W.G: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లోని నాదెండ్ల నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, అక్కడ భాస్కరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.
SKLM: హెల్మెట్ ధరించడం భారం కాదు, ప్రతి వాహనదారుడి బాధ్యత అని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం “అభయం” పేరిట హెల్మెట్ ధారణపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి బయటపడాలంటే హెల్మెట్ ధరించడం అత్యంత అవసరమని అన్నారు. జిల్లా కలెక్టర్, అధికారులు ఉన్నారు.
KRNL: కలెక్టరేట్‌లోని మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఆహార ఉత్పత్తుల తయారీ ద్వారా స్వయం ఉపాధి సాధిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్న తీరు ప్రశంసనీయమని శనివారం జిల్లా కలెక్టర్ డా.సిరి అన్నారు. మహిళలు స్వయంగా వ్యాపారాలు ప్రారంభించి కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
E.G: రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ మహిళను (26) సెంట్రల్ జోన్ శక్తి టీం గుర్తించి మాట్లాడగా, కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చినట్లు తెలిపింది. వెంటనే స్పందించిన శక్తి టీం ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించారు.
ATP: అనంతపురం లలితకళా పరిషత్‌లో నేడు నిర్వహించనున్న “బీసీ గళం” సభ పనులను వైసీపీ నేతలు పరిశీలించారు. కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ బీసీ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సభ జరగనుంది. బీసీల హక్కుల కోసం జరిగే ఈ పోరాట సభకు ప్రజలు, మేధావులు అధిక సంఖ్యలో తరలిరావాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు.
NLR: నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు శనివారం రాత్రి కావలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటల్‌ను సీఐ గిరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. హోటల్ రికార్డ్‌ను పరిశీలించారు. అనంతరం ప్రతి రూమును క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేరని ఆరా తీశారు. మద్యం సేవిస్తున్న ఏడుగురుని స్టేషన్‌కు తరలించారు.
KDP: మైదుకూరులోని నాలుగు రోడ్ల కూడలి వద్ద శనివారం రాత్రి ఓ కూలింగ్ షాపులో ఫ్రిడ్జ్ కంప్రెసర్ భారీ శబ్దంతో పేలిపోయింది. రాత్రి సమయం కావడంతో సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో షాపు యజమానికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే శ్రీ బుర్ల రామాంజనేయులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు వారిని స్వాగతం పలికారు. వారి కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.
E.G: బూరుగుపూడి గేట్‌లోని టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్, క్యాడర్ మీటింగ్ నిర్వహించారు. రూడాచైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు, రాజానగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలు విని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయిలోపార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద బీజేపీ నేతలు గుండాల గోపీనాథ్ తదితరులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం కేంద్ర మంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
SKLM: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఫ్లైఓవర్ వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యేనా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత మూడు సంవత్సరాల నుంచి ఈ వంతెన పనులు జరుగుతున్నాయని ఈ వంతెన పనులు నిర్మాణం పూర్తి కానందున పాతపట్నం గేటు వద్ద నిరంతరం ఇబ్బందులు కలుగుతున్నాయని విమర్శలు ఉన్నాయి.
KRNL: సీఎం చంద్రబాబుకు ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు రావడం సంతోషంగా ఉందని శనివారం మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. చంద్రబాబుకు అవార్డు రావడం తెలుగు ప్రజలకు దక్కిన గౌరవం అన్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. బాబు టీంలో పనిచేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
E.G: రాబోయే పుష్కరాల దృష్ట్యా వేమగిరి పుష్కర ఘాట్‌ను సౌత్ జోన్ డీఎస్పీ ఏ. శివ ప్రియ శనివారం పరిశీలించారు. కడియం మండలం ఊదలమ్మ గుడి సమీపంలోని ఘాట్ వద్ద భద్రతా ఏర్పాట్లపై సీఐ అల్లు వెంకటేశ్వరరావుతో చర్చించారు. గత పుష్కరాల అనుభవాలను తెలుసుకుని, అవసరమైన చర్యలపై సూచనలు ఇచ్చారు. అనంతరం కడియం పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు.
NDL: జిల్లాలో మొత్తం 449 రెవెన్యూ గ్రామాలు ఉండగా, ఇప్పటివరకు 263 గ్రామాల్లో రీ సర్వే పూర్తైందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్లో అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. పూర్తి చేసిన గ్రామాలలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను త్వరితగతిన పంపిణీ చేయాలని ఆదేశించారు. 5వ విడతలో భాగంగా ఈనెల 15 నుంచి 30 గ్రామాల్లో రీ సర్వే ప్రారంభించామన్నారు.
కోనసీమ: జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.ఎస్. కుమారీశ్వరన్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నూతనంగా విధుల్లో చేరిన సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన రామచంద్రపురం ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్‌తో కలిసి ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.