కోనసీమ: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి, దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది మంత్రికి అమ్మవారి చిత్రపటం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రం ప్రగతి పధంలో ముందుకు పయనించాలని ఆకాంక్షించారు.