• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డీవో

NTR: విస్సన్నపేట మండలం పుట్రెల గ్రామంలోని రైస్ మిల్లును ఆర్డీవో ఏ.కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ధాన్యం దిగుమతుల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. మిల్లులో ఏర్పాట్లు, కొనుగోలు విధానంపై వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కే.లక్ష్మీ కళ్యాణి పాల్గొన్నారు.

April 26, 2026 / 08:25 PM IST

పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన బైక్ మాయం

KRNL: ఆదోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన అవెంజర్ బైక్ కనిపించకుండా పోవడం కలకలం రేపింది. హైదరాబాద్‌కు చెందిన సోమశంకర్ జరిమానా చెల్లించినప్పటికీ బైక్ ఇవ్వలేదని ఇవాళ ఆరోపించాడు. ఏడు నెలల తర్వాత స్టేషన్‌కు వెళ్లగా బైక్ మాయం అయినట్టు తెలిసి షాక్‌కు గురయ్యాడు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు, ఆయన తల్లి డిమాండ్ చేశారు.

April 26, 2026 / 08:25 PM IST

పి4 పథకం కింద చేపల మార్కెట్‌ ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: యనమలకుదురులో పి4 పథకం కింద చేపల మార్కెట్‌ను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు Y. V. B. రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఇవాళ ప్రారంభించారు. పేద వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక భరోసా అందించడమే లక్ష్యమని వారు తెలిపారు. పి4 పథకం సామాజిక ఆర్థిక అసమానతలు తగ్గించడంలో దోహదపడుతుందన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 26, 2026 / 08:24 PM IST

అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, శిశువు సురక్షితం

ASR: డుంబ్రిగూడ మండలం జోగిపుట్టు గ్రామానికి చెందిన కోర్రా బ్రుందకు ఆదివారం ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో 108అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అంబులెన్స్‌లో ప్రసవం జరిగి ఆడ శిశువు జన్మించింది. తల్లి, శిశువు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని EMT ఏ. అప్పలనాయుడు తెలిపారు.

April 26, 2026 / 08:14 PM IST

సన్నిధి వీధిలో ఫ్లెక్సీల వివాదం

TPT: నాగలాపురంలోని వేద నారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల వేళ సన్నిధి వీధిలో రాజకీయ ఫ్లెక్సీలు విస్తరించడం వివాదాస్పదమైంది. దర్శన మార్గంగా ఉండాల్సిన వీధి పార్టీ బ్యానర్లు, బోర్డులతో నిండిపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

April 26, 2026 / 08:02 PM IST

వాసవి జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే

KRNL: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వాసవి మాత శాంతి, సేవా భావానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

April 26, 2026 / 08:02 PM IST

చోరీ జరిగిన ఇంట్లో వేలిముద్రల సేకరణ

ATP: గుత్తిలోని ఓల్డ్ సీపీఐ కాలనీలో నివాసముండే షాహినా అనే మహిళ ఇంట్లో శనివారం రాత్రి 4 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆదివారం జిల్లా క్లూస్ టీం సభ్యులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. కిటికీలు, డోర్లపై ఉన్న వేలిముద్రలు సేకరించారు. పరిసరాలలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.

April 26, 2026 / 08:00 PM IST

‘అనంతబాబును తక్షణమే బర్తరఫ్ చేయాలి’

KRNL: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణమే బర్తరాఫ్ చేయాలని ఆదివారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ధరూర్ జేమ్స్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

April 26, 2026 / 07:49 PM IST

క్రికెట్ బెట్టింగ్‌పై రైడ్.. ముగ్గురు అరెస్ట్

GNTR: నగరంపాలెం పీఎస్ పరిధిలోని సత్తెనపల్లి రోడ్డులో విజయలక్ష్మి బార్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ దాడి చేసింది. ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా బెట్టింగ్ ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, ఖాతాల్లో రూ.3,748 ఉన్నట్లు గుర్తించారు. తదుపరి విచారణకు కేసును నగరంపాలెం పోలీసులకు అప్పగించామన్నారు.

April 26, 2026 / 07:43 PM IST

‘దొంగతనాల నియంత్రణకు రాత్రి గస్తీ కట్టుదిట్టం’

VZM: జిల్లాలో దొంగతనాలను అరికట్టేందుకు రాత్రి గస్తీ, పెట్రోలింగ్‌ను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు SP దామోదర్ ఆదివారం తెలిపారు. ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా పోలీసు సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. తాళాలు వేసిన ఇళ్ల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాలని, అనుమానాస్పద వ్యక్తులపై పర్యవేక్షణ పెంచాలని సూచించారు.

April 26, 2026 / 07:41 PM IST

తోటాడలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

AKP: మునగపాక మండలం తోటాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. 2010-11 బ్యాచ్‌కి చెందిన పదవ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించి చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు అందరూ కలిసి భోజనాలు చేసి ఆటపాటలతో ఆనందంగా గడిపారు.

April 26, 2026 / 07:40 PM IST

జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా సాధనాల శ్రీను

కోనసీమ: జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా అల్లవరం మండలానికి చెందిన సాధనాల శ్రీను నియమితులయ్యారు. ఆయనకు అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ అభినందనలు తెలిపారు. వైసీపీ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కొనుకు గౌతమి, రాపాకు విజయలక్ష్మి, బర్రె సీతారత్నం తదితరులు పాల్గొన్నారు.

April 26, 2026 / 07:38 PM IST

ఐపీఎస్ నేర సమీక్షలో ఎస్పీ కీలక ఆదేశాలు

పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ జిల్లా నేర సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని, సీసీటీఎన్ఎస్ డేటా అప్‌డేట్ చేయాలని సూచించారు. రౌడీషీటర్లకు వారానికి కౌన్సెలింగ్, గంజాయి కేసుల్లో సస్పెక్ట్ షీట్లు తప్పనిసరి అన్నారు. మహిళా భద్రత, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై కట్టుదిట్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

April 26, 2026 / 07:34 PM IST

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగాభరణం విరాళం

NDL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొత్తూరులో కొలువైన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆళ్ళగడ్డ పట్టణానికి చెందిన వెంకట నాగరాజు 395 గ్రాముల వెండి నాగభరణము వితరణ చేశారని ఈవో రామకృష్ణ తెలిపారు. వెండి నాగాభరణం అందించిన దాతలకు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేసినట్లు వివరించారు.

April 26, 2026 / 07:34 PM IST

గుడి కూల్చివేత అప్రజాస్వామికం: కేవీపీఎస్

W.G: ఆకివీడులో అర్థరాత్రి గొంతేనమ్మ గుడిని కూల్చివేయడం అప్రజాస్వామికమని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి తీవ్రంగా ఖండించారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించి, పోలీసు, పంచాయతీ సిబ్బందితో ఈ చర్య చేపట్టడం దారుణమన్నారు. ఘటనలో అధికార యంత్రాంగం, పోలీసుల పాత్రపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

April 26, 2026 / 07:26 PM IST