• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదాలు నివారించాలి

CTR: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సమిష్టి కృషితో పాటు.. అవగాహన కల్పించాలని కోరారు.

April 9, 2026 / 05:41 PM IST

రాయచోటిలో సెమినార్‌కు ప్రత్యేక ఆకర్షణ

అన్నమయ్య: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏసియన్ అండ్ పసిఫిక్ స్టడీస్ (సీప్) స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయచోటికి చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి, మోటకట్ల హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మజలు ఏప్రిల్ 6 నుంచి 8 వరకు జరిగిన అంతర్జాతీయ సెమినార్‌లో హాజరయ్యారు.

April 9, 2026 / 05:35 PM IST

ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ సమీక్ష సమావేశం

W.G: రెవెన్యూ, పౌరసరఫరాలు, రవాణా, కోఆపరేటివ్ శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై గురువారం జిల్లా జేసీ రాహుల్ కుమార్ గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్, మే నెలలు రబీ సీజన్‌కు కీలకమని ఈ కాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి కేంద్రంలో కనీసం 50 శాతం గోనె సంచులు సిద్ధం చేయాలని కోరారు.

April 9, 2026 / 05:28 PM IST

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రచార రథం

KRNL: వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో బాల్య వివాహాలు, కౌమార గర్భాల నివారణ కోసం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఇవాళ “బాల్య వివాహ విముక్తి ప్రచార రథం” కార్యక్రమం నిర్వహించారు. కళాజాత బృందాలు పాటలు, నాటికల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాయి. ICDS పద్మావతి, సరస్వతి పలువురు “బేటీ బచావో – బేటీ పడావో” సందేశంతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.

April 9, 2026 / 05:27 PM IST

జనాభా గణనకు సిద్ధం.. మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

GNTR: తెనాలి మండలంలో జనాభా గణనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మార్వో గోపాలకృష్ణ తెలిపారు. మే 1–30 వరకు హౌస్ లిస్టింగ్, ఏప్రిల్ 16–30 వరకు స్వచ్ఛంద నమోదు అవకాశం కల్పించారు. జనాభా గణనకు ప్రజలు భయపడకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

April 9, 2026 / 05:25 PM IST

ఏలూరులో డెడ్ బాడీ కలకలం

ELR: ఏలూరులో గిలకల గేటు రైల్వే ట్రాక్‌పై గురువారం ఉదయం ఓ డెడ్ బాడీ కలకలం రేపింది. డ్యూటీలో ఉన్న ట్రాక్ మ్యాన్ రెండు ముక్కలైన మృతదేహాన్ని చూసి రైల్వే జీఆర్పీ ఎస్సైకు సమాచారం ఇచ్చారు. ఎస్సై దానం ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని పరిశీలించి ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతి చెందవచ్చునన్నారు. మృతుడికి 65 ఏళ్లు ఉండవచ్చునని పేర్కొన్నారు.

April 9, 2026 / 05:24 PM IST

జిల్లా జడ్జిని కలిసిన వెంకట సత్య ధనుష

NLR: కావలికి చెందిన దరిశి వెంకట సత్య ధనుష, ఇటీవల జూనియర్ సివిల్ న్యాయాధికారిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె గురువారం నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన కార్యాలయంలో గౌరవ జిల్లా జడ్జి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ.. న్యాయ రంగం పట్ల నేటి యువత ఆసక్తి చూపడం అభినందనీయమని అన్నారు.

April 9, 2026 / 05:20 PM IST

‘కుక్కల బెడదను నివారించాలి’

పార్వతీపురం పట్టణంలో కుక్కల, ఆవుల విహరం విపరీతంగా ఉన్నాయని వాటి వలన జరుగుతున్న ఇబ్బందులను వెంటనే నివారించాలని సీపీఎం పట్టణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ మేనేజర్ కె.శ్రీనివాసరావుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సమస్యకువెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.

April 9, 2026 / 05:15 PM IST

మధుపాడలో టేకు తోట దగ్ధం

VZM: గజపతినగరం మండలం మధుపాడలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక టేకు తోటలో గుర్తుతెలియని వ్యక్తులు పొగతాగి పడేయడంతో మంటలు చెలరేగాయి. బుర్ల నాయుడు, అప్పలనాయుడు, కృష్ణలకు చెందిన రెండు ఎకరాల తోట దగ్ధమైంది. ఇందులో సుమారు రూ. 30 వేల ఆస్తి నష్టం వచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

April 9, 2026 / 05:14 PM IST

ఏపీజే అబ్దుల్ కలాం పార్కును సందర్శించిన

SKLM: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం నగరంలోని ఏపీజే అబ్దుల్ కలాం పార్కును సందర్శించారు. ఈ మేరకు పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పార్కును అందరికీ అందుబాటులో ఉండే వినోద ప్రదేశంగా తీర్చిదిద్దాలని అన్నారు. అలాగే, పచ్చని వాతావరణంతో అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.

April 9, 2026 / 05:13 PM IST

ఎలినినోపై వ్యవసాయ సిబ్బందికి అవగాహన

AKP: ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధం అవుతున్న రైతులకు గురువారం ఎలినినోపై ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరులో అవగాహన సమావేశం నిర్వహించారు. ఎలినినో ప్రభావంతో వర్షాలు తగ్గడంతో పాటు వాతావరణం వేడెక్కే అవకాశాలు ఉన్నాయని ఏవో సౌజన్య తెలిపారు. అలాగే, విత్తన గుళికలు తయారీ గురించి సిబ్బందికి వివరించారు.

April 9, 2026 / 05:12 PM IST

ఏకలవ్య పాఠశాలను తనిఖీ చేసిన కార్యదర్శి

ASR: కొయ్యూరు మండలం బాలారం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను గురువారం గురుకులం కార్యదర్శి సీఏ మణి కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు మెనూ పక్కాగా అమలు చేయాలని అధికారులకి సూచించారు. అలాగే, విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు.

April 9, 2026 / 05:11 PM IST

కూటమితోనే గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే

NDL: రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం డోన్ మండలంలోని కొత్తబురుజులో జరిగిన సమావేశానికి కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ సమస్యలు, గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల ఏర్పాటు ఇతర సమస్యలపై ప్రజలతో ఆమె నేరుగా మాట్లాడారు.

April 9, 2026 / 05:10 PM IST

YSRతో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న వెంకటరామిరెడ్డి

ATP: వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 2003 ఏప్రిల్ 9న ఎర్రటి ఎండలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వైఎస్సార్ ఈ యాత్ర ప్రారంభించారని పేర్కొన్నారు. నాటి పాదయాత్రలో ఆయనతో కలిసి నడిచిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

April 9, 2026 / 05:10 PM IST

అయినవిల్లి పీహెచ్సీకి సామాగ్రి బహూకరణ

కోనసీమ: అయినవిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గ్రామానికి చెందిన అడ్డాల రామకృష్ణ గణపతి గురువారం రూ. 67 వేల విలువైన మూడు మంచాలను, పరుపులను అందజేశారు. ఈ మేరకు దాత కుటుంబ సభ్యులు PHC వైద్యాధికారి డాక్టర్ మంగాదేవికి అందజేశారు. డాక్టర్ మంగాదేవి దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.

April 9, 2026 / 05:10 PM IST