• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తీరు మారకపోతే తాట తీస్తాం: ఎస్పీ

NDL: జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వారికి ఆదివారం ఎస్పీ సునీల్ ఆదేశాల మేరకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరప్రవృత్తికి స్వస్తి పలికి సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. పునరావాసం కోసం పోలీస్ శాఖ సహకారం అందిస్తుందన్నారు.

April 27, 2026 / 07:12 AM IST

భీమవరంలో పెట్రోల్ బంకుల తనిఖీ

WG: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం భీమవరంలోని ఓ పెట్రోల్ బంకును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఇంధన లభ్యతను పరిశీలించారు. కృత్రిమ కొరత సృష్టించవద్దని, అవసరానికి మించి నిల్వ చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. త్వరితగతిన సరఫరా చేయాలని యజమానులను ఆదేశించారు.

April 27, 2026 / 07:12 AM IST

వాసవి మాత ఉత్సవాల్లో మంత్రి సవిత సందడి

సత్యసాయి: పెనుకొండలోని వాసవీ మాత జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి, రథోత్సవాన్ని ప్రారంభించారు. వాసవీ మాత ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

April 27, 2026 / 07:12 AM IST

చైన్ స్నాచింగ్ కేసు.. ఫోటో విడుదల చేసిన పోలీసులు

PPM: గుమ్మలక్ష్మీపురంలోని సంతవీధిలో రెండు రోజుల క్రితం ఓ మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసులు ఇద్దరు దుండగులు దొంగలించి పారిపోయిన ఘటన విదితమే. ఈ మేరకు ఎల్విన్‌ పేట పోలీసులు ఆదివారం దొంగతనానికి సంబంధించి అనుమానిత ఓ వ్యక్తి ఫోటోను విడుదల చేశారు. ఆ వ్యక్తి వివరాలు తెలిసినా, కనిపించినా సమీప పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సీఐ హరి తెలిపారు.

April 27, 2026 / 07:09 AM IST

నేడు అమలాపురంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

కోనసీమ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీ.జీ.ఆర్.ఎస్)ను అర్జీదారులు సద్వినియో గం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి భవన్ నందు యధావిధిగా మీకోసం కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వ హించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించాలన్నారు.

April 27, 2026 / 07:08 AM IST

రైతులకు ఇంధన కష్టాలు.. వీఆర్ఓలకు దరఖాస్తు

తూ.గో: సీతానగరం మండలంలో వరి కోత సీజన్ వేళ డీజిల్ కొరత వేధిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇంధనం అందక కోత యంత్రాలు నిలిచిపోవడంతో పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు విధిలేక VAA, VROలకు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. యంత్రాల నంబర్లు నమోదు చేస్తూ, అత్యవసరంగా డీజిల్ కేటాయించాలని అధికారులను వేడుకుంటున్నారు.

April 27, 2026 / 07:06 AM IST

కర్నూలు జిల్లాలో ఇంధన కొరత లేదు: కలెక్టర్

KRNL: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతలేదని కలెక్టర్ డా. సిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం సాయంత్రం నాటికి నిలువలు, రవాణాలో ఉన్న లెక్కల ప్రకారం 10,47,186 లీటర్ల పెట్రోల్, 8,72,405 లీటర్ల డీజిల్ అందుబాటులో ఉందన్నారు. కావున ప్రజలు అవసరానికి మించి కొనరాదని సూచించారు. అలాగే పెట్రోల్ బంకుల యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 27, 2026 / 07:05 AM IST

ఇంధన కొరతపై నెల్లూరు కలెక్టర్ కీలక సూచన

NLR: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఆదివారం రాత్రి కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 243 పెట్రోల్, డీజిల్ ఔట్లెట్లు ఉన్నాయన్నారు. పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేదని ప్రజలు ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. జిల్లాలో సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

April 27, 2026 / 07:03 AM IST

BREAKING: హనీట్రాప్ కేసులో నలుగురు పోలీసుల డిస్మిస్

ATP: జిల్లాలో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో నలుగురు పోలీసులను ఉన్నతాధికారులు ఉద్యోగాల నుంచి తొలగించారు. రాప్తాడు సీఐ శ్రీహర్ష, హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, దేవల నాయక్‌పై డిస్మిస్ వేటు పడింది. అలాగే రూరల్ సీఐ శేఖర్‌ను కర్నూలు డీఐజీకి సరెండర్ చేయగా, ఎస్సై రాంబాబు, కానిస్టేబుళ్లు దేవేంద్ర, జయరాం నాయక్‌లను సస్పెండ్ చేశారు.

April 27, 2026 / 07:01 AM IST

నీటి తరలింపు చర్యలు మానుకోవాలి: YCP

VZM: గడిగడ్డ రిజర్వాయర్‌ నీటి తరలింపు చర్యలు మానుకోవాలని YCP గుర్ల మండల అధ్యక్షుడు సన్యాసినాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు కోరారు. ఆదివారం స్దానిక YCP కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. పట్టణ తాగునీటి కోసం తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలా చేస్తే 13 గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయి భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు.

April 27, 2026 / 07:00 AM IST

వైభవంగా వాసవి జయంతి వేడుకలు

CTR: శాంతిపురం మండలం రాళ్లబూదుగూరులో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి జయంతి వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష అలంకరణలో ప్రత్యేక పూజలు చేశారు. ఆర్యవైశ్యులు గ్రామ పురవీధుల్లో అమ్మవారి శోభాయాత్ర వేడుకలు ఘనంగా చేపట్టారు. వాసవి జయంతి సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

April 27, 2026 / 06:59 AM IST

నేడు ఈ మండలాల వారు జాగ్రత్త..!

కడప జిల్లాలో సోమవారం భానుడు నిప్పులు కురిపించనున్నాడు. మైదుకూరులో అత్యధికంగా 44.4°C నమోదవుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దువ్వూరు 43.9°C, అవధూత కాశినాయన 43.5°C, రాజుపాలెం 43.4°C, ప్రొద్దుటూరు 42.9°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు బయటకు వెళ్లొద్దన్నారు.

April 27, 2026 / 06:47 AM IST

రోడ్డుపై లారీ అడ్డు.. భారీగా ట్రాఫిక్ జామ్

NLR: నెల్లూరు నగర సమీపంలోని వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆదివారం రాత్రి భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నెల్లూరు నుంచి కడప వైపు వెళ్లే వాహనాలు కడప నుంచి నెల్లూరుకు వచ్చే వాహనాలతో రద్దీ ఏర్పడింది. ఓ లారీ అడ్డుగా రావడంతో ఇరువైపులా వాహనాలు భారీగా ఆగిపోయాయి. రోజు ఇలానే ట్రాఫిక్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు.

April 27, 2026 / 06:47 AM IST

తాగి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది: SI

VZM: మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష విధిస్తామని బొండపల్లి SI యూ.మహేష్ హెచ్చరించారు. ఆదివారం రాత్రి బొండపల్లి PS పరిధిలో NH పై వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాల రికార్డులు పరిశీలించి అనంతరం డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు ఎవరు మద్యం తాగి వాహనాలు నడపరాదని, దీంతో అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు.

April 27, 2026 / 06:45 AM IST

ఎమ్మెల్యే నేటి పర్యాటన వివరాలు

BPT: అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రారంభించనున్నారని ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు ఎస్సీ కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించిన సైడ్ డ్రైన్, రూ.4 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పోషణ పక్వాడ కార్యక్రమంలో పాల్గొంటారు.

April 27, 2026 / 06:42 AM IST