• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాలి: తుమ్మల

KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు సందర్శించారు. ప్రస్తుతం 200 మంది వరకు ఓపీ పేషెంట్లు వస్తున్నట్లు ఆసుపత్రి డాక్టర్లు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని డీసీవీ ఛైర్మన్ బాబు ఆదేశించారు.

April 9, 2026 / 10:09 AM IST

చెత్త నిర్వహణపై ఎమ్మెల్యే పరిశీలన

PLD: నరసరావుపేట (M) ములకలూరులో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు గురువారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించారు. చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసే షెడ్లను సందర్శించి కార్మికులతో మాట్లాడారు. సేంద్రియ ఎరువుల వల్ల రైతులకు లాభాలున్నాయని తెలిపారు. పరిశుభ్రత కోసం ప్రజలంతా చెత్తను వేరుచేసి ఇవ్వాలని ఆయన సూచించారు.

April 9, 2026 / 10:09 AM IST

యూరియా నీరు తాగి 15 గొర్రెలు మృతి

సత్యసాయి: కదిరి మండలం పట్నం గ్రామంలో విషాదం నెలకొంది. పొలం వద్ద పంట కోసం ఉంచిన యూరియా కలిపిన నీరు తాగి 15 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల కాపరి క్రిష్ణ మేతకు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా, గొర్రెలు దాహంతో బకెట్లలోని నీటిని తాగాయి. కొద్దిసేపటికే కడుపు ఉబ్బి అవి ప్రాణాలు విడిచాయి. సుమారు లక్షన్నర రూపాయల నష్టం వాటిల్లిందని రైతు వాపోయారు.

April 9, 2026 / 10:05 AM IST

కర్నూలు జిల్లాలో నిప్పుల కొలిమి

KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండలు తీవ్రమయ్యాయి. బుధవారం చాగలమర్రిలో అత్యధికంగా 41.9 డిగ్రీలు, ఆళ్లగడ్డలో 41.8, కౌతాళంలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యుడి భగభగలతో మధ్యాహ్నం పట్టణాల్లోని రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వడగాల్పుల తీవ్రతకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.

April 9, 2026 / 10:00 AM IST

15నుంచి ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభం

ATP: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 15వ తేదీ నుంచి సీసీటీవీ కెమెరా ఇన్ స్ట్రాలేషన్ కోర్సు పై ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నట్లు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ శాంతి ప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు ఉండి టెన్త్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. మరిన్ని వివరాల కోసం 9705091727 సంప్రదించాలన్నారు. 

April 9, 2026 / 09:48 AM IST

సాగునీటి చెరువును పరిశీలించిన కలెక్టర్

కృష్ణా: పెడన మండలం మడిచర్ల గ్రామంలో చెరువును సాగునీటి సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు జగన్మోహన్ రావుతో కలిసి కలెక్టర్ బాలాజీ ఈరోజు పరిశీలించారు. చెరువు స్థితిగతులను వారిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని చెరువులను వర్షపు నీటితో నింపుకొని రైతులకు ఏలాంటి కొరత లేకుండా ఎల్లప్పుడూ సాగునీరు అందిస్తామన్నారు.

April 9, 2026 / 09:40 AM IST

విద్యుదాఘాతంతో ఆవు మృత్యువాత

VZM: విద్యుదాఘాతానికి గురై ఆవు మృతిచెందిన సంఘటన వంగర మండలం మద్దివలస గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వి.చందపు నాయుడు మద్దివలస కొట్టిశ రోడ్డులోని చెరువుగట్టు వద్ద ఆవులను మేపుతున్నాడు. ఈ క్రమంలో ట్రాన్స్ ఫార్మర్ విద్యుత్ వైర్లు ఆవుకు తగిలి విద్యుత్ షాక్‌తో అక్కడే మృతి చెందింది.

April 9, 2026 / 09:39 AM IST

ఇన్నోవా బోల్తా.. పలువురికి గాయాలు

E.G: నల్లజర్ల(M) ప్రకాశరావుపాలెం శివారు వైఎస్సార్ యూనివర్సిటీ సమీపంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

April 9, 2026 / 09:31 AM IST

వైసీపీ కాఫీకి విత్ క్యాడర్ కార్యక్రమం.. పలువురు పార్టీలో చేరిక

W.G: కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో భాగంగా 5వ వార్డు ఇంఛార్జ్ కాకర్ల శ్రీను ఇంటి వద్ద గురువారం ఉదయం ఏర్పాటు చేసిన కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో వైసీపీ తాడేపల్లిగూడెం ఇంఛార్జ్ వడ్డే రఘురాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురిని పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో దుర్గ ప్రసాద్, సతీష్, శ్రీను వార్డు ఇంఛార్జ్‌లు పాల్గొన్నారు.

April 9, 2026 / 09:30 AM IST

భక్తిశ్రద్ధలతో గంగమ్మ తల్లికి బోనాలు

KDP: సిద్ధవటం మండలం నేకనాపురం ఎస్సీ కాలనీలో గంగమ్మ జాతర సందర్భంగా గురువారం ఉదయం అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. గ్రామంలోని మహిళలు సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకుని బోనాలను మోసుకుంటూ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. డప్పుల మోత, భక్తుల జైకారాలతో కాలనీ అంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

April 9, 2026 / 09:30 AM IST

11న రైతు సంఘం ఆవిర్భావ వేడుకలు

KRNL: ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 11న జిల్లాలోని అన్ని గ్రామ శాఖల్లో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కార్యదర్శి పంపన గౌడ్ పిలుపునిచ్చారు. నందవరంలో బుధవారం మాట్లాడుతూ.. 1936 ఏప్రిల్ 11న ఆల్ ఇండియా కిసాన్ సభ స్థాపించబడిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి రైతుల హక్కుల కోసం పోరాటాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

April 9, 2026 / 09:30 AM IST

ఇందిరమ్మపై వ్యాఖ్యలు ఖండన

NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మపై వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనుచితమని టీడీపీ నేతలు మండిపడ్డారు. బుధవారం కొలిమిగుండ్ల టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి నంద్యాల రామేశ్వరరెడ్డి, మండల అధ్యక్షుడు మూలే రామేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

April 9, 2026 / 09:30 AM IST

నేడు యానాంలో ఎన్నికల పోలింగ్.. సర్వం సిద్ధం

కోనసీమ: యానాం అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సిబ్బంది ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గురువారం ఉదయం 7 గంటలకు అధికారిక పోలింగ్ ప్రారంభం కానుంది. బూత్ ఏజెంట్లు ఉదయం 5 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

April 9, 2026 / 09:24 AM IST

బాబు, ఆర్కే వ్యాఖ్యలపై కాకాణి ఫైర్

NLR: వైసీపీ మహిళా కార్యకర్తలపై ఏబీఎన్ ఆర్కే, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ నీచమైన సంస్కృతికి నిరసనగా ఏబీఎన్ కార్యాలయ ముట్టడికి పిలుపునివ్వగా పోలీసులు అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువలు మరిచి ఆడబిడ్డలను కించపరిస్తే సహించేది లేదన్నారు.

April 9, 2026 / 09:22 AM IST

అంబేద్కర్ వర్సిటీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ B.Ed, B.PEd, D.PEd సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ కావ్య జోష్ణ్న ఈ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక https://brau.edu.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చన్నారు.

April 9, 2026 / 09:22 AM IST