• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నాడు- నేడు నిధులు ఏమైయ్యాయి: ఎమ్మెల్యే

E.G: రాజమండ్రి 24వ డివిజన్ మెరక వీధి మున్సిపల్ స్కూల్ దయనీయ స్థితిలో ఉందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ‘నాడు-నేడు’ కింద ఖర్చు చేసిన రూ.14 లక్షల పనులు కనిపించడం లేదని విమర్శించారు. సిఎస్ఆర్ నిధులతో కిటికీలు మార్పు, ప్రహరీ గోడ పునర్నిర్మాణం, లీకేజీ స్లాబ్ మరమ్మత్తులు చేపట్టామని తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా దాతలు ముందుకు రావాలన్నారు.

April 22, 2026 / 01:44 PM IST

23న భగీరథ మహర్షి జయంతి వేడుకలు

VZM: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఈ నెల 23వ తేదీ గురువారం ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారిణి జ్యోతిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో ఉ10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు .ఈ ఉత్సవాలలో అందరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

April 22, 2026 / 01:36 PM IST

సమస్త జీవరాశి సంరక్షణకు పిలుపు

VSP: మద్దిలపాలెంలోని శ్రీ భావన విద్యానికేతన్‌లో ఎర్త్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నం మాట్లాడారు. ఎర్త్ డే అనేది సమస్త జీవరాశిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసే రోజు అని పేర్కొన్నారు. భూమిపై ఏ జీవి అంతరించినా మానవాళి మనుగడకే ముప్పు అని హెచ్చరించారు.

April 22, 2026 / 01:28 PM IST

ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ కార్యక్రమం ప్రారంభం

AKP: అనకాపల్లి ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్‌లో 13వ బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని డీపో అసిస్టెంట్ మేనేజర్ గౌరి ఇవాళ ప్రారంభించారు. ప్రతి బ్యాచ్‌లో 16 మందికి 40 రోజులపాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. డ్రైవింగ్ నైపుణ్యాలతో పాటు ఫైర్ సేఫ్టీ, మెకానికల్ ట్రైనింగ్ కూడా అందిస్తామని చెప్పారు. అనంతరం శిక్షణార్థులకు డ్రైవింగ్, సిగ్నల్, థియరీ పుస్తకాలు అందజేశారు.

April 22, 2026 / 01:20 PM IST

తాడిపత్రిలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

ATP: తాడిపత్రి నియోజకవర్గంలో వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్న 35 కుటుంబాలకు MLA జేసీ అస్మిత్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.18,94,242 నిధులను లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 526 మందికి రూ.3,94,43,766ల మేర ఆర్థిక సాయం అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

April 22, 2026 / 01:16 PM IST

సేవాభావాన్ని చాటుకున్న మంత్రి మండిపల్లి

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. వృద్ధులు, దివ్యాంగులతో కూర్చొని వారి సమస్యలను శ్రద్ధగా విని ధైర్యం చెప్పారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. దీంతో స్థానికులు మంత్రి శైలిని ప్రశంసించారు.

April 22, 2026 / 01:10 PM IST

గోషా ఆసుపత్రిలో నూతన సదుపాయాలు

VZM: రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ తన ఎంపీ ల్యాండ్స్ నిధులు రూ.50 లక్షలతో గోషా ఆసుపత్రిలో చేపట్టిన ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ నూతన సదుపాయాలను ఇవాళ ఎమ్మెల్యే అదితి అధికారికంగా ప్రారంభించారు. నిధులు మంజూరు చేసిన విజయేంద్ర ప్రసాద్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు.

April 22, 2026 / 01:06 PM IST

ఘనంగా ఎంపీపీ పాఠశాల వార్షికోత్సవం

SKLM: నందిగాం మండలం రాంపురం ఎంపీపీ పాఠశాల వార్షికోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. పాఠశాల అభివృద్ధి కోసం వారు రూ. 55 వేల విరాళం అందజేశారు. ఈ నిధులతో పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహం, సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఎంఈఓలు నరసింహులు, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

April 22, 2026 / 01:06 PM IST

పుల్లూరు క్రాస్ రోడ్‌లో అర్జున తపస్సు

CTR: ఎస్ఆర్ పురం మండలం, పుల్లూరు క్రాస్ రోడ్‌లో మహాభారత ఘట్టాల్లో ఒకటైన అర్జున తపస్సు కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. స్థానిక భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ తపస్సు కార్యక్రమం ద్వారా అర్జునుడు చేసిన దీక్ష, భగవంతునిపై భక్తిని ప్రతిబింబిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

April 22, 2026 / 01:06 PM IST

స్థల వివాదంపై MLA ఆదేశాలతో కేసు నమోదు: ఎస్ఐ

KRNL: ఆదోని ఎస్కేడీ కాలనీలో ఇంటి స్థలం హద్దుల వివాదంలో ఫాతిమా అనే మహిళపై దాడి జరిగినట్లు టూ టౌన్ ఎస్ఐ రామనాథ్ తెలిపారు. బాధితురాలు ఎమ్మెల్యేను ఆశ్రయించగా, ఆయన నిన్న ఘటనా స్థలాన్ని పరిశీలించి చర్యలకు ఆదేశించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏరకుల రంగన్న సహా నలుగురిపై కేసు నమోదు చేశారు. కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న ఈ స్థల వివాదంపై దర్యాప్తు చేపట్టారు.

April 22, 2026 / 01:05 PM IST

కొండపి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సోమశేఖర్ బదిలీ

ప్రకాశం: కొండపి సీఐ సోమశేఖర్ చీరాల వన్ టౌన్ సర్కిల్‌కు బదిలీ అయ్యారు. కొండపిలో సోమశేఖర్ బాధ్యతల చేపట్టాక నేరాలు కట్టడి చేయడంతోపాటు, పేకాట బెట్టింగులపై ఉక్కుపాదం మోపారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణానికి కృషి చేశారు. ఆయన సర్వీస్ కాలంలో అందరి అభిమానాలు పొందారు. సర్కిల్ పరిధిలో సమస్యలను పరిష్కరించడంలో మంచిపేరు తెచ్చుకున్నారు.

April 22, 2026 / 01:01 PM IST

మాజీ సర్పంచ్‌కు సన్మానం

PPM: జిల్లా గుమ్మలక్ష్మీపురంలో మాజీ సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్, ఉప సర్పంచ్ కిషోర్‌లకు ఆర్టీసీ షాప్ ల యూనియన్ సభ్యులు ఎద్దు మురళి, నారా సురేష్, నెమలిపురి మురళి ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగిన కార్యక్రమానికి వ్యాపారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వారి సేవలను ప్రశంసించారు.

April 22, 2026 / 01:00 PM IST

కామన్ ఎంట్రెన్స్ టెస్టులకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

VZM: జిల్లాలో నిర్వహించబోయే వివిధ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సెట్)లకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) సిహెచ్. సత్తిబాబు అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్‌లో వివిధ శాఖల ప్రతినిధులు మరియు కళాశాలల నిర్వాహకులతో పరీక్షల నిర్వహణపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

April 22, 2026 / 12:58 PM IST

పాఠశాల రక్షణకు ప్రహరీ గోడ ఎంతో అవసరం: ఎమ్మెల్యే

సత్యసాయి: కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఇవాళ ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం కింద సుమారు రూ.20 లక్షల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టారు. పాఠశాల రక్షణకు ప్రహరీ గోడ ఎంతో అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

April 22, 2026 / 12:57 PM IST

గూడూరులో గ్యాస్ అధిక ధరలకు విక్రయాలు

TPT: యుద్ధం సాకు చూపి గూడూరులో గ్యాస్ దందా నడుస్తోంది. గృహ వినియోగగ్యాస్ సిలిండర్ ధర 950 రూపాయలు కాగా గూడూరు హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్ 1100 రూపాయలు వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఓటీపీ వచ్చినా మాకు సంబంధం లేదు. మళ్లీ తిరిగి బుక్ చేసుకుంటేనే సిలిండర్ ఇస్తామంటూ దావా ఇస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు.

April 22, 2026 / 12:55 PM IST