కృష్ణా: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం మహా విజ్ఞాపన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్షల మంది బాధితులు ఇంకా న్యాయం కోసం తిరుగుతున్నారన్నారు.