• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పెట్రోల్ బంకుల తనిఖీ చేసిన కలెక్టర్

PLD: నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలో ఉన్న HP, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బంక్ యజమానులతో మాట్లాడిన ఆమె, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెట్రోల్, డీజిల్ సరఫరా కొనసాగించాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇంధనాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

April 28, 2026 / 11:52 AM IST

ఆకాశాన్నంటినా నిమ్మకాయ ధరలు

GNTR: తెనాలిలో నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వేసవిలో వినియోగం ఎక్కువగా ఉండటంతో ధరలు అమాంతంగా పెరిగాయి. పంట పండించే రైతులకు మాత్రం నామ మాత్రపు ధరలే లభిస్తుండగా వ్యాపారుల వద్ద మాత్రం భారీ ధరలు పలుకుతున్నాయి. రిటైల్ మార్కెట్లో డజను నిమ్మ రూ.120-150 చొప్పున విక్రయిస్తున్నారు.

April 28, 2026 / 11:36 AM IST

మనది పనులకు టెంకాయలు కొట్టె బ్యాచ్ కాదు: వేమిరెడ్డి

నెల్లూరు: మనది అభివృద్ధి పనులకు టెంకాయలు కొట్టివొదిలేసే బ్యాచ్ కాదని MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం ఇందుకూరుపేట(M) ముదివర్తిపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ముధవర్తి కాజ్వే బ్రిడ్జ్ గత ప్రభుత్వంలో టెంకాయలు కొట్టి వదిలేశారని, చంద్రబాబు 90 శాతం పనులు పూర్తి చేశారన్నారు. రూ.2002 కోట్లతో కాజ్వే త్వరలో పూర్తవుతుందన్నారు.

April 28, 2026 / 11:33 AM IST

విలేకరి హత్య.. దొంగను పట్టించినందుకేనా?

CTR: వీ కోటలో విలేకరి జగన్ మోహన్ దారుణ హత్యకు గురయ్యారు. ఇటీవల జరిగిన కొన్ని దొంగతనాలపై ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ హత్య వెనుక అదే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల జరిగిన దొంగతనాలపై ఆయన పోలీసులకు వివరాలు అందించగా, ఆ విషయాన్ని గుర్తించిన దొంగల గుంపు కక్షతో ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం.

April 28, 2026 / 11:33 AM IST

వాహనాలకు మాత్రమే డీజిల్ పట్టాలి: తహసీల్దార్

KDP: వాహనదారులకు మాత్రమే డీజిల్ పట్టాలని తహసీల్దార్ అనురాధ పెట్రోల్ బంకుల యజమానులకు సూచించారు. సింహాద్రిపురంలోని హెచ్‌పి పెట్రోల్ బంకుతో పాటు పలు పెట్రోల్ బంకులను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజిల్ పట్టాలన్నారు. ఆమె వెంట ఆర్ఐ గంగాధర రెడ్డి, వీఆర్వో పుష్పరాజ్, తదితరులు ఉన్నారు.

April 28, 2026 / 11:30 AM IST

జిల్లాలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్

సత్యసాయి: కదిరిలో మే 1న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ తెలిపింది. ఎస్‌టీఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే ఈ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18-38 ఏళ్ల అభ్యర్థులు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.13 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం ఉంటుందని అధికారులు తెలిపారు.

April 28, 2026 / 11:30 AM IST

కారసాని శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే

PLD: నరసరావుపేటలో మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ కారసాని శ్రీనివాస్ రెడ్డి ఇటీవల శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటుండగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత క్రాంతి కుమార్ పాల్గొన్నారు.

April 28, 2026 / 11:28 AM IST

‘పోలమ్మతల్లి పండుగతో పాతబొబ్బిలిలో ట్రాఫిక్ జామ్’

VZM: బొబ్బిలిలోని పాతబొబ్బిలి పోలమ్మతల్లి ఆలయం వద్ద మంగళవారం పండుగ సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయానికి చేరుకునే మార్గంలో వాహనాలను రోడ్డుపైనే నిలిపివేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చేరుకుని రాకపోకలను సక్రమం చేశారు.

April 28, 2026 / 11:24 AM IST

మాజీ సీఎం నాదెండ్లకు మంత్రి నివాళి

NDL: మంత్రి నాదెండ్ల మనోహర్‌ను హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో ఇవాళ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, సహచర మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్య ప్రసాద్, సత్యకుమార్ యాదవ్‌తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మనోహర్‌కు ధైర్యం చెప్పి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

April 28, 2026 / 11:22 AM IST

మనది గూగుల్.. ఆ పార్టీది గొడ్డలి: లోకేశ్

VSP: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా మంత్రి లోకేశ్ విపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రజా ప్రభుత్వానిది గూగుల్ అయితే.. ఆ పార్టీది గొడ్డలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవాలని చూశారని, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ కొట్టేందుకు సీసీడీ రోగులు యత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.

April 28, 2026 / 11:22 AM IST

విలేకరి హత్య.. చిత్తూరు ఎమ్మెల్యే ఆగ్రహం

CTR: వి.కోటలో ఓ పత్రికా విలేకరి జగన్ మోహన్ రెడ్డి హత్య ఘటనపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణాన్ని ఖండిస్తూ, సంఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. పత్రికా విలేకరిపై జరిగిన ఈ దాడి క్షమించరానిదని పేర్కొంటూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.

April 28, 2026 / 11:21 AM IST

ఈవీఎంల భద్రతపై నెలవారీ తనిఖీ

E.G: రాజమండ్రిలోని ఎఫ్‌సీఐ గోదాంలో భద్రపరచిన 2024 ఎన్నికల ఈవీఎంలను మంగళవారం నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించినట్లు DRO టి.సీతారామ మూర్తి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల మార్గదర్శకాలు & కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోదాంలో ఉన్న ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును సమీక్షించారు.

April 28, 2026 / 11:19 AM IST

పర్యాటకులను ఆకట్టుకుంటున్న కోరంగి అభయారణ్యం

కాకినాడ: కోరంగి అభయారణ్యంలో పర్యాటకుల కోసం 2.295 కిలోమీటర్ల పొడవైన చెక్క నడక దారి ఉంది. ఆసియాలోనే రెండో అతిపెద్దదిగా గుర్తింపు పొందిన ఈ వంతెనను ఒక్క చెట్టు కూడా నరకకుండా నిర్మించారు. అభయారణ్యంలో 40 మీటర్ల ఎత్తులో ఉన్న వాచ్ టవర్ ద్వారా మొత్తం అడవిని ‘బర్డ్స్ ఐ వ్యూ’ లో చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ RX100లో పిల్లారా వంటి పాటలు కూడా చిత్రీకరించారు.

April 28, 2026 / 11:08 AM IST

సీతంపేట బంకులో నో స్టాక్ బోర్డు

PPM: సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఏకైక పెట్రోల్ బంకులో గత రెండు రోజులుగా డీజిల్, పెట్రోల్ లభ్యం కావడం లేదు. ఇంధన నిల్వలు లేకపోవడంతో బంకు వద్ద ‘నో స్టాక్’ బోర్డులు ఏర్పాటు చేయగా, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సరఫరా పునరుద్ధరించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

April 28, 2026 / 11:06 AM IST

పీజీఆర్ఎస్‌లో 104 అర్జీలు స్వీకరణ: కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ బాలాజీ ప్రజల వద్ద నుంచి 104 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీల రూపంలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

April 28, 2026 / 11:05 AM IST