ASR: జీ.మాడుగుల నుంచి పాడేరు వెళ్లే రహదారిలో హైవే నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నిర్మాణ పనుల్లో రోడ్డు బురదమయంగా మారింది. రోడ్డు మధ్యలో గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. బుధవారం సంతబయలు వద్ద ఒక లారీ గుంతల్లో కూరుకుపోయింది. సుమారు గంట పాటు శ్రమించి జేసీబీ సాయంతో వాహనాన్ని బయటకు తీశారు. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.