• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అదనపు డీజీపీ ఘన స్వాగతం

ADB: అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీపీ డా. అనిల్ కుమార్ గురువారం ఆదిలాబాద్‌కు వచ్చారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ మౌనిక, డీఎస్పీ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు ఉన్నారు.

April 16, 2026 / 06:00 PM IST

‘లోకేష్ ఎంపిక రాష్ట్ర భవిష్యత్తుకు శుభసూచికం’

GNTR: టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి లోకేష్ ఎంపిక కావడం రాష్ట్ర భవిష్యత్తుకు శుభసూచకమని జడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా తెలిపారు. లోకేష్‌కు రాష్ట్ర గమనాన్ని మార్చే సామర్థ్యం ఉందని అన్నారు. యువ నాయకుడిగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

April 16, 2026 / 05:42 PM IST

పెదవడ్లపూడిలో రోడ్ల నిర్మాణాని శ్రీకారం

GNTR: మంత్రి లోకేశ్ చొరవతో పెదవడ్లపూడిలో అభివృద్ధి పనులు చేపట్టారు. మొత్తం రూ.93.90 లక్షలతో మూడు డొంక రోడ్ల నిర్మాణానికి ఏఎంసీ ఛైర్మన్ కిరణ్‌చంద్ గురువారం శంకుస్థాపన చేశారు. గద్దెరు బీడు, నంబూరు లాకులు, మొండి గేట్ వద్ద వీటిని నిర్మిస్తున్నారు. ఈ రోడ్లతో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు సులభంగా తరలించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

April 16, 2026 / 05:40 PM IST

‘ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి ఆరోగ్యం’

KDP: ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి ఆరోగ్యం, ఆదాయం, దిగుబడి ఉంటుందని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇవాళ పులివెందుల పట్టణంలోని స్థానిక ఏపీ కార్ల్‌లో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రకృతి మార్పులకు అనుగుణంగా పంటల సాగు, జీవామృతం, ఘనజీవామృతం, కషాయాల తయారీపై అవగాహన కల్పించారు.

April 16, 2026 / 05:30 PM IST

PM-RAHAT పథకంపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి

రోడ్డు ప్రమాదాలకు గురైన బాధితులకు ‘గోల్డెన్ అవర్’లో అత్యవసర ఉచిత వైద్య చికిత్సను అందించి ప్రాణాలను కాపాడాలనే ఉన్నత లక్ష్యంతో PM-RAHAT పథకంపై ప.గో.జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పథకం అమలులో కీలకమైన eDAR అప్లికేషన్ వినియోగంపై జిల్లా పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం పల సూచనలు అందజేశారు.

April 16, 2026 / 05:30 PM IST

గ్రంథాలయాన్ని గ్రేడ్-1కు మార్చాలని వినతి

ELR: జంగారెడ్డిగూడెం శాఖా గ్రంథాలయాన్ని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ కార్యదర్శి శేఖర్‌ ఇవాళ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అభివృద్ధి కమిటీ సభ్యులు ఆయనను కలిసి పలు వినతులు సమర్పించారు. పట్టణం గ్రేడ్-1 మున్సిపాలిటీగా ఉన్నందున, గ్రంథాలయాన్ని గ్రేడ్-1కు పెంచాలని కోరారు. భవనానికి మరమ్మతులు, రంగులు వేయడంతో పాటు అదనపు సిబ్బందిని నియమించాలని కోరారు.

April 16, 2026 / 05:30 PM IST

చిన్నగంజాంలో పోషణ పక్వాడాపై అవగాహన

BPT: చిన్నగంజాం మండలంలో అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడా నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ వాణిశ్రీ తల్లులకు పిల్లల ఆరోగ్యంపై సూచనలు ఇచ్చారు. జంక్ ఫుడ్ వల్ల వచ్చే సమస్యలను వివరించి, స్వచ్ఛమైన పోషకాహారం అందించాలని, చిన్నప్పటి నుంచే సరైన ఆహార అలవాట్లు పెంచాలని అవగాహన కల్పించారు.

April 16, 2026 / 05:26 PM IST

రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కృష్ణమ్మ

KRNL: మంత్రాలయం–చిలకలడోణ రోడ్డుప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడం పట్ల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ఇవాళ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందించాలని అధికారులను కోరారు. అత్యంత హృదయవిదారకమైన ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

April 16, 2026 / 05:25 PM IST

రాయలసీమ ప్రాజెక్టుల సాధనకు కదలాలి: శైలజానాథ్

ATP: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని శింగనమల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. కర్నూలులో ఎస్వీ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన ‘సాగునీటి ప్రాజెక్టులు-సమాలోచన’ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుతోనే ప్రాంతీయ నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

April 16, 2026 / 05:20 PM IST

బాలకృష్ణను సత్కరించిన మడకశిర ఎమ్మెల్యే

సత్యసాయి: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికైన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను అమరావతిలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఏడీసీసీబీ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు బొకే అందించి, శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టినందుకు నేతలు హర్షం వ్యక్తం చేశారు.

April 16, 2026 / 05:20 PM IST

కాకినాడలో సెన్సస్- 2027 స్వీయ నమోదు ప్రారంభం

కాకినాడలో సెన్సస్-2027 స్వీయ నమోదు ప్రక్రియను గురువారం అధికారికంగా ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ NVV సత్యనారాయణ యాప్ ద్వారా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేత కుటుంబ వివరాలు నమోదు చేయించారు. ఈ నెలాఖరు వరకు https://census.gov.in పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా నమోదు చేసుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు.

April 16, 2026 / 05:20 PM IST

హనుమాన్ భక్త శోభాయాత్రపై ఎస్సైకు వినతి పత్రం

NLR: సంగంలో ఈ నెల 26న హనుమాన్ భక్త శోభాయాత్ర జరగనుంది. ఈ కార్యక్రమం శాంతియుతంగా, విజయవంతంగా జరిగేందుకు అవసరమైన బందోబస్తును ఏర్పాట్లు చేయాలని కోరుతూ శోభాయాత్ర కమిటీ సభ్యులు సంగం ఎస్సై రాజేష్‌కు గురువారం వినతి పత్రం సమర్పించారు. శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

April 16, 2026 / 05:20 PM IST

మందకృష్ణ వ్యాఖ్యలు ఖండించిన బ్రాహ్మణ సంఘాలు

GNTR: ఎమ్మార్పీఎస్ నేత మందా కృష్ణ మాదిగ అర్చకులు, బ్రాహ్మణులపై చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని అర్చక & బ్రాహ్మణ ఐక్యవేదిక నాయకులు అన్నారు. తెనాలిలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. అనేక దేవాలయాల్లో బ్రాహ్మనేతరులు అర్చకులుగా ఉన్న విషయాన్ని కృష్ణ మాదిగ తెలుసుకోవాలని అనంతాచార్యులు, రఘు సూచించారు. దేశ విభజనకు మేము కారణమన్న వ్యాఖ్యలు దారుణమన్నారు.

April 16, 2026 / 05:16 PM IST

పోషణ పక్వాడాపై అవగాహన కార్యక్రమం

SKLM: ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెక్టార్ సూపర్వైజర్ కృష్ణమ్మ మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తు మెరుగుపరచాలని, వారిని సంరక్షించాలని తల్లిదండ్రులకు సూచించారు. అదేవిధంగా గర్భిణీలకు, బాలింతలకు, పిల్లల తల్లులకు పోషణ పక్వాడాపై అవగాహన కల్పించారు.

April 16, 2026 / 05:15 PM IST

‘స్వచ్ఛరథం సేవలను సద్వినియోగం చేసుకోవాలి’

AKP: స్వచ్ఛ రథం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కైలాసపట్నంలో స్వచ్ఛరథం గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అట్టపెట్టెలు, పనికిరాని ఇనప వస్తువులు, కాగితాలు, ప్లాస్టిక్ వ్యర్ధాలు స్వచ్ఛరథానికి అందిస్తే కావలసిన నిత్యవసర సరుకులను పొందవచ్చునని అన్నారు.

April 16, 2026 / 05:13 PM IST