CTR: ప్రైవేటు నర్సింగ్ స్కూల్లో జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రభావతిదేవి తెలిపారు. ఇంటర్లో సైన్స్ గ్రూప్లో పాస్ అయిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. రూ.500 డీడీతో దరఖాస్తులను ఈ నెల 29వ తేదీ లోపు చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు.