• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేయాలి’

AKP: ఎస్. రాయవరం మండలం తిమ్మాపురం మేజర్ పంచాయతీలో అసంపూర్తిగా ఉన్న జల్ జీవన్ మిషన్ పనులను పూర్తి చేయాలని మాజీ సర్పంచ్ కర్రి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం అడ్డరోడ్డు జంక్షన్ ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పంచాయతీ పరిధిలో 2021లో మొదలైన జీవన్ మిషన్ పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదని అన్నారు.

April 14, 2026 / 07:29 AM IST

పుట్టపర్తిలో ఆకట్టుకున్న నాటక ప్రదర్శన

సత్యసాయి: తమిళ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో తమిళనాడు సాయి యువత ‘త్యాగతిన్ శిఖరంగాళ్’ పేరుతో నాటకాన్ని ప్రదర్శించారు. సంఘం కాలం నాటి పారి, పేగన్ వంటి ఏడుగురు గొప్ప దాతల త్యాగనిరతిని ఈ నాటకంలో అద్భుతంగా ఆవిష్కరించారు. మూగజీవాలు, ప్రకృతి పట్ల వారు చూపిన కరుణను కళ్ళకు కట్టినట్లు చూపారు.

April 14, 2026 / 07:27 AM IST

మంత్రాలయంలో ముమ్మరంగా వాహనాల తనిఖీ

KRNL: మంత్రాలయం రాఘవేంద్ర కూడలిలో ఎస్సై మల్లికార్జున సిబ్బందితో కలిసి సోమవారం సాయంత్రం ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. వాహనదారులు తప్పనిసరిగా ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. నిషేధిత వస్తువుల రవాణాపై హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి, సరైన ధ్రువపత్రాలు లేని పలు వాహనాలకు జరిమానా విధించామన్నారు.

April 14, 2026 / 07:27 AM IST

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గియడమే లక్ష్యం: ఎస్పీ

NLR: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖతో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల సోమవారం తెలిపారు. బస్సుల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్‌ను పరిశీలిస్తున్నామని, హైవేలపై బ్లాక్ స్పాట్స్‌ను ఇప్పటికే సరిదిద్దామని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రమాదాల మరణాల రేటు 20% తగ్గిందని ఆమె పేర్కొన్నారు.

April 14, 2026 / 07:27 AM IST

MLAను మర్యాద పూర్వకంగా కలసిన డీఎస్పీ

VZM: బొబ్బిలి DSP గా గోవిందరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ DSPగా పని చేసిన భవ్యరెడ్డిను సరెండర్‌ చేసిన నేపథ్యంలో VZM DSP గా పనిచేస్తున్న ఆయనను బొబ్బిలి బదిలీ చేయడంతో బాధ్యతలు స్వీకరించి బొబ్బిలి కోటలో స్దానిక MLA బేబినాయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సబ్‌ డివిజన్లో గంజాయి, సైబర్‌ నేరాలు నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.

April 14, 2026 / 07:14 AM IST

నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

అనకాపల్లి జిల్లాలో నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో వేటనిషేధం అమలులోకి రానుంది. జూన్ 14 వరకు వేట నిషేధం కొనసాగుతుంది. సముద్రంలో చేపల సంతాన ఉత్పత్తికి అంతరాయం కలగకుండా ప్రతి ఏట మే 14 నుంచి జూన్ 15 వరకు ప్రభుత్వం వేట నిషేధాన్ని అమలు చేస్తుంది. జిల్లాలో 31 మత్స్యకార గ్రామాల్లో 12,644 మంది మత్స్యకారులకు ప్రభుత్వం వేట నిషేధ సమయంలో భృతిని అందజేస్తుంది.

April 14, 2026 / 07:04 AM IST

కలెక్టర్ చేతులమీదుగా ఎంపీడీఓ కు సత్కారం

PPM: జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి సోమవారం ఆయన ఛాంబరులో భామిని MPDO ఎస్‌.వసంత కుమారిని శాలువాతో సత్కరించారు. సంపూర్ణత అభియాన్‌ 2.0 సక్సెస్‌ మీట్‌లో భాగంగా ఆమెను సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయిలో సంపూర్ణత అభియాన్‌ 2.0 విజయవంతం చేయడంలో పూర్తి బాధ్యత వహించినందుకు సత్కరించినట్టు తెలిపారు.

April 14, 2026 / 06:49 AM IST

నేటి నుంచి అగ్నిమాపక శాఖ వారోత్సవాలు

SKLM: శ్రీకాకుళం అగ్నిమాపక శాఖ వారోత్సవాలు మంగళవారం నుంచి వారం రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగహన కల్పించేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి కె. మోహనరావు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి, ప్రజలు భాగస్వామ్యులై, విజయవంతం చేయాలని కోరారు.

April 14, 2026 / 06:49 AM IST

‘సమతుల్య ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలి’

W.G: జిల్లాలో ఈనెల 23 వరకు నిర్వహించే 8వ ‘పోషణ పక్వాడ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా పోషకాహార లోప నివారణపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరికీ సమతుల్య ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.

April 14, 2026 / 06:42 AM IST

సమగ్ర శిక్షలో 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

NDL: జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో గల ASO, APO, AAMO, AGCDO, ACMO పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సోమవారం జిల్లా సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త నిత్యానంద రాజులు తెలిపారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రంలోపు పొన్నాపురంలోని జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలని అన్నారు. జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్లు /SGTలు మాత్రమే అర్హులన్నారు.

April 14, 2026 / 06:40 AM IST

రేపటి నుంచి ప్రత్యేక ఆధార్ శిబిరాలు

VSP: జీవీఎంసీ 78వ వార్డు ఉక్కునగరంలో ఈనెల 15 నుంచి 22వ తేదీ వరకూ ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని నిర్వహించనున్నట్టు వార్డు మాజీ కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ అప్డేట్, ఫోటో మార్పిడి వంటివి చేపడుతున్నట్లు తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్‌లోని వార్డు సచివాలయంలో జరిగే సేవలను వినియోగించుకోవాలన్నారు.

April 14, 2026 / 06:34 AM IST

ఈనెల 16 నుంచి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రారంభం: కమిషనర్

E.G: పౌరులు తమ వివరాలను స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే ‘సెల్ఫ్-ఎన్యుమరేషన్’ విధానాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చిందని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఉద్యోగ, వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాల్లో నివసించే వారికి ఇది ఎంతో ప్రయోజనకరమన్నారు. ఇంటి నుంచే సులభంగా వివరాలు నమోదు చేసుకునే ఈ సువర్ణ అవకాశాన్ని పౌరులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 14, 2026 / 06:34 AM IST

నేడు వెల్దుర్తిలో సొసైటీ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం

KRNL: వెల్దుర్తిలో నూతన సొసైటీ కాంప్లెక్స్‌ను ఇవాళ ప్రారంభించనున్నట్లు సింగిల్ విండో ఛైర్మన్ బొమ్మన రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేడీసీసీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ.శ్యాంబాబు హాజరై కాంప్లెక్స్‌ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు.

April 14, 2026 / 06:32 AM IST

నేడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ పర్యటన వివరాలు

KKD: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ నేటి పర్యటన వివరాలను ఆమె కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9 గంటలకు ప్రత్తిపాడు మండలం, పెద శంకర్లపూడి గ్రామంలో అంబేద్కర్ 136వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఉదయం 10.45 గంటలకు ప్రత్తిపాడు గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద “స్వచ్ఛరథం”ను ప్రారంభిస్తారు.

April 14, 2026 / 06:31 AM IST

మట్కా బీటర్ అరెస్ట్.. రూ. 5 వేలు స్వాధీనం

కడపలోని ఎర్రముక్కపల్లెలో మట్కా ఆడుతున్న వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సీఐ చిన్న పెద్దయ్య ఆదేశాల మేరకు ఎస్సై అమర్‌నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. నిందితుడి వద్ద నుంచి రూ. 5 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్, మట్కా స్లిప్పులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

April 14, 2026 / 06:30 AM IST