చిత్తూరు: ఈ నెల 27న జైన్ సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు జైన్ సంఘం కార్యదర్శి సుభాష్ జైన్ తెలిపారు. రాములవారిగుడి వీధిలోని జైన్ ప్రార్ధనా మందిరంలో ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకు ఈ శిబిరం జరుగుతుందన్నారు. కంటి వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి తిరుపతిలోని ఎస్వీ అరవింద కంటి ఆసుపత్రిలో శస్త్రచికిత్స ఉచితంగా చేయనున్నట్లు పేర్కొన్నారు.