేరాలు, గంజాయి నియంత్రణ మహిళా చట్టాలపై గజపతినగరం CI ఎస్.సన్యాసినాయుడు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో SI కిరణ్ కుమార్ నాయుడు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

May 30, 2026 / 06:40 PM IST

పోలీస్ సిబ్బందికి ఘన వీడ్కోలు: ఎస్పీ

W.G: పోలీసు విభాగంలో సుదీర్ఘ కాలం పాటు చిత్తశుద్ధితో సేవలందించి పదవీ విరమణ పొందిన 11 మంది పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఘనంగా సన్మానించి, ఆత్మీయ వీడ్కోలు పలికారు.  పాలకోడేరు (M) గొల్లలకోడేరు జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి జ్ఞాపికలను అందజేశారు. పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

May 30, 2026 / 06:39 PM IST

బ్రాండిక్స్ కంపెనీని సందర్శించిన కేంద్రమంత్రి

AKP: అచ్యుతాపురం సెజ్‌లోని ప్రముఖ అంతర్జాతీయ వస్త్ర తయారీ సంస్థ ‘బ్రాండిక్స్’ ను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం సందర్శించారు. సంస్థలో జరుగుతున్న వస్త్ర ఉత్పత్తుల తయారీ, అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతుల ప్రక్రియను బ్రాండిక్స్ ఇండియా డైరెక్టర్, భారతీయ భాగస్వామి దొరస్వామి మంత్రికి క్షుణ్ణంగా వివరించారు.

May 30, 2026 / 06:37 PM IST

‘వేసవిలో కార్మికుల భద్రతకు జాగ్రత్తలు తప్పనిసరి’

విశాఖ కార్మిక శాఖ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో భవన నిర్మాణ రంగ యజమానులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్మికులకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎం. రామరావు మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో చల్లని తాగునీరు, ప్రథమ చికిత్స సామగ్రి, ORS ప్యాకెట్లు, ఐస్ ప్యాక్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు.

May 30, 2026 / 06:32 PM IST

‘ఐక్య పోరాటాల ద్వారానే సమస్యల పరిష్కారం’

ASR: కార్మికుల ఐక్య పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీ.ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం పాడేరులో సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ప్రస్తుతం దేశంలో పెరిగిన ధరలకు కార్మికవర్గం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు.

May 30, 2026 / 06:31 PM IST

‘పొగాకు వాడకం మానితేనే ఆరోగ్య రక్షణ’

GNTR: పొగాకు వినియోగించే వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కే. విజయలక్ష్మి హెచ్చరించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం గుంటూరు నగరంపాలెంలో సిబార్ వైద్య విద్యార్థులు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో పాల్గొన్నారు.

May 30, 2026 / 06:30 PM IST

ప్రజారోగ్య రక్షణే ధ్యేయం: కలెక్టర్

మన్యం జిల్లాలో ప్రజారోగ్య రక్షణే ధ్యేయంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్ ప్రభాకర రెడ్డి ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్‌లో ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను అమలుతీరును అడిగి తెలుసుకున్నారు.

May 30, 2026 / 06:30 PM IST

జిమ్‌ను ప్రారంభించిన ఎస్పీ

CTR: చిత్తూరు సాయుధ దళ కార్యాలయంలో ఆధునిక సదుపాయాలతో నవీకరించిన జిమ్‌ను ఎస్పీ తుషార్ శనివారం ప్రారంభించారు. పోలీసు సిబ్బందికి శారీరిక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణ, విధి నిర్వహణలో మరింత సమర్థత సాధించేందుకు ఈ జిమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు.

May 30, 2026 / 06:26 PM IST

49 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక

తూ.గో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో శనివారం రాజమండ్రిలోని జిల్లా ఉపాధి కార్యాలయ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ సంస్థలలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. మొత్తం 125 మంది అభ్యర్థులు జాబ్ మేళాకు హాజరుకాగా 49 మంది ఎంపిక అయ్యారని వివరించారు.

May 30, 2026 / 06:20 PM IST

‘లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవు’

W.G: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఇటువంటి పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జి.గీతాబాయి హెచ్చరించారు. సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు.

May 30, 2026 / 06:14 PM IST

తుంగభద్ర నదిలో ఐదురుగు గల్లంతు

KRNL: తుంగభద్ర నదిలో శనివారం ఈతకు వెళ్లి ఐదురుగు గల్లంతయ్యారు. సత్యనారాయణ స్వామి పూజకు హాజరైన బంధువులు పూజ అనంతరం నదికి వెళ్లారు. నీటి లోతు అంచనా వేయలేక ప్రమాదానికి గురయ్యారు. గల్లంతైన వారిలో హైదరాబాద్‌కు చెందిన యువన్ చంద్ర, సతీశ్ (35), మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర(25), ధను(23), ఉరవకొండకు చెందిన సంధ్య (22) ఉన్నారు.

May 30, 2026 / 06:13 PM IST

‘కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి’

ELR: జిల్లాలో మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు విజయవంతంగా ముగిశాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వర్చువల్ విధానంలో క్లస్టర్ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు.

May 30, 2026 / 06:13 PM IST

నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలి: ఎమ్మెల్యే

NTR: కంచికచర్ల మండలం బత్తినపాడు గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించబడిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శనివారం సందర్శించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆమె స్వామివారిని ప్రార్థించారు.

May 30, 2026 / 06:13 PM IST